Chinni Serial Today july 16th: చిన్ని సీరియల్: అర్ధరాత్రి లోహితని చెట్టుకి కట్టేసిన మధు.. వెక్కి వెక్కి ఏడుస్తున్న లోహిత.. వీడియో వైరలైతే?
Chinni Today Episode మధుని లోహిత ఏడిపించడం మధు కోపంతో రాత్రి పూట చిన్నిని చెట్టుకి కట్టేసి వెళ్లిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధుమిత ఇంట్లో అమ్మానాన్న తమ్ముడితో కలిసి భోజనం చేస్తుంటుంది. ఆవకాయ కలుపుకొని అందరూ సంతోషంగా తింటుంటారు. స్వరూప భర్తతో గుడిలో మధు జాతకం చూపించామని గొప్పింటి సంబంధం వస్తుందని చెప్తుంది. మధు పొలమారుతుంది. చంటి అక్కతో బావ తలచుకున్నట్లు ఉన్నాడని చెప్తాడు.
చంటి అక్కతో నువ్వు కాలేజ్‌లోకి వెళ్తున్నావ్ కదా ప్రేమలో పడ్డావా చెప్పు అక్క మాకు సంబంధాలు చూసే పని తప్పుతుందని అంటాడు. అందరూ పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. మధు మాత్రం ఇళ్లరికం పెళ్లి చేసుకుంటానని అంటుంది. సుబ్బు ఇళ్లరికం పెళ్లే చేస్తానని అంటాడు. ఇక మధు ఎంటెక్ పూర్తి చేసి మంచి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాతే పెళ్లి అంటుంది. అందరూ సరే అంటారు. మహి ఇంట్లో కూర్చొని చిన్ని.. మై డియర్ చిన్ని పదేళ్ల నిరీక్షణ.. అంతు లేని నా ప్రేమ నీ కోసం.. నువ్వే నా సర్వస్వం.. నువ్వు కనిపిస్తే నా కల నిజం అవుతుంది.. చిన్నితోనే నా జీవితం..చిన్నినే నా సర్వస్వం.. వస్తున్నా నీ కోసం వస్తున్నా అని అంటూ కవిత్వం రాస్తుంటాడు. అప్పుడే వరుణ్ వచ్చి ఏంటి బావ కవిత్వం రాస్తున్నావా అని అడుగుతాడు. దానికి మహి కవిత్వమో ఏమో తెలీదు కానీ నా ఫీలింగ్స్ రాస్తున్నా బావ అని చెప్తాడు. వరుణ్ చదవమని అంటే మహి వద్దంటాడు. దాంతో నా దగ్గర మొహమాటం ఎందుకు చదువు బావ అని అంటే మహి చదువు తాడు. దూరం నుంచి నాగవల్లి అది విని చిరాకుపడుతుంది.
వరుణ్ మహితో చాలా బాగా రాశావ్ బావ. అర్థమైంది నీ మనసు ఎంతగా జ్ఞాపకాల భారం మోస్తుందో అర్థంమైంది తొందర్లోనే ఆ భారం తగ్గిపోతుందని అంటాడు. దాంతో మహి వరుణ్‌ని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తాడు. నాగవల్లి మనసులో ఓసేయ్ చిన్ని చచ్చినా నువ్వు నా కొడుకుని వదలడం లేదు కదే.. తీసేయాలి నా కొడుకు మనసులో ఆ చిన్నిని తీసేయాలి.. వాడి మనసులో శ్రేయ వైపు మళ్లేలా చూడాలి అని అనుకుంటుంది. మరవైపు లోహిత తన ఫ్రెండ్స్‌తో బుక్స్ షాక్‌లో ఉంటుంది. మధు, తన ఫ్రెండ్ కూడా బుక్స్ కోసం అక్కడికి వస్తారు. లోహిత మధుని చూస్తుంది. దీన్ని వదలకూడదు అని అనుకొని ఓ పేపర్ మీద ఐ యామ్ డాంకీ అని రాసి మధు వీపు మీద అతికిస్తుంది. అందరూ మధుని చూసి నవ్వుతారు.
మధు కోపంగా ఏంటి నా ముఖం మీద ఏం కనిపిస్తుందని అడిగితే నీ వెనకాల గాడిదలు కనిపిస్తున్నాయని అంటుంది. దాంతో మధు ఫ్రెండ్ చూసి నీ వెనక ఎవరో గాడిద అని రాశారే అని అంటుంది. మధు కోపంతో ఎవరే ఇలా చేసింది. చెప్తారా తాట తీయాలా అని అంటుంది. లోహిత దూరం నుంచి చూసి నవ్వుకుంటుంది. మధు లోహితను చూసి ఎదుటి వారిని బాధ పెడితే ఎలా ఉంటుందో నీకు ఇప్పుడు చూపిస్తానే అని లోహితను ఈడ్చుకుంటూ వెళ్లి ఓ చెట్టుకి కట్టేస్తుంది. లోహిత కోపంగా విప్పమని ఎంత చెప్పినా మధు విప్పకుండా కోపంగా చూస్తుంది. లోహిత ఫ్రెండ్‌ని బెదిరించి పంపేస్తుంది. తర్వాత ఆ పేపర్ లోహితకు అతికిస్తుంది. అందరూ లోహితకు వీడియో తీస్తారు. లోహిత ఏడుస్తూ వీడియో తీయొద్దని ఏడుస్తుంది.
మధు అందర్ని పంపేస్తుంది. వెళ్లొద్దని లోహిత అందర్ని బతిమాలుతుంది. కట్లు విప్పమని చెప్తుంది. వీడియో వైరల్ అయితే కాలేజ్‌లో తలెత్తుకోలేనని ఏడుస్తుంది. మధు వాళ్ల కూడా వెళ్లిపోతారు. చాలా రాత్రి అయిపోతుంది. సమీపంలో ఎవరూ ఉండరు. లోహిత చాలా ఏడుస్తుంది. అటుగా లోహిత తల్లి ఆటోలో వెళ్తుంది. లోహిత ఆటో అన్న ఆటో అన్న అని పిలిచి ఆటోలో తల్లిని చూసి అమ్మా అమ్మా నేను లోహిత అని పెద్దగా అరుస్తుంది. అయినా ఆటో ఆగకుండా వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: షాకింగ్.. విహారి కిడ్నాప్.. నడి రోడ్డు మీద కారు.. అర్థరాత్రి ఏం జరిగింది?





















