అన్వేషించండి

BRS Leader Harish Rao Arrest: తెలంగాణలో గురుకులాల టెండర్లపై రగడ! మంత్రులతో చర్చకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌ నేతలు! పోలీసుల అడ్డగింత, అరెస్టు!

BRS Leader Harish Rao Arrest: గన్‌పార్క్ వద్ద మంత్రులతో చర్చించేందుకు బయల్దేరిన బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.  

BRS Leader Harish Rao Arrest: తెలంగాణలో గురుకులాల టెండర్ల విషయంలో రాజకీయ రగడ రాజుకుంది. ఇందులో భారీ అక్రమాలు జరిగాయని చాలా రోజుల నుంచి బీఆర్‌ఎస్ ఆరోపిస్తూ వస్తోంది. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధపడాలని బీఆర్‌ఎస్‌ నేత ప్రవీణ్‌ కుమార్‌ సవాల్ చేశారు. వాటితో ఇతర కుంభకోణాలపై కూడా చర్చిద్దామని కాంగ్రెస్ నేతలు సవాల్ చేశారు. దీనికి ప్రెస్‌క్లబ్‌ను వేదికగా చేసుకున్నారు. అయితే ఈ ఉదయం గన్‌ పార్క్ వద్దకు చేరుకున్న మంత్రులు చర్చకు తాము సిద్ధమని అయికే కేసీర్, హరీష్‌, కేటీఆర్‌ రావాలని సూచించారు. దీనికి స్పందించిన బీఆర్‌ఎస్ నేతలు గన్ పార్క్ వద్దే చర్చిద్దామని ప్రతిసవాల్ చేశారు. అక్కడకు బయల్దేరిన హరీష్‌ సహా కీలక నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

తెలంగాణలో అప్పులు, అభివృద్ధి, కుంభకోణాల చుట్టే రాజకీయం తీరుగుతోంది. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిలో అవినీతి రాజ్యమేలుతోందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తూ వస్తోంది. దీనికి కాంగ్రెస్ కౌంటర్ ఇస్తూ వచ్చింది. బ్రోకర్లకు, డ్రగ్స్ సప్లయర్స్‌కు టెండర్లు కట్టబెట్టారని, తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని ఎక్కడైనా చర్చకు సిద్ధమని, ముఖ్యమంత్రి వస్తారా అని సవాల్ చేశారు బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్‌కుమార్. దీనికి కాంగ్రెస్‌ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ వచ్చింది. కాంగ్రెస్ లీడర్‌ బల్మూరి వెంకట్‌ సవాల్ స్వీకరించారు. ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలని అన్నారు. అందుకు ప్రవీణ్ కుమార్ సిద్ధమయ్యారు. 

అయితే ఈ చర్చకు ప్రవీణ్‌ వస్తే కుదరని, కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులో ఒకరు రావాలని కాంగ్రెస్‌ నుంచి డిమాండ్ వచ్చింది. వారు ఎక్కడైనా ప్లేస్ చెబితే తాము చర్చించేందుకు సిద్ధమని కాంగ్రెస్ మంత్రులు రెడీ అయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ గన్‌పార్క్ వద్దకు వెళ్లి నివాళి అర్పించి బైఠాయించారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఎప్పుడు ఎక్కడకు పిలిస్తే తాము అక్కడకు వస్తామని అన్నారు. 

అప్పటికే తెలంగాణ భవన్‌లో రెడీగా ఉన్న కేటీఆర్, హరీష్‌, ప్రవీణ్‌కుమార్‌ గన్ పార్క్ వద్దే చర్చిద్దామని అన్నారు. మంత్రుల యాక్షన్‌కు రియాక్షన్‌గా వెంటనే హరీష్‌, ప్రవీణ్‌ కుమార్‌ తమ కారులో గన్‌పార్క్ వద్దకు బయల్దేరారు. గురుకులాల టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయని వాటిని మంత్రుల ముందు పెట్టి నిజానిజాలు నిగ్గు తేలుస్తామని పేర్కొన్నారు. 

అయితే హరీష్‌, ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు తెలంగాణ భవన్ గేటు దాటక ముందే అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు మంత్రులు ఉండే ప్రాంతానికి వెళ్తే శాంతి భద్రతల ఇష్యూ వస్తుందని అందుకే వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. అయితే తమను మంత్రులే ఆహ్వానించారని, పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని మండిపడ్డారు. అయినా పోలీసులు వారి కాన్వాయ్‌ను ముందుకు కదిలేందుకు అనుమతి ఇవ్వలేదు. 

కారులో ఉంటూనే గన్‌పార్క్‌ వద్ద ఉన్న మంత్రులు అజారుద్దీ, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్‌కు హరీష్‌రావు ఫోన్ చేశారు. వాళ్లెవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ విషయాన్ని మీడియాకు వివరించారు. మంత్రులు సవాల్ చేసి వెనుక నుంచి పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పించుకొని పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. వారికి నిజంగానే తప్పు చేయలేదని కాన్ఫిడెన్స్ ఉంటే తమకు అనుమతి ఇవ్వాలని సవాల్ చేశారు. 

వాహనాలను వదలకపోవడంతో హరీష్‌ రావు కారు దిగి కాలినడకన వెళ్లేందుకు యత్నించారు. ఆయన్ని మిగతా నేతలు అనుసరించే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. హరీష్‌రావుతోపాటు మిగతా నేతలను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి తరలించేశారు. ఈ క్రమంలో వారిని తరలించే వాహనాలను బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంకో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

అదుపులోకి తీసుకున్న తర్వాత హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. మంత్రుల వద్ద విషయం లేదని అందుకే పోలీసులను అడ్డం పెట్టుకొని పారిపోయాదని మండిపడ్డారు. టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగిందని ఒప్పుకున్నారని, అయినా సరే దీన్ని ఇక్కడితే వదిలే ప్రసక్తే లేదని అన్నారు. అసెంబ్లీలోనే ప్రభుత్వాన్ని ఎండగడతామని అన్నారు. వారి అవినీతి ప్రజల ముందు ఉంచుతామని అన్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget