Chinni Serial Today April 1st: చిన్ని సీరియల్: కావేరి దొరికిపోయిందా.. ఉన్నపళంగా ఏసీపీ ఉషని రమ్మనడానికి కారణమేంటి?
Chinni Today Episode ఉషని పోలీసులు రమ్మని చెప్పడం దొరికిపోయాను ఇక కూతురికి దూరం అయిపోతానని ఉష ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చందు రాత్రి ఉష దగ్గరకు వెళ్లి చిన్ని కనిపించడం లేదని చెప్తాడు. ఉష మనసులో నాకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్లదు కదా అని చిన్ని కనిపించడం లేదని ఎవరికీ చెప్పొద్దని తాను వెతకడానికి వెళ్తుంది. చందు మామయ్య దగ్గరకు వెళ్లిందేమో అని అనుకుంటాడు. రాజు ఆటోలో బాధగా కూర్చొని ఉంటే అతని దోస్త్ రాజుని తినమని ఉదయం నుంచి నువ్వు ఏం తినడం లేదని అంటాడు. నువ్వే ఎలా అయినా కాపాడాలి అన్నా అని అంటే ఎలా కాపాడుతానురా అది డీఎన్ఏ టెస్ట్ కచ్చితంగా చిన్ని తల్లి కావేరి అని తెలిసిపోతుందని బాధ పడతాడు.
తండ్రి దగ్గర బోరున ఏడ్చిన చిన్ని..
రాజు దగ్గరకు ఇంతలో చిన్ని వస్తుంది. ఈ టైంలో ఎందుకు వచ్చావమ్మా అని రాజు అడిగితే టీచరమ్మే మా అమ్మ అనుకొని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఏడుస్తుంది. ఏ రోజుకి ఆ రోజు టీచరమ్మ, మామయ్య ఏం ఇబ్బంది పడతారో అని టెన్షన్‌గా ఉందని చెప్తుంది. అమ్మని కాపాడలేకపోయావ్ కనీసం టీచరమ్మని అయినా కాపాడు రాజు అని చిన్ని ఏడుస్తుంది. టీచర్‌కి ఏం జరగదు అని రాజు చిన్నికి ధైర్యం చెప్తాడు. చిన్నిని రాజు తిన్నావా అని అడిగితే తినలేదు అని చిన్ని చెప్తే రాజు కూడా తినలేదని అతని ఫ్రెండ్ చెప్తాడు. దాంతో ఇద్దరూ నువ్వు తింటే నేను తింటాను అనుకొని ఇద్దరూ ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. రాజు కూతురు తినిపించే సరికి చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇక చిన్నిని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకెళ్తాడు.
రౌడీలను చితక్కొట్టిన ఉష.. రాజు
ఉష చిన్ని కోసం కంగారుగా తిరుగుతూ చిన్ని ఫొటో చూపించి అందరినీ అడుగుతుంటుంది. ఎవరూ తమకు తెలీదు అంటారు. కొంత మంది రౌడీలు కావాలనే ఉషని టార్గెట్ చేయడానికి బస్‌స్టాండ్ వైపు వెళ్లిందని చెప్పి ఉషని పంపుతారు. అక్కడ ఎవరూ ఉండరు ఆ రౌడీలు ఉషని చుట్టు ముట్టి చంపడానికి ప్రయత్నిస్తారు. ఉష వాళ్లని చితక్కొడుతుంది. ఇంతలో రాజు వాళ్లు అక్కడికి వస్తారు. రాజు రౌడీలను చితక్కొడతాడు. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లావని అడిగితే రాజుని కలవడానికి వెళ్లానని మనకు సాయం చేస్తారని వెళ్లానని చెప్తుంది. దానికి ఉష వాడేమైనా పుడింగా అని అంటే చిన్ని ఉషకి సారీ టీచర్ అంటుంది. దాంతో ఉష ఆటో వాడిని పుడింగ్ అన్నాననా నన్ను టీచరమ్మ అనకుండా టీచర్ అంటున్నావని అడుగుతుంది. ఇక చిన్నీని తీసుకెళ్లిపోతుంది.
వదినకు నిజం తెలీదు కదా అన్న బాధపడకు..
రాజు బాధపడుతుంటే అతని ఫ్రెండ్ రాజుతో వదిన నీకు గతంలో చేసిన తప్పులు గుర్తుచుకుంది కానీ ఇప్పుడు చేస్తున్న సాయం తెలీక అలా మాట్లాడిందని అంటాడు. ఇంటికి వచ్చి చిన్ని బాధ పడుతుంటే ఉష ఏమైందని అడగగానే భయం వేస్తుందని అమ్మ అని చిన్ని ఉషని హగ్ చేసుకుంటుంది. మళ్లీ మనం విడిపోతామేమో అని భయంగా ఉంది అమ్మా అని చిన్ని అంటే మన రాత ఎలా ఉంటే అలా అవుతుందని ఉష అంటుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఎదుర్కొగలం అనే ధైర్యంతో ఉండాలి.. రేపు ఏం జరిగినా నువ్వు ధైర్యంగా ఉండాలి.. బాగా చదువుకో నాకు మామయ్యకి మంచి పేరు తేవాలని అంటుంది.
అమ్మా నీ ఒడిలో పడుకోనా మళ్లీ అవకాశం వస్తుందో రాదో..
చిన్ని ఏడుస్తూ అమ్మా కాసేపు నీ ఒడిలో పడుకుంటా మళ్లీ నాకు ఆ అదృష్టం ఉందో లేదో అని అంటుంది. ఉష పాపని తన ఒడిలో పడుకోపెట్టుకుంటుంది. ఉదయం ఉష దేవుడిని దండం పెట్టుకుంటుంది. ఇప్పటి వరకు విజయ్ ఎన్ని ప్లాన్‌లు చేసినా నా శ్రేయాభిలాషి కాపాడుతూ వచ్చాడు కానీ ఇప్పుడు కాపాడలేడని డీఎన్‌ఏ రిపోర్ట్స్‌లో తాను కావేరి అని తెలిసిపోతుందని తాను జైలుకి వెళ్లినా పర్లేదు తన అన్నా, కూతురిలకు ఏం ఇబ్బంది రాకుండా చూడమని వేడుకుంటుంది. ఇక ఆంటీని హగ్ చేసుకొని మళ్లీ తిరిగా వస్తాను అనే నమ్మకం లేదని ఏడుస్తుంది. ఇంతలో ఇంటికి పోలీసులు వస్తారు. చిన్ని చాలా భయపడుతుంది. మామయ్యని పట్టుకొని టీచరమ్మని తీసుకెళ్లిపోతారా అని ఏడుస్తుంది.
ఏసీపీ సార్ అర్జెంట్‌గా రమ్మన్నారు
ఉష ఇంటికి కొందరు కానిస్టేబుల్స్ వెళ్లి మిమల్ని ఏసీపీ సార్ వెంటనే తీసుకురమ్మన్నారని చెప్తారు. నేనే వస్తాను అని చెప్పి ఉష బయల్దేరుతుంది. సత్యం వాళ్లకి ఉష విషయం చెప్తే పోలీసులు రమ్మన్నారని అంటుంది. సరళ ఉషతో కొంప తీసి నువ్వు కావేరివా ఏంటి అని అడుగుతుంది. సత్యం ఉషతో పాటు వెళ్తానని అంటాడు. సరళ ఆపుతుంది. చిన్ని కూడా వస్తాను అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: ఉష, చిన్నిలకు డీఎన్‌ఏ టెస్ట్.. ఈసారి కావేరి దొరికిపోవడం ఖాయం.. చేతులెత్తేసిన రాజు!





















