Chinni Serial Today july 30th: చిన్ని సీరియల్: కావేరి చనిపోయిన ప్లేస్‌లో గుండె పగిలేలా ఏడ్చేసిన మధు.. కావేరి తిరిగి వచ్చిందా?
Chinni Serial Today Episode july 30th కావేరి చనిపోయిన ప్లేస్‌కి చిన్ని వెళ్లి తల్లిని గుర్తు చేసుకొని వెక్కి వెక్కి ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode సీతాకోక చిలుక బొమ్మ చిన్ని వేసిందని మహికి తెలిసిపోతుంది. అందులో ఆర్ట్‌బై చిన్ని అని ఉండటం చూసి పొంగిపోతాడు. ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు. మహి, చిన్ని ఓ చోట చేరి ప్రిన్సిపల్ మేడం భర్త్‌డేకి ఏం గిఫ్ట్ ఇద్దామా అనుకుంటూ చిన్ని సీతాకోక చిలుక బొమ్మ వేయడం చిన్నికి బొమ్మ మధ్యతో తన పేరు రాయమని మహి చెప్పడం గుర్తు చేసుకుంటాడు.
మహి చిన్నప్పుడు ఆ డ్రాయింగ్‌ని నాగవల్లి ఫొన్‌లో చిన్నితో పాటు ఫొటో తీసుకుంటాడు. ఇప్పుడు అదంతా గుర్తు చేసుకొని మురిసిపోతాడు. తన ఫ్రెండ్‌తో ఈ బొమ్మ చిన్ని వేసిందిరా అని గెంతులేస్తాడు. ఆ పాప దగ్గరకు వెళ్లి ఎవరు ఈ బొమ్మ వేశారు అని అడుగుతాడు. ఒక అక్క వేసిందని పాప చెప్తుంది. పాపకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తాడు. ఇప్పుడే ఆ అక్క వెళ్లిందని పాప చెప్పడంతో అందరు అమ్మాయిల దగ్గరకు వెళ్లి చిన్ని చిన్ని అని పిలుస్తాడు. ఎవరూ లేకపోవడంతో తిరిగి ఆ పాప దగ్గరకు వచ్చి తను నేను చిన్నప్పటి ఫ్రెండ్స్ ఈ సారి తను వస్తే గుర్తు పడతావా.. అని అడుగుతాడు. నేను గుర్తు పడతా అని అంటుంది. ఈ సారి వస్తే తనకి నా కోసం చెప్పు అని నెంబరు ఇస్తాడు. పాప అడ్రస్ తీసుకుంటాడు. తన ఫ్రెండ్‌తో త్వరలోనే చిన్ని నాకు కనిపిస్తుంది ఇక్కడే చిన్ని ఉంది.. చిన్ని ఎక్కడున్నావ్ అని ఎగిరి గంతులేస్తాడు.
మధుమిత ఆ పాపని గుర్తు చేసుకొని తన గతం గుర్తు చేసుకొని ఏడుస్తూ వెళ్తుంది. చివరి సారిగా కావేరి, చిన్ని వెళ్లిన రోడ్డులో వెళ్తుంది. కావేరికి బులెట్ తగిలి చిన్ని అని అరవడం గుర్తు చేసుకొని ఆగుతుంది. చుట్టూ చూస్తుంది. చాలా కంగారు పడుతుంది మధు. కాస్తూ దూరంలో కావేరి చనిపోయిన ప్లేస్, ఆ చోట రాయి, చెట్టు చూసి మధు గుండె కొట్టుకోవడం వేగం పెరిగి చాలా భయపడుతుంది. బండి ఆపి ఆ ప్లేస్‌కి వెళ్తుంది. క్షమించమ్మా నీకు ఇచ్చిన మాట తప్పుతున్నాను అని అక్కడికి వెళ్తుంది.
కావేరి చనిపోయిన ప్లేస్ చూసి వణికిపోతూ ఏడుస్తుంది. విడిలేక నిన్నూ.. విడిపోయి ఉన్నా కలిసేలేనా నీ శ్వాస లోన అనే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఏడిపించేస్తుంది. అమ్మా అని మధు రాయి దగ్గర కూర్చొని చివరి సారి తల్లికి మాట ఇవ్వడం గుర్తు చేసుకొని చేయి చాపుతుంది. అమ్మా అమ్మా అని మధు చాలా ఏడుస్తుంది. మధు చేయి చాపగానే కావేరి చేయి వేసినట్లు మధు చేయిని తాకుతుంది. మధు చూస్తుంది. తర్వాత చూసే సరికి ఆ చేయి కనిపించదు. మధు అమ్మా అమ్మా అని గట్టిగా ఏడుస్తుంది.
అమ్మా.. ఇక్కడే ఇక్కడే నన్ను వదిలేసి వెళ్లిపోయావు.. నన్నుఎందుకమ్మా వదిలేసి వెళ్లిపోయావ్.. ఎందుకు వదిలేసి వెళ్లిపోయావ్.. ఈ పదేళ్లలో నిన్ను తలచుకోని రోజే లేదు. ఇన్నేళ్లు నిన్ను నాన్నని చూడకుండా ఎలా బతికానో తెలీదు.. జైలులో నాన్న లేడని తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నాన్నని కూడా చూడలేదమ్మా.. నువ్వుంటే నా కళ్లముందే ప్రాణాలు వదిలేశావు కానీ నాన్న ఉన్నాడు కదమ్మా.. ఎక్కడో ఒక దగ్గరుంటాడు కదా .. ఎక్కడున్నాడో తెలుసుకుంటే నాన్నని కలవొచ్చు కదా.. నీకు నాన్నకి దూరం అయినందుకు నేను ఎంత బాధ పడుతున్నానో మనల్ని దూరం అయినందుకు నాన్న ఎంత బాధపడుతుంటాడో.. నాన్నకి కలిసి విషయం చెప్తే కొంత అయినా బాధ తగ్గుతుంది కదా.. ఇంత వరకు ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదమ్మా.. నేను నాన్నని బాధ పెట్టానమ్మా తప్పు చేశానమ్మా.. నాన్న జైలులో లేడని తెలిసి ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయక చాలా పెద్ద తప్పు చేశానమ్మా ఇప్పుడు నేను చేసిన తప్పు సరిదిద్దుకుంటానమ్మా. అసలేం జరిగిందో జైలుకి వెళ్లి తెలుసుకుంటా. నాన్నని కచ్చితంగా కలిసి తీరుతా అని చిన్ని ఏడుస్తుంది. వెళ్తూ వెనక్కి వచ్చి కావేరి ఈ ఊరిని మనుషుల్ని మర్చిపోవాలని తీసుకున్న మాట గుర్తు చేసుకుంటుంది. గతాన్ని మర్చిపోతా అని మర్చిపోతా అని నీకు మాటిచ్చా మన గతానికి సంబంధించి ఎవరినీ కలవను అని మాటిచ్చాను కానీ ఇప్పుడు మాట తప్పుబోతున్నా అమ్మా.. అప్పుడు చిన్నదాన్ని కానీ ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను నాకేం కాదమ్మా.. నీకు ఇచ్చిన మాట తప్పుతున్నా నన్ను క్షమించమ్మా అని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















