Chinni Serial Today April 29th: చిన్ని సీరియల్: కావేరిని పెళ్లి చేసుకోమన్న దేవా.. ఎఫైర్ అయినా ఓకే అంట.. చెంప పగలగొట్టిన ఉష!
Chinni Today Episode కావేరి ఉషని తేల్చాలని దేవా ప్రయత్నించడం తనని పెళ్లి చేసుకోమని కావేరితో దేవా చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode నాగవల్లి భర్త్‌డే పార్టీలో రౌడీలను సర్వర్స్‌గా పెట్టి ఉష అలియాస్ కావేరి ఫొటో చూపించి ఉషని చంపేయాలి అని చెప్తుంది. అదే పార్టీలో బాలరాజు కూడా ఓ గెటప్ వేసుకుంటాడు. నాగవల్లి ప్లాన్ వినేస్తాడు. ఇక మహి భర్త్‌డేకి రెడీ అయి రావడం చూసి అందరూ యువరాజ్‌లా ఉన్నాడు అని మురిసిపోతారు.
మహిని తీసుకొని తల్లి పార్వతి దగ్గరకు వెళ్లి దేవా దండం పెట్టిస్తాడు. పార్వతి ఉష అలియాస్ కావేరి త్వరలో నీ దగ్గరకే రాబోతుందని అంటాడు. ఇంతలో సత్యంబాబు ఫ్యామిలీ మొత్తం వస్తారు. సరళ మహి వాళ్ల ఇళ్లు, డెకరేషన్ చూసి నోరెళ్ల బెడుతుంది. డెకరేషన్‌కే రెండు లక్షలు అయింది అనడంతో సత్యంబాబు, సరళ నోరెళ్ల బెడతారు. దేవా ఫ్యామిలీ సత్యంబాబు ఫ్యామిలీకి మర్యాదలు చేస్తారు. కావేరి చేతిలో గిఫ్ట్‌లు చూసిన దేవా కేక్ కటింగ్ గిఫ్ట్‌లకు ఇంకా టైం ఉంది గదిలో పెట్టండి అని కావేరికి దేవా చెప్తాడు. కావేరి గదిలోకి వెళ్లి తన పార్వతిని చూసి ఎమోషనల్ అవుతుంది. ఇంతలో దేవా అక్కడికి వస్తాడు.
కావేరితో మీ ఫ్రెండ్ గుర్తొచ్చిందా కావేరి నువ్వు కావేరి అని నాకు తెలుసు అని అంటుంది. నేను కావేరి కాదు ఉష అని ఎన్ని సార్లు చెప్పాలి అని అంటుంది. ఇంతకీ ఈ ఫొటో ఎవరిది అని కావేరి అడుగుతుంది. దానికి దేవా శివది అని చెప్తాడు. శివపార్వతిదా అని కావేరి అనేస్తుంది. దాంతో దేవా ఎస్ ఎస్ నువ్వు కచ్చితంగా కావేరివే అని అంటాడు. నువ్వు కావేరి కాకపోతే నా భార్య పూర్తి పేరు నీకు ఎలా తెలుసు నువ్వు కావేరివే అంటుంది. ఆడవాళ్లకి మగవాళ్ల పేరు ఉండదు కదా అందుకే శివ అనగానే శివపార్వతి అన్నాను అని కావేరి అంటుంది. దేవా తనని కావేరి అని నిరూపిస్తా లేదంటే కైలాషానికి పంపిస్తా అనుకుంటాడు.
లాయర్ హరి దేవా కోసం వెతుకుతూ ఓ షాప్ దగ్గర టీ కోసం ఆగుతాడు. అక్కడ దేవేంద్ర ఫొటో అందులో దేవాకి సంబంధించిన ఆస్తి వివరాలు ఉంటాయి. అది చూసిన హరి ఒక్క అడ్రస్ ఉంది అక్కడ కచ్చితంగా దేవేంద్ర వర్మ ఉంటాడు అని సత్యంబాబుకి కాల్ చేస్తాడు. సత్యం కాల్ లిఫ్ట్ చేయడు. మరోవైపు భర్త్‌డే పార్టీలో పిల్లలు అంతా బయట ఆడుకుంటారు. పిల్లలు నాగవల్లి, కావేరిలను ఆడటానికి పిలుస్తారు. మ్యూజిక్ ఛైర్ ఆడతానికి రెడీ అవుతారు. మ్యూజిక్ వేయడానికి చిన్ని పంజాబీ గెటప్‌లో ఉన్న తన తండ్రిని పిలుస్తుంది. కావేరిని కాపాడుకోవడానికి బాలారాజు వంటలు చేయడానికి వచ్చినట్లు వస్తాడు. అందరూ మ్యూజికల్ ఛైర్ గేమ్ ఆడుతారు. పిల్లలు అందరూ ఆడుతూ అవుట్ అయి చివరకు చిన్ని, ఉష, నాగవల్లి మిగులుతారు.
చిన్ని, కావేరి కూర్చొంటే నాగవల్లి ఉష కాలి దగ్గర పడిపోతుంది. చాలా అవమానంగా ఫీలవుతుంది.తర్వాత చిన్ని, కావేరిలు ఆడుతారు. చిన్నిని గెలిపించాలి అని కావేరి అనుకుంటుంది. చిన్నిని గెలిపించి తాను ఓడిపోతుంది. చిన్ని చాలా హ్యాపీగా ఫీలవుతుంది. అందరూ క్లాప్స్ కొట్టి చిన్నిని ఉత్సాహపరుస్తారు. ఇక చిన్నికి మహి గిఫ్ట్ ఇస్తాడు. ఉష తాను మహి కోసం తీసుకొచ్చిన గిఫ్ట్‌లు తీసుకెళ్లబోతే దేవేంద్ర ఎదురు పడతాడు. తనని పెళ్లి చేసుకోమని దేవేంద్ర వర్మ కావేరితో చెప్తాడు. కావేరి కోపంగా చూస్తుంది. నాకు పెళ్లి అయినా భార్య లేదు మీకు భర్త లేడు మనం పెళ్లి చేసుకొని భార్యభర్తలం అవుదాం అంటాడు. కావేరి వెళ్లిపోతుంటే చేయి పట్టుకుంటాడు. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మనం భార్యాభర్తల్లాం ఉందాం నేను రెడీ అంటాడు. దాంతో కావేరి లాగా పెట్టి కొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మీ నాన్నని చంపేస్తావా మిధున.. వెళ్లిపో ఇక్కడి నుంచి: మిధునని గెంటేసిన త్రిపుర





















