Chinni Serial August Episodes: చిన్ని సీరియల్ వీక్లీ: మధుకి బాలరాజు కనిపించాడా? మహి-చిన్నిల బంధం ఏంటి? శ్రేయ-లోహితల పరీక్షల్లో ట్విస్ట్! హైలైట్స్ ఇవే!
Chinni Serial August 4th to 9th Weekly Recapమధు, మహిలు స్నేహితులు అవ్వడం, మధు బాలరాజుని చూడటం, మధునే చిన్ని ఏమో అని మహికి అనుమానం రావడం లాంటి ట్విస్ట్‌లతో ఈ వారం ఎపిసోడ్స్ ఆసక్తికరంగా మారాయి.

Chinni Serial August 4th to 9th Weekly Episode మధుమిత మీద రౌడీలు అటాక్ చేయడం మహి సమయానికి మధుని కాపాడి హాస్పిటల్‌లో జాయిన్ చేసి రక్తం ఇచ్చి మధు ప్రాణాలు కాపాడుతాడు. మహిని హాస్పిటల్‌లో చూసిన డాక్టర్ నాగవల్లికి ఫోన్ చేసి మహి హాస్పిటల్‌లో ఉన్నాడని చెప్పడంతో నాగవల్లి కంగారు పడి హాస్పిటల్‌కి పరుగులు తీస్తుంది. రాహుల్ నాగవల్లికి జరిగింది చెప్తాడు. మధుమిత తల్లి, తండ్రి, తమ్ముడు అందరూ మహిని దండం పెట్టి తమ పాలిట దేవుడివని పొగుడుతారు. మ్యాడీ ఎవరికీ రక్తం ఇచ్చాడా అని వల్లి చూడాలని వెళ్లి మధుని చూసి గతంలో జరిగిన గొడవ గుర్తు చేసుకొని షాక్ అయిపోతుంది. నాతో గొడవ పడిన నా శత్రువుకి మ్యాడీ కాపాటమే కాకుండా బ్లడ్ కూడా ఇస్తున్నాడా ఛా అని వల్లి అనుకుంటుంది.
బాలరాజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ కళ్లు తిరిగిపడిపోబోతే ఒకాయన పట్టుకొని దగ్గర్లో హాస్పిటల్‌కి వెళ్లమని ఆటోని పిలిచి ఎక్కి పంపిస్తాడు. మధు వాళ్లు ఉన్న హాస్పిటల్‌కే బాలరాజు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. మధుని రూమ్‌కి మార్చడంతో సుబ్బు, స్వరూప, చంటి, పద్దులు కలిసి మాట్లాడుతారు. మధు మ్యాడీ గురించి అడుగుతుంది. మ్యాడీ మందులు తీసుకొని వస్తాడు. మధు మ్యాడీతో థ్యాంక్యూ మ్యాడీ సమయానికి నువ్వు నన్ను కాపాడకపోయి ఉంటే నా డెడ్ బాడీ మా ఇంట్లో ఉండేది అని అంటుంది. చంటి మధుతో మీ ఫ్రెండ్ హనుమంతుడిలాంటి వాడు అక్క సంజీవని తీసుకొచ్చినట్లు నీకు రక్తం ఇచ్చి కాపాడాడని అంటాడు. మళ్లీ మధు థ్యాంక్స్ చెప్పి చేతులు జోడించి దండం పెడతుంది. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని అంటుంది. సుబ్బు కూడా దండం పెడతాడు.
మరోవైపు నాగవల్లి మహి రావడం లేదేంటి ఇంత సేపు బ్లడ్ ఇవ్వడం ఏంటి ఎన్ని లీటర్లు ఇస్తున్నాడో ఏంటో అని బయటకు వెళ్తుంది. అప్పుడే మహి వల్లి దగ్గరకు వస్తాడు. మహి తలకు గాయం చూసి నాగవల్లి తల్లడిల్లిపోతుంది. కంగారుగా డాక్టర్‌ని పిలిచి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకెళ్తుంది. నాగవల్లి మహిని తీసుకెళ్తుంటే బాలరాజు హాస్పిటల్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఒకర్ని ఒకరు చూసుకోరు. ఇక మధు పెంచిన తల్లిదండ్రులతో తన తండ్రి బాలరాజు గురించి చెప్పి ఎమోషనల్ అవుతుంది.
మరోవైపు బాలరాజు కోసం జైలుకి వెళ్లింది చిన్నినే అని దేవాకి అర్థమైపోతుంది. ఎలా అయినా చిన్నిని చంపేయాలి అనుకుంటాడు. అప్పుడే మహిని తీసుకొని నాగవల్లి ఇంటికి రావడం దేవా మహి నుదిటి మీద షర్ట్ మీద బ్లడ్ చూసి చాలా కంగారు పడతాడు. ఏమైంది అని అడిగితే తన ఫ్రెండ్‌కి సాయం చేస్తే చిన్న దెబ్బ తగిలిందని షర్ట్ మీద తన బ్లడ్ అని చెప్తాడు. దేవా మహిని హగ్ చేసుకొని లవ్ యూ చెప్తాడు.
మధు సబ్బుతో నాన్న మీకు ఒక మాట అడగొచ్చా అని ఎందుకు నాన్న మీరు నాకు ఆరోజు అబద్ధం చెప్పారు. అదే నాన్న ఆ రోజు జైలుకి వెళ్లి వచ్చానని మా నాన్న అక్కడ లేరని నాకు ఎందుకు అబద్ధం చెప్పారు అని అడుగుతుంది. సుబ్బు, స్వరూప షాక్ అయిపోతారు. అబద్ధం కాదమ్మా నిజంగా మీ నాన్న అక్కడ లేరు అని సుబ్బు అంటే మధు ఏడుస్తూ మా నాన్న అక్కడే ఉన్నారు.. నెల రోజుల క్రితం వరకు అదే జైలులో ఉన్నారు.. నెల రోజుల క్రితమే జైలు నుంచి రిలీజ్ అయ్యారంట.. నాకు మీరంతా అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు.. అని ఏడుస్తుంది. సుబ్బు మధు చేయి పట్టుకొని నిజమేనమ్మా.. ఆరోజు నేను అబద్ధమే చెప్పానమ్మా.. నేను జైలుకే వెళ్లలేదు.. కావేరమ్మకి ఇచ్చిన మాట కోసం నీకు అబద్ధం చెప్పానమ్మా అంతే కానీ నీకు మీ నాన్నని దూరం చేయాలి అన్న దురుద్దేశంతో అలా చెప్పలేదమ్మా అని ఏడుస్తాడు. చిన్ని కూడా చాలా ఏడుస్తుంది. సుబ్బు క్షమించమని ఏడుస్తాడు. నేను నిన్ను క్షమించడం ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావ్.. మా నాన్న ఎప్పటికీ తప్పు చేయడు.. ఏం చేసినా నా మంచి కోసమే చేస్తాడని నాకు తెలుసు.. కాకపోతే మీరలా చేయడం వల్ల పదేళ్ల పాటు మా నాన్నని నేను పట్టించుకోలేదనే బాధ ఉంది.. పర్లేదు దాని గురించి బాధ పడకండి నెల రోజుల క్రితమే కదా ఈ ఊరిలో ఎక్కడో ఉంటాడు.. కచ్చితంగా నాకు కనపడతాడు. అని అంటుంది. మహి మధుకి ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఇద్దరూ మంచి స్నేహితులు అయిపోతారు. ఒక టైంలో మధు తనకు ఓ గతం ఉందని తను ఈ గతంలో చాలా సాఫ్ట్ అని చెప్తుంది. మహి డిటైల్స్ అడిగే టైంకి ఇద్దరూ వేరే టాపిక్‌లోకి వెళ్లిపోతారు. మధు డిశ్చార్జి టైంలో బాలరాజుని చూస్తుంది. నాన్న అని అరుస్తుంది. చేతికి ఉన్న అన్ని తీసేసి పరుగులు పెడుతుంది. బాలరాజు వెనక మధుమిత పరుగులు పెట్టడం మధు కంగారుగా పరుగెత్తడం చూసి స్వరూప, సుబ్బులు మధు వెనక పరుగెడతారు. బాలరాజు బయట ఆటో మాట్లాడి ఆటో ఎక్కి వెళ్లిపోతాడు.
మధు నాన్న నాన్న అని ఎన్ని సార్లు పిలిచినా బాలరాజుకి వినిపించదు.. ఆటో వెళ్లిపోవడంతో మధు కింద కూర్చొని ఏడుస్తుంది. సుబ్బు, స్వరూపలు వచ్చి ఏమైందమ్మా అని అడిగితే మా నాన్నని చూశాను అని మధు ఏడుస్తుంది. సుబ్బు, స్వరూప ఇద్దరూ షాక్ అయిపోతారు. భ్రమ పడ్డావేమో అని అంటే లేదు నా కళ్లు నన్న మోసం చేసినా మనసు చేయదు అని మధు ఏడుస్తుంది. ఎలా అయినా నాన్నకి కలవాలి అని అంటుంది. మీరు కలవాలి అని రాసుంటే ఎలా అయినా కలుస్తారమ్మా అని స్వరూప సర్ది చెప్తుంది. ఇద్దరూ మధుని ఓదార్చి అక్కడి నుంచి తీసుకెళ్తారు. సుబ్బు మనసులో గతం ఆనవాళ్లు లేకుండా కావేరి అమ్మ పెంచమని చెప్పింది. కానీ ఇప్పుడు తను గతాన్ని వెతికే ప్రయత్నం చేస్తుంది దీని వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో ఏంటో అని అనుకుంటాడు. మధు రాత్రి ఇంట్లో తన పోయిన ఫోన్ చూసి చూశావా నాన్న కనీసం నిన్ను ఫోటోలో చూసుకునే భాగ్యం కూడా నాకు లేదు అని ఏడుస్తుంది. వెంటనే పెన్సిల్ పేపర్ తీసుకొచ్చి కళ్లు మూసుకొని తండ్రిని గుర్తు చేసుకొని డ్రాయింగ్ గీస్తుంది. తండ్రే హగ్ చేసుకున్నట్లు ఊహించుకొని మాట్లాడుతుంది.
దేవేంద్ర, నాగవల్లిలు మహి గురించి మాట్లాడుకుంటారు. చిన్ని చాపర్ట్ క్లోజ్ చేయాలని అనుకుంటారు. శ్రేయ ద్వారా దేవాకి మహి త్రీ ఫీట్ డిస్టెన్స్ గురించి తెలుస్తుంది. దాని గురించి వల్లికి అడిగితే ఆ చిన్ని కోసమే అయింటుంది.. చిన్ని చిన్ని అని కలవరిస్తున్నాడు కదా అందుకే అలా చేస్తుంటాడు అని అంటుంది. మహి కిందకి వస్తాడు. కాలేజ్‌కి వెళ్తూ బ్యాగ్ లేదేంటి అని వల్లి అడిగితే నేను కాలేజ్‌కి వెళ్లడం లేదు చిన్నిని వెతకడానికి వెళ్తున్నా.. చిన్ని ఈ ఊరిలోనే ఉందని తెలిశాక వెతక్కుండా ఎలా ఉంటాను.. ఒక్క రోజు వెతక్కపోయినా నేను ఉండలేను.. అని చెప్తాడు. దేవా, వల్లి షాక్ అయిపోతారు. చిన్ని కనిపిస్తే ఏం చేస్తావ్ అని దేవా అడుగుతాడు. మహి తండ్రితో ఇంకేం చేస్తా డాడీ.. చిన్ని కనిపించగానే వెళ్లి హగ్ చేసుకుంటా.. నువ్వే నా లైఫ్ ఇంకెప్పుడూ నా లైఫ్ నుంచి దూరం కావొద్దని చెప్తాను. వెంటనే మన ఇంటికి తీసుకొచ్చేసి మీ కోడలిగా మీకు పరిచయం చేస్తాను అని చెప్తాడు. దాంతో దేవా మ్యాడీ అని గట్టిగా అరుస్తాడు. వల్లి దేవాని కూల్ చేస్తుంది. ఎక్కడుందో తెలియని అమ్మాయి కోసం ఇలా పిచ్చిగా ఆలోచించడం ఏంటి నాన్నా అని దేవా అడిగితే ఇది పిచ్చి కాదు నాన్న పిచ్చి ప్రేమ. చిన్ని నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదు డాడీ. ఎప్పటికీ మారని ఓ ఎమోషన్. నా గుండె కొట్టుకునేంత కాలం చిన్ని అనే పేరు తలచుకుంటూనే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి వెళ్లిపోతాడు.
శ్రేయ తల్లి వసంత మొత్తం విని అన్నావదినలతో మహి ఇలా చిన్ని చిన్ని అంటే నా కూతురి పరిస్థితి ఏంటి అది వాడి మీద ప్రేమ పెంచుకుంది కదా.. చిన్నప్పటి నుంచి వాళ్లిద్దరూ మొగుడు పెళ్లాలని మనం కూడా అనుకున్నాం కదా.. వాడు మరో పెళ్లి చేసుకుంటే నా కూతురి పరిస్థితి ఏంటి అని వసంత అడుగుతుంది. మహి నా కూతురిని పెళ్లి చేసుకోకపోతే నేను ప్రాణాలతో ఉండను అంటుంది. వసంతకి దేవా, వల్లి ఇద్దరూ శ్రేయనే తమ కోడలు అని మాటిస్తారు.
మధు కాలేజ్‌లో ఒక వ్యక్తి ఆఫ్ టికెట్‌లా కనిపిస్తే వెంట పరుగులు తీస్తుంది. తీరా చూసే సరికి తను ఆఫ్ టికెట్ కాదు. దాంతో అతని అడ్రస్‌కి వెళ్తే తన తండ్రి గురించి తెలుస్తుందని అనుకుంటుంది. తీరా అతని అడ్రస్‌కి వెళ్లే సరికి నిరాశే మిగులుతుంది. ఇక మహి కూడా చిన్ని గురించి తెలుసుకునే ప్రయత్నంలో శ్రావణి టీచర్ ఇంటికి వెళ్లి ఉష టీచర్ చనిపోయిందని తెలుసుకుంటాడు. చాలా బాధ పడతాడు. చిన్ని గురించి తెలీలేదని డిసప్పాయింట్ అయిపోతాడు. ఆలోచించి ఆలోచించి మహి వర్షంలో తడుస్తుంటే మధు వచ్చి గొడుగు పడుతుంది. ఇద్దరూ చక్కగా మాట్లాడుకుంటారు. మధు మహిని పానీపూరీ బండి దగ్గరకు తీసుకెళ్లి తినిపిస్తుంది. మహికి మధుని చూస్తే అచ్చం చిన్నిలా ఉందని అనుమానం వస్తుంది. మధు మహి క్లోజ్‌గా ఉండటం శ్రేయ, లోహిత చూస్తారు. ఇదేంటి శ్రేయ అమ్మాయిలకు 3 అడుగులు దూరం పాటించే మీ బావ దానితో ఏంటి 3 అంగులాలు కూడా దూరం పాటించకుండా అలా అతుక్కుపోయాడేంటి అని అంటుంది. శ్రేయ రగిలిపోతుంది. మధు అంతు చూడాలని శ్రేయ అనుకుంటుంది.
మహి మధుకి చిన్ని గురించి చెప్పాలి అనుకుంటాడు. అప్పుడే సుబ్బు రావడంతో మధు వెళ్లిపోతుంది. సుబ్బు మహిని ఇంటికి భోజనానికి పిలుస్తాడు. దానికి మధు నాన్న వాళ్లు చాలా రిచ్ వాళ్లు మన ఇంటికి ఎందుకు వస్తారు అని అంటుంది. దానికి మహి వెంటనే హల్ మేడం అంత సీన్ లేదు నాకు అలాంటి రిచ్ పూర్ అని లేదు. ఫ్రెండ్‌షిప్‌లో అస్సలు లేవని భోజనానికి వస్తానని చెప్తాడు. మహి మనసులో మధునే చిన్ని అవుతుందా అనుకుంటాడు. అంతలోనే చిన్ని నాన్న ఇతను కాదులే అని అనుకుంటాడు.
మహి ఇంటికి వెళ్తాడు. మహి ఇంటికి వెళ్లగానే చిన్ని గురించి తెలిసిందా అని దేవా, వల్లి అడుగుతారు. చిన్ని గురించి తెలీదు కానీ ఉష టీచర్ గురించి తెలిసింది అని చెప్తాడు. ఆ మాట వినగానే వల్లి, దేవా షాక్ అయిపోతారు. ఉష టీచర్ చనిపోయారని చెప్పగానే రిలాక్స్ అయిపోతారు. ఉష టీచర్‌ని చంపేశారని అంటున్నారు. కడుపునకు అన్నం తిన్నవారు అలా ఎవరైనా చేస్తారా.. అసలు వాళ్లు మనుషులేనా అని తిడతాడు. దేవా, వల్లి ఒకర్ని ఒకరు చూసుకుంటారు. దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు అని దేవా అంటే ఆలోచించకుండా ఎలా ఉంటాను గురువుకే అలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని అంటాడు.
మరోవైపు లోహిత, శ్రేయలు పరీక్ష పేపర్లు కొట్టేయడానికి కాలేజ్‌కి వెళ్తారు. పేపర్లు ఫోన్‌లో ఫొటో తీసేసి వెళ్లిపోతారు. ఇక ఉదయం కాలేజ్‌లో పరీక్ష వాయిదా పడిందని ఎవరో పేపర్ దొంగతనం చేశారని అనౌన్స్ చేస్తారు. గంటలో లొంగిపోమని చెప్తే శ్రేయ చాలా భయపడుతుంది. మనం ఏం దొరకం అని లోహిత శ్రేయకి ధైర్యం చెప్తుంది. అంతా నేను చూసుకుంటా అని లోహిత చెప్తుంది. ఇవి ఈ వారం హైలెట్స్.





















