అన్వేషించండి

CM Revanth Reddy: దసరా వేడుకలకు సొంతూరుకు సీఎం రేవంత్‌రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం, ఆలయాల్లో పూజలు

CM Revanth Reddy: దసరా సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి సొంతూరు కొండారెడ్డిపల్లికి చేరుకున్నారు. గ్రామస్థులు సీఎంకు ఘన స్వాగతం పలికారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సాయంత్రం మైసమ్మ, జమ్మిచెట్టుకు పూజలు చేయనున్నారు.

CM Revanth Reddy: దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లికి వెళ్లారు. కుటుంబ సమేతంగా సొంతవూరుకు చేరుకున్న సీఎంకి స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.

ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు 

కొండారెడ్డిపల్లికి చేరుకున్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి గ్రామస్థులతో కలిసి ర్యాలీగా స్థానిక శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు, ఆలయ అర్చకులు సీఎం దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు.

గ్రామస్థులు, ప్రజాప్రతినిధులతో భేటీ 

అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి తమ గ్రామానికి చెందిన ప్రజలను, స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read: తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన

సాయంత్రం పూజా కార్యక్రమాలు 

దసరా పండుగ సంప్రదాయంలో భాగంగా సాయంత్రం వేళ స్థానిక మైసమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.  అనంతరం విజయదశమికి అత్యంత ప్రాధాన్యత ఉన్న జమ్మిచెట్టు పూజ కార్యక్రమంలో పాల్గొని, పండుగ వేడుకలను ముగించనున్నారు.  తెలంగాణ సంస్కృతిలో విజయదశమి రోజు జమ్మిచెట్టుకు (శమీ పూజ) పూజలు చేసి, జమ్మి ఆకులను 'బంగారం'గా భావించి ఇంటికి తీసుకెళ్లడం ఆచారం. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఏటా తన గ్రామంలోని పెద్దలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొంటారు. 

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పండుగల సమయాల్లో సొంతూరు రావడం రేవంత్‌రెడ్డి ఆనవాయితీగా పెట్టుకున్నారు. తన బాల్యం, రాజకీయ జీవితం ఈ ప్రాంతంతో ముడిపడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటారు. 

Also Read: పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్

Frequently Asked Questions

ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ఏ ఆనవాయితీని పాటిస్తున్నారు?

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పండుగల సమయాల్లో సొంతూరుకు రావడం రేవంత్ రెడ్డి ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆయన బాల్యం, రాజకీయ జీవితం ఈ ప్రాంతంతో ముడిపడి ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
CM Revanth Reddy: 34 నెలల నుంచి కంటి నిండా నిద్రలేదు, ఫ్యామిలీని సైతం పట్టించుకుంటలేను: సీఎం రేవంత్‌రెడ్డి
34 నెలల నుంచి కంటి నిండా నిద్రలేదు, ఫ్యామిలీని సైతం పట్టించుకుంటలేను: సీఎం రేవంత్‌రెడ్డి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
CM Revanth Reddy Birthday: కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
Embed widget