Chinni Serial Today August 12th: చిన్ని సీరియల్: కీర్తి సూసైడ్, మధు ధైర్యంతో లోహిత సస్పెండ్! కాలేజీలో అసలేం జరిగింది?
Chinni Serial Today Episode August 12th మధుమిత సీసీ టీవీ ఫుటేజ్ తీసుకొచ్చి లోహిత, శ్రేయల్ని పట్టించి కీర్తిని కాపాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode కీర్తి ఏడుస్తూ వెళ్లడం మధుమిత చూసి చందుతో మాస్టారూ కీర్తి ఎందుకు ఏడుస్తూ వెళ్తుంది అని అడుగుతుంది. దాంతో చందు బీటెక్ ప్రశ్నాపత్రం దొంగతనం చేసిందని డిబార్ చేశారని గదిలో తన వాచ్ కూడా దొరికిందని చెప్తాడు.
మధుమిత ఆలోచించి లోహిత కీర్తి వాచ్ కొట్టేయడం చూసి లోహి వాళ్లు తప్పు చేసి కీర్తిని బలిపశువుని చేసిందని అనుకుంటుంది. కీర్తి బయట కూర్చొని ఏడుస్తుంటే అందరూ వచ్చి కీర్తిని తిట్టి ఛీ ఛీ అంటారు. దాంతో కీర్తి చనిపోవాలని డిసైడ్ అయిపోతుంది. కీర్తి పరుగు పెట్టడం చూసిన మధు కీర్తి వెంట పరుగులు పెడుతుంది. కీర్తి బిల్డింగ్ మీదకు ఎక్కుతుంది. అందరూ చూసి కీర్తి వద్దు కీర్తి వద్దు అని అంటారు. లోహిత శ్రేయతో చేసిన దొంగతనం బయట పడినందుకు సూసైడ్ చేసుకుంటున్నట్లు నాటకం చేస్తుందని అంటుంది.
మధు వెళ్లి కీర్తిని కాపాడుతుంది. నన్నెందుకు కాపాడావు అని కీర్తి ఏడుస్తుంది. దాంతో మధు నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు.. నువ్వు టాపర్‌వి నీ గురించి అందరూ చెప్తుంటారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నువ్వు ఏతప్పు చేయలేదని నేను నిరూపిస్తా అని మధుమిత చెప్తుంది. కీర్తిని దగ్గరకు తీసుకొని ఓదార్చుతుంది. తర్వాత మధు మహికి విషయం చెప్పి కీర్తిని ఇరికించారు కీర్తిని నిర్దోషిగా నిరూపించాలి అని అంటుంది. సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది కదా అని మహి అంటాడు. సీసీ కెమెరాలు ఆపేశారని మధు చెప్తుంది. దాంతో మహి మన దగ్గర ఆపేస్తే ఏంటి కాలేజ్ చుట్టూ ఉంటాయి కదా అంటాడు. మంచి ఐడియా ఇచ్చావని మధు మహి బుగ్గలు గిచ్చేస్తుంది.
మధు ఓ షాప్ దగ్గరకు వెళ్లి షాప్ ఓనర్‌కి విషయం చెప్పి సీసీ టీవీ ఫుటేజ్ అడుగుతుంది. రెండు మూడు షాపులు తిరిగిన తర్వాత ఓ షాప్ దగ్గర లోహిత, శ్రేయలు ఇదంతా చేశారని మధు తెలుసుకొని ఫుటేజ్ పెన్ డ్రైవ్‌లో ఎక్కిస్తుంది. ఫుటేజ్ తీసుకెళ్లి ప్రిన్సిపాల్ వాళ్లకి చూపిస్తుంది. లోహితను చూసి చందు షాక్ అయిపోతాడు. ప్రిన్సిపాల్ వాళ్లని పిలవమని చెప్తారు. సెక్యూరిటీ లోహిత వాళ్లని పిలుస్తారు. ఇద్దరూ టెన్షన్ పడుతూ వెళ్తారు. లోహిత వాళ్లు వెళ్లగానే సీసీ టీవీ ఫుటేజ్ వేసి ప్రిన్సిపాల్ ఇద్దరినీ తిడతారు. చందు చల్లిని కోపంగా చూస్తాడు. పేపర్ కొట్టేసి మీరు క్రైమ్ చేయడమే కాకుండా కీర్తి మీద వేశారు. తను సూసైడ్ చేసుకోవాలని అనుకుంది తను చనిపోయి ఉంటే ఏంటి పరిస్థితి అని లోహిత వాళ్లని తిట్టి మధుకి థ్యాంక్స్ చెప్తారు.
లోహిత, శ్రేయల్ని డిబార్ చేస్తానని ప్రిన్సిపాల్ అంటారు. ఇద్దరూ బతిమాలుతారు అయినా ప్రిన్సిపాలు ఒప్పుకోరు. దాంతో శ్రేయ హోంమినిస్టర్ మేనకోడలు అని చెప్పడంతో ప్రిన్సిపాల్ శ్రేయని పంపేస్తారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత చందుని లోహిత బతిమాలుతుంది. ఇక లోహిత అయితే హోంమినిస్టర్ మేనకోడలు కాబట్టి తను చెప్పినట్లు చేశానని లోహిత అంటుంది. ప్రిన్సిపాల్ చందుని చూసి లోహితను వదిలేస్తాడు. కాకపోతే వారం సస్పెండ్ చేస్తారు. చందు ప్రిన్సిపాల్‌కి థ్యాంక్స్ చెప్తాడు. లోహిత మధునే ఇదంతా చేసిందని నిన్ను వదిలి పెట్టను మధు అని అనుకుంటుంది. ఇక అందరూ మధుని కాలేజ్‌లో హీరోని చేసేస్తారు. కీర్తి మధుని హగ్ చేసుకుంటుంది. థ్యాంక్స్ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















