అన్వేషించండి

KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 

KTR Latest News:సవాళ్లు చేసి పారిపోవడం మంత్రులు, ముఖ్యమంత్రికి అలవాటైపోయిందని కేటీఆర్ మండిపడ్డారు. చేతనైతే అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చించాలని డిమాండ్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం సవాళ్లు చేసి పారిపోతుందని తీవ్రంగా విమర్శించారు.
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పులపై కేసీఆర్‌కు చర్చ సవాల్ విసిరారు.
  • కేటీఆర్‌ స్వీకరించగా, మంత్రి జూపల్లి తెలంగాణ భవన్‌లో చర్చకు సిద్ధమన్నారు.
  • కేటీఆర్‌ ఎదురుచూసినా జూపల్లి హాజరుకాలేదు, కాంగ్రెస్‌ను ఎద్దేవా చేశారు.

KTR Latest News: తెలంగాణ అప్పులు, అవినీతి అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న సవాళ్ల రాజకీయం ఇంకా సద్దుమణగలేదు. చాలా సార్లు ఇలాంటి సవాళ్లు చేసి తప్పించుకొని పారిపోయారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సవాళ్లు చేసి పోరిపోయిన ప్రభుత్వం దీన్నిపై అసెంబ్లీలోనైనా చర్చించాలని డిమాండ్ చేశారు. అక్కడైతే స్పీకర్‌ వాళ్లకు రక్షణగా ఉంటారని అన్నారు. తమకు ఎలాంటి అడ్డంకులు లేకుండా గంట మైకు ఇచ్చి వారు ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చని అన్నారు. సవాల్ చేసింది వారేనని, పారిపోయంది కూడా వారేనని అన్నారు.

తెలంగాణను అప్పుల్లో ముంచి ప్రభుత్వాన్ని అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఎక్కడైనా చర్చకు కేసీఆర్ వస్తే సిద్ధమని సవాల్ చేశారు. దీనిపై రియాక్ట్ అయిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తాము కూడా సిద్ధమని ప్రకటించారు. టైం, ప్లేస్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో తాము చేసినవి, రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినవి చర్చిద్దామని అన్నారు. అయితే దీనికి స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, కేటీఆర్‌తో చర్చించేందుకు తాను సిద్ధమని వెల్లడించారు. ఎక్కడో ఎందుకు తెలంగాణ భవన్‌కే వస్తానని కూడా ప్రకటించారు. గురువారం ఉదయం 11 గంటలకు చర్చిద్దామని అన్నారు. 

మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్‌ను సీరియస్‌గా తీసుకున్న బీఆర్‌ఎస్‌ తెలంగాణ భవన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉదయమే కేటీఆర్‌, హరీష్‌రావు లెక్కలతో తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఇంతలో గన్‌పార్క్ వద్దకు చర్చకు రమ్మని మంత్రులు పిలవడంతో హరీష్‌రావు అక్కడకు వెళ్లారు. కానీ కేటీఆర్‌ మాత్రం జూపల్లి కోసం ఎదురు చూశారు. 

పన్నెండున్నర దాటిన జూపల్లి రాకపోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ మీడయా ముందుకు వచ్చారు. మంత్రి కోసం ప్రత్యేకంగా కుర్చీ వేసి శాలువా కూడా రెడీ చేశామని, యినా ఆయన రాలేదని ఎద్దేవా చేశారు. అప్పులు అభివృద్ధిపై చర్చిద్దామని సవాల్ చేసి వస్తానని చెప్పిన మంత్రి పారిపోయారని అన్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రులకు, ముఖ్యమంత్రికి ఇదొక అలవాటుగా మారిందన్నారు. 

రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌కు తాము స్పందిస్తే మధ్యలో మంత్రి జూపల్లి జోక్యం చేసుకున్నారని, సరే ఆయనైనా వస్తారని అనుకుంటే తోకముడిచారని కేటీఆర్ మండిపడ్డారు. తనకు తానుగానే తెలంగాణ భవన్‌కు వస్తానని చెప్పారని, ఇప్పుడు గన్ పార్క్ అంటూ మాట మార్చారని చెప్పారు. అక్కడకు వెళ్తే చార్మినార్‌ అంటారని ఎద్దేవా చేశారు. ఎక్కడికైనా తాము బయల్దేరితే తెలంగాణ భవన్‌ దాటక ముందే అరెస్టు చేస్తున్నారని అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని డ్రామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు జూపల్లికి తన శాఖలో ఏ జరుగుతుందో తెలియదని, ముఖ్యమంత్రి, ఆయన మధ్య జరిగిన పంచాయితీకి ఒక అధికారి ఉద్యోగం వదిలి వెళ్లిపోయారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చర్చకు వస్తానని చెప్పి పారిపోయారని అన్నారు. అసమర్థుడి జీవన యాత్రలా సీఎం రేవంత్ పాలన ఉందని కేటీఆర్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మించామని, దాని కంటే ఒక్క ఇంటినైనా నిర్మిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించారు.  

Frequently Asked Questions

అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు దేని గురించి సాగుతున్నాయి?

తెలంగాణ అప్పులు, అవినీతి, అభివృద్ధిపై అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు సాగుతున్నాయి. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని ఎవరు ప్రకటించారు?

మంత్రి జూపల్లి కృష్ణారావు కేటీఆర్‌తో చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. గురువారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌కే వస్తానని వెల్లడించారు.

జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్‌కు చర్చకు వచ్చారా?

మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం 11 గంటలకు తెలంగాణ భవన్‌కు రాలేదు. 12:30 దాటిన ఆయన రాకపోవడంతో కేటీఆర్ మీడియా ముందుకు వచ్చారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget