Brahmamudi November 11th Today Episode : రాజ్ చేత భోజనం చేయించిన కావ్య – వీలునామ చించేసిన రాజ్
Brahmamudi Serial Today Episode: తాతయ్య చెప్పినట్లు వీలునామా రాసుకుని లాయర్ రావడంతో ఇంట్లో వాళ్లందరూ షాక్ అవుతారు. ఇంతలో రాజ్ వీలునామాను చించివేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.
![Brahmamudi November 11th Today Episode : రాజ్ చేత భోజనం చేయించిన కావ్య – వీలునామ చించేసిన రాజ్ brahmamudi serial today november 11th episode written update today episode Brahmamudi November 11th Today Episode : రాజ్ చేత భోజనం చేయించిన కావ్య – వీలునామ చించేసిన రాజ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/11/cd07cad32f5bbb2f59d9d504222d87311699666677604879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Brahmamudi Serial November 11th Today Episode: కావ్య, రాజ్‌ను భోజనం చేయమని బతిమాలుతుంది. నేను భోజనం చేయనని రాజ్ చెప్తాడు. మీరు నన్ను చాలా హర్ట్ చేస్తున్నారని కావ్య బాధపడుతుంది. హర్ట్ మాత్రమే చేశాను. ఇంకేం చేయలేదని రాజ్ అంటాడు.
కావ్య: సరే సరే మన సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ముందయితే ఇది తినండి.
రాజ్: ఏయ్ తినని చెప్తున్నాను కదా.. ఒకసారి చెబితే అర్థం కాదా నీకు. గాయం చేసి మందు రాస్తా అంటే రాయించుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. నీవు కోపంగా చూస్తే భయపడిపోవడానికి నీ షాపులో పనిచేసే బంటిగాన్ని కాదు. నోరు మూసుకుని కళ్లు దించుకుని వెళ్లు.
అనగానే పోనీలే పాపం ఆకలితో ఉన్నారు అన్నం తినిపిద్దామనుకుంటే ఇలా మాట్లాడతారా? మీరంటున్న ఆ మోసమే చేసి మీ చేతే అన్నం తినిపిస్తాను చూడు అని కావ్య మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
డైనింగ్ టేబుల్ దగ్గర కావ్య, ధాన్యలక్ష్మీ ఇద్దరూ నిలబడి ఉంటారు.
కావ్య: చిన్నత్తయ్య గుర్తుంది కదా! ఇందాకా నేను చెప్పిందంతా మర్చిపోలేదు కదా?
ధాన్యలక్ష్మీ: గుర్తుంది కావ్య మా అక్కను రెచ్చగొట్టాలి. రాజ్‌కు అన్నం తీసుకెళ్లేలా చేయాలి. అంతే కదా?
కావ్య: కానీ అనుమానం రాకూడదు.
ధాన్యలక్ష్మీ: సరేలే అలాగే కానీ అదిగో అక్క వెళ్లిపోతుంది.
కావ్య: ఏంటి చిన్నత్తయ్య మీరు ఈపని చేయగలరా?
ధాన్యలక్ష్మీ: ఏ ఎందుకు చేయలేను చిన్నప్పటి నుంచి వాన్ని చూసుకుంటున్నదాన్ని ఈ పని చేయలేనా?
కావ్య: చేయలేరు అనే కదా చెప్తున్నాను. మీరే కాదు మా అత్తయ్య వచ్చినా కూడా తినిపించలేరు. మీ అబ్బాయి అంత కోపంగా ఉన్నారు.
ధాన్యలక్ష్మీ: అయ్యో ఎంత మాటన్నావ్ కావ్య ఏమనుకుంటున్నావ్ మా అక్క గురించి రాజ్ తన మాట వినడని ఎలా అంటావ్.
కావ్య: వినరు చిన్నత్తయ్య..
ధాన్యలక్ష్మీ: అవునా? అంతేనంటావా?
అపర్ణ: ఏంటి ఏమైంది? రాజ్ ఏం చేశాడు?
అని అపర్ణ అడగగానే రాజ్ భోజనం చేయడం లేదని.. భోజనం విషయంలో ఎవ్వరు చెప్పినా వినడని ధాన్యలక్ష్మీ, కావ్య, అపర్ణను రెచ్చగొడతారు. దీంతో అపర్ణ నేను చెప్తే ఎందుకు భోజనం చేయడు అని రాజ్‌కు భోజనం తీసుకెళ్తుంది. మీ అత్తగారిని రెచ్చగొట్టి రాజ్‌కు భోజనం పంపిచేలా చేశావ్ నువ్వు గ్రేట్ కావ్య అంటూ మెచ్చకుంటుంది ధాన్యలక్ష్మీ.
అపర్ణ భోజనం తీసుకుని రాజ్ గదిలోకి వెళ్తుంది. ఏవో ఊరడింపు మాటలు చెప్పి రాజ్‌కు అన్నం తినిపిస్తుంది అపర్ణ. గుమ్మం దగ్గర నిలబడి అంతా చూస్తున్న కావ్య, ధాన్యలక్ష్మీ ఇద్దరూ సంతోషంగా ఫీలవుతారు.
ధాన్యలక్ష్మీ: అటు చూడు రాజ్‌కు అన్నం తినిపిస్తూ మా అక్క ఎంత సంతోషపడుతుంది చూడు. చిన్నప్పుడు ఏ తల్లి అయినా గోరు ముద్దులు తినిపిస్తూ అనందిస్తుంది. కానీ ఇంత వయసు వచ్చినా కొడుక్కు అన్నం తినిపించే భాగ్యం ఏ తల్లికి వస్తుంది చెప్పు. ఆ ఆనందం ఎన్ని కోట్లు ఖర్చు పెడితే మా అక్కకు దొరుకుతుంది. తల్లిగా చూపించే ప్రేమ అత్తగా మారినప్పుడు ఎక్కడికి మాయం అవుతుందో అంటూ ధాన్యలక్ష్మీ బాధపడుతుంది. ఇంతలో అపర్ణ భోజనం పూర్తి కాగానే బయటికి వస్తుంది. డోర్ దగ్గర ఉన్న కావ్య, ధాన్యలక్ష్మీలను చూసి..
అపర్ణ: ధాన్యలక్ష్మీ ఇక్కడెవరో నా కొడుకు భోజనం చేయడు అని ఛాలెంజ్ చేశారు.
కావ్య: నేనే చేశాను అత్తయ్య మీ గురించి తక్కువ అంచనా వేశాను. సారీ అత్తయ్య.
అపర్ణ: నీ చేత సారీ చెప్పించుకోవడం కోసం కాదు ఇది నా కొడుకు కోసం చేశాను.
కావ్య: అది కూడా అర్థం అయ్యింది అత్తయ్య.
అపర్ణ: ఒక మనిషిని గెలుచుకోవాలి అంటే సాధించడం కాదు ప్రేమించాలి.
అంటూ అపర్ణ వెళ్లిపోతుంది. కావ్య రూంలోకి వెళ్తుంది. రాజ్ ను చూసి నవ్వుతుంటే నువ్వెందుకు నవ్వుతున్నావో నాకు తెలుసు. నువ్వు తెస్తే తినలేదని మా అమ్మచేత పంపిచావని నాకు తెలుసు అంటాడు రాజ్. తిడితే తిట్టారు కానీ భోజనం అయితే చేశారుగా అని మనసులో అనుకుంటూ హ్యాపీగా ఉంటుంది కావ్య. హల్లో అందరూ కూర్చుని ఉంటారు. ఇంతలో లాయర్ వస్తారు. లాయర్ గారు నేను చెప్పినట్లుగానే వీలునామా రాసుకొచ్చారా? అని అడగుతాడు తాతయ్య. రాసుకొచ్చానని లాయర్ చెప్తాడు. అయితే ఇప్పుడివ్వనీ ఎందుకని సుభాష్ అడుగుతాడు. నువ్వు ఊహించినట్టు ఏమీ జరగదని చిట్టి చెబుతుంది.
రుద్రాణి: ఆస్తులు పంచే సమయంలో ఈ ముసల్ది చెడగొట్టేట్టు ఉంది
రాహుల్ : నాకు అలాగే అనిపిస్తుంది మామ్
లాయర్ వీలునామా చదువుతుంటే రాజ్ లాయర్ చేతిలో వీలునామా లాక్కుని చించివేస్తాడు. లాయర్ షాకింగ్ గా చూస్తుంటే లాయర్ గారు ఇప్పుడు ఈ ఇంట్లో వీలునామాలు రాసుకునే సమయం కాదు. అనగానే వాళ్ల తాతయ్య రాజ్‌ను కోపంగా చూస్తుండిపోతాడు. రుద్రాణి, రాహుల్, స్వప్న తప్ప మిగతా వారంతా రాజ్ చేసిన పనికి సంతోషపడుతుంటారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)