Chinni Serial Today April 22nd: చిన్ని సీరియల్: నీకో గుడ్ న్యూస్ నాన్న.. ఉష ఎవరో చిన్నికి తెలుసా.. షాక్‌లో సత్యంబాబు!
Chinni Today Episode నాగవల్లి సరళ దగ్గరకు వచ్చి ఇంటిళ్లపాదిని మహి పుట్టిన రోజు వేడుకకు పిలవడం ఉషకు అనుమానం రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode బాలరాజు మాత్రమే తనని కాపాడాడు కాపాడుతూ ఉన్న శ్రేయాభిలాషి రాజే అని చిన్ని కావేరితో చెప్తుంది. నాన్నతో మాట్లాడితేనే తింటానని చిన్ని అంటుంది. మొండి పట్టు పడుతుంది. దాంతో కావేరి నీ కోసం మాట్లాడుతా అని చెప్తుంది. దాంతో చిన్ని కావేరిని హగ్ చేసుకుంటుంది. ఆకలేస్తుంది అని చెప్తుంది. కావేరి చిన్ని కోసం అన్నం తీసుకొస్తుంది.
చిన్నికి ఉష ఎవరో తెలుసా..
చిన్ని కోసం సత్యంబాబు అన్నం కలుపుకొని మేడ మీదకు తీసుకొస్తాడు. ఇంతలో కావేరి, చిన్ని ఒకరికి ఒకరు గోరు ముద్దలు పెట్టుకుంటూ మాట్లాడుకోవడం చూసిన సత్యంబాబు చిన్నికి కూడా ఉష తన తల్లి కావేరి అని తెలిసిపోయిందని అనుకుంటాడు. చిన్ని కావేరి గురించి నోరు జారకముందే ఆ దేవేంద్రవర్మ సంగతి చూడాలని అనుకుంటాడు. లాయర్‌కి కాల్ చేసి అడ్రస్ గురించి అడుగుతారు.
రాజుకి కావేరి కాల్..
కావేరి చిన్న చెప్పిన మాటలు తలచుకుంటూ ఉంటుంది. అక్కడ బాలరాజు కూడా కావేరి గురించి ఆలోచిస్తుంటాడు. ఇంతలో కావేరి రాజుతో ఒకసారి మాట్లాడాలి అనుకొని కాల్ చేస్తుంది. కానీ బాలరాజు వాయిస్ వినగానే చాలా భయపడిపోతుంది. ఏం మాట్లాడాలి అనుకుంటుంది. వెంటనే కాల్ కట్ చేస్తుంది. బాలరాజు అక్కడ ఏదో జరిగింది అని అనుమానంతో మాట్లాడాలి అనుకుంటే అర్థరాత్రి అయింది వద్దని ఆఫ్ టికెట్ కాల్ చేయకుండా అడ్డకుంటాడు. ఏం జరిగిందో రేపు చిన్ని చెప్తుంది. మీరు కచ్చితంగా కలుస్తారు అన్న చిన్ని సంకల్పం అలాంటిది అని ఆఫ్ టికెట్ బాలరాజుతో చెప్తాడు.
నాన్న నీకో గుడ్ న్యూస్..
ఉదయం బాలరాజు ఆలోచిస్తూ చిరాకుగా ఉంటే ఆఫ్ టికెట్ బాల కోసం టీ తీసుకొస్తాడు. ఇంతలో చిన్ని చాలా సంతోషంగా పరుగున వచ్చి బాలరాజుని హగ్ చేసుకొని నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని రాజుని గిరగారా తిప్పేస్తుంది. తర్వాత ఆఫ్ టికెట్‌ని కూడా పట్టుకొని గిరగిరా తిప్పేసి కింద వదిలేస్తుంది. చిన్ని రాజుతో నాన్న నీకో గుడ్ న్యూస్ అమ్మ నిన్న కలుస్తా అని చెప్పింది అది కూడా ఉషలా కాదు కావేరిలా అని చెప్తుంది. రాజు సంతోషంతో కూతురిని హగ్ చేసుకుంటాడు. మీ అమ్మ ఎలా ఒప్పుకుంది అని రాజు అడిగితే చిన్ని జరిగింది చెప్తుంది. గుడికి వస్తామని మీరు అక్కడికి రండి అని చెప్తుంది. అమ్మ ఏం అన్నా పట్టించుకోవద్దు అని కూడా చిన్ని రాజుతో చెప్తుంది.
కావేరి ఫ్యామిలీకి నాగవల్లి ఇన్విటేషన్
నాగవల్లి, ప్రమీల మహిని తీసుకొని ఇంటికి వస్తుంటే సరళ వాళ్లు తాంబూలంలో పట్టు చీర నగలు తీసుకొచ్చినట్లు ఊహించుకుంటుంది. సరళ వాళ్లకి మర్యాదలు చేస్తుంది. వీళ్లు ఎందుకు వచ్చారని ఉష చూడటానికి వస్తుంది. నాగవల్లి వాళ్లతో మా మహి బర్త్‌డే పార్టీ రేపు మీరంతా తప్పుకుండా రావాలి అని అందరినీ పిలుస్తుంది. ఉషతో మీరు తప్పకుండా రావాలి టీచర్ అంటుంది. నాకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ అని ఉష అంటే మీరు మా మహి టీచర్ కదా రావాలి అంటుంది. ఇక మహి చందుతో నీకు ఓ స్పెషల్ గిఫ్ట్‌రా నీ కోసం నీకు ఇష్టమైన అన్ని నాన్ వెజ్ ఐటెమ్స్ చేయిస్తున్నా అని అనడంతో చందు లొట్టలేసుకొని ఎగ్జౌట్ అయిపోతాడు. మహిలాంటి ఫ్రెండ్ ఉంటే చాలు లైఫ్ లాంగ్ తిండికి కొదవ ఉండదు అంటాడు. దాంతో ఉష వాడికి ఒక్కటిచ్చి ఈ కక్కూర్తి మాటలు మీ నాన్న ముందు అనకు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా తెచ్చిన బట్టలు వేసుకొన్నసత్యమూర్తి.. తండ్రి సంతోషం దేవాలో మార్పు తీసుకొస్తుందా!





















