అన్వేషించండి

Chinni Serial Today August 11th: చిన్ని సీరియల్: కీర్తి జీవితం ఛిన్నాభిన్నం.. కాలేజ్ నుంచి బహిష్కరణ, వల్లి హారతి మీద ఎందుకు ఒట్టేసింది?

Chinni Serial Today Episode August 11th వల్లి హారతి మీద ఒట్టు పెట్టి వసంతకి మాటివ్వడం.. లోహిత కీర్తిని డిబార్ చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహి వాలీబాల్ ఆడుతుంటే మధు పేపర్ కెమెరా చేసి చిన్న పిల్లలా అందరికీ ఫొటోలు తీస్తుంది. మహి దగ్గరకు వెళ్లి ఫొటోలు తీస్తూ ఫోజివ్వమని అంటుంది. మహి ఫోజ్‌లు ఇచ్చి నీకు ఈ టాలెంట్ కూడా ఉందా అయితే నీకు బండెడు పేపర్లు ఇచ్చి కెమెరాలు చేయిస్తాలే అంటాడు. 

లోహిత టెన్షన్‌ పడుతూ రావడం మధుమిత చూస్తుంది. ఏంటి ఇంత టెన్షన్‌ పడుతుంది అని గమనిస్తుంది. లోహిత కీర్తి అనే ఓ తెలివైన అమ్మాయి చదువుకుంటూ ఉంటే అక్కడికి వెళ్లి మాటలు కలిపి ఆ అమ్మాయి వాచ్‌ తీసుకుంటుంది. ఇదేంటి కీర్తి వాచ్ తీసుకుందని మధుమితకి అనుమానం వచ్చి ఫాలో అవుతుంది. లోహిత కీర్తి వాచ్ పట్టుకొని పరీక్షా పేపర్లు ఉన్న గది వైపు వెళ్తుంది. లోహిత ఎటు వెళ్లిందో మధుకి అర్థం కాదు దాంతో మధు వేరే వైపు వెతుకుతుంది. లోహిత ఏం చేస్తుందో అని మధు ఆలోచిస్తుంది. 

శ్రేయ చాలా టెన్షన్ పడుతుంటే లోహిత శ్రేయ దగ్గరకు వెళ్తుంది. శ్రేయ చాలా భయపడుతుంది.  మా మామయ్యకి తెలిసినా మా అమ్మకి తెలిసినా చంపేస్తారని శ్రేయ అంటే ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పాను కదా నువ్వు ధైర్యంగా ఉండు అని లోహిత చెప్తుంది. మరోవైపు పనామె ఇంట్లో పనులు అన్నీ అయిపోయినట్లు వసంతకు చెప్తుంది. మ్యాడీ గది క్లీన్ చేశావా అంటే లేదమ్మా మ్యాడీ రూంలోకి ఎవరూ వెళ్లరు.. నాగవల్లి మేడం కూడా వెళ్లరు అని చెప్తుంది. దాంతో వసంత మ్యాడీ రూంలో అంతగా ఉంది.. ఎందుకు ఎవరినీ వెళ్లనివ్వరు అని చూద్దామని గదిలోకి వెళ్తుంది. అక్కడ చిన్ని ఫొటోలు.. ఐలవ్‌యూ అని రాసి ఉండటం చూసి షాక్ అయిపోతుంది. వెంటనే నాగవల్లికి పిలుస్తుంది. 

నాగవల్లి మీదకు రాగానే వసంత నాగవల్లికి మహి గది చూపిస్తుంది. చిన్ని అని పువ్వులతో రాసుకోవడం, ఐలవ్‌యూ అని రాయడం, గది నిండా చిన్ని ఫోటోలు చూసి నాగవల్లి బిత్తరపోతుంది. వాడి మనసు మార్చేస్తాను అన్నారు. అది మీరు చేయలేరు.. వాడు చిన్నిని మామూలుగా ప్రేమించడం లేదు.. కలిసి జీవిస్తున్నాడు.. నా కూతురి పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. దాంతో వల్లి నీ కూతురే నా ఇంటి కోడలు ఇందులో ఎలాంటి మార్పు లేదని వసంతని దేవుడి గదికి తీసుకెళ్లి హారతి వెలిగించి దాని మీద ప్రామిస్ చేసి ఇటు సూర్యుడు అటు తిరిగానా.. నింగి విరిగి నేల మీద పడినా.. నీ కూతురు ఈ ఇంటి కోడలు అవుతుందని ఈ దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అని అంటుంది. 

మరోవైపు కాలేజ్‌లో ప్రిన్సిపల్ సీసీ కెమెరాలు ఆపి నా గదిలోకి వచ్చి సీల్ వేసిన క్వశ్చిన్ పేపర్లు కొట్టేశారు అంటే వాళ్లు క్రిమినల్సే మొత్తం వెతకండి ఏందో ఒక క్లూ ఉంటుందని అంటారు. చందు మిగతా స్టాఫ్ అంతా మొత్తం వెతికి కీర్తి వాచ్ గుర్తిస్తారు. ఆ అమ్మాయే ఇదంతా చేసుంటుంది అని ప్రిన్సిపల్‌ తనని పిలవమని అంటారు. లోహిత బయటకు వెళ్తూ దట్ ఈజ్ లోహిత అనుకుంటుంది. శ్రేయ లోహిత దగ్గరకు వచ్చి నన్ను కాపాడాలి అని తనని బుక్ చేశావా అంటే లేదు మనం వెళ్లిన తర్వాత తను వెళ్లుంటుందేమో అని అంటుంది. శ్రేయ వెళ్లిపోయిన తర్వాత ఇదంతా నీ కోసం కాదే నీ అన్న కోసం అని లోహిత అనుకుంటుంది. 

కీర్తి ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్తుంది. కీర్తినే పేపర్ దొంగతనం చేసిందని ప్రిన్సిపాల్ కీర్తిని తిడతారు. కీర్తి ఏడుస్తుంది. ప్రతీ సంవత్సం ఇలా చేసే కాలేజ్ టాపర్ అయిపోతున్నావా అని తిడతారు. కీర్తి ఏడుస్తూ ఎంత చెప్పినా వినకుండా నీ లాంటి వాళ్లు ఇక్కడ ఉండనే ఉండకూడదు అని కీర్తిని డిబార్ చేస్తారు. కీర్తి చాలా ఏడుస్తుంది. ఏం తప్పు చేయలేదు అని ఎంత బతిమాలినా ప్రిన్సిపాల్ వినరు. క్యాంపస్‌లో సెలక్ట్ అయ్యాను సార్ నా ఫ్యామిలీ నా మీద ఆధారపడి ఉంది.. అర్థం చేసుకోండి అని చాలా ఏడుస్తుంది. ప్రిన్సిపాల్ కాలు కూడా పట్టుకుంటుంది. కానీ కీర్తిని గెంటేస్తారు. కీర్తి ఏడుస్తూ వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
H1B visa: హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
Embed widget