అన్వేషించండి

Brahmamudi Serial Today May 6th: బ్రహ్మముడి సీరియల్: తల్లీ కొడుకులకు పంగనామం పెట్టిన స్వప్న.. నిజం తెలుసుకోవడానికి ఆఫీస్‌కు కావ్య పరుగులు.. రెండు రోజులే గడువు!

Brahmamudi Serial Today Episode : రాజ్ వారసుడని పరిచయం చేసిన బిడ్డ.. తల్లి మాయ అన్ని తెలుసుకున్న కావ్య ఆమె గురించి తెలుసుకోవడానికి ఆఫీస్‌కు పరుగులు పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Brahmamudi Today Episode : నిజం తెలుసుకోవడానికి కావ్య అప్పు సాయంతో రాజ్ డబ్బులిచ్చిన వ్యక్తిని కలవడానికి వస్తుంది. అతన్ని బెదిరించి నిజం చెప్పమని అడుతుంది. దాంతో ఆయన రాజ్ దగ్గర ఉన్న బిడ్డకు మాయ తల్లి అని చెప్తాడు. అతడు నడుపుతున్న డేకేర్ సెంటర్‌లో మాయ ఆ బిడ్డను విడిచిపెట్టేదని ఒక రోజు రాజ్ వచ్చి ఆమెతో చాలా సేపు మాట్లాడాడని చెప్తాడు. అది విని కావ్య షాక్ అయిపోతుంది. 

రాజ్, మాయల సంభాషణ

మాయ: ఎన్నాళ్లు ఇలా ఎవరికీ తెలీకుండా బతకాలి. ఈ బిడ్డను తీసుకొని ఈ ఇంటికి వచ్చి జరిగింది చెప్తా. 

రాజ్: ప్లీజ్ తొందరపడకు. దయచేసి తొందర పడకు. నేనే ఏదో ఒకటి చేస్తా. 

మాయ: మళ్లీ నన్ను మోసం చేయాలి అని చూస్తున్నావా. ఈ బిడ్డను మీ ఇంటికి తీసుకెళ్లాలి. వారసుడిగా పరిచయం చేయాలి. 

రాజ్: అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది. కానీ ఓపిక పట్టు. ఒకేసారి నిన్నూ బిడ్డనూ తీసుకెళ్తే ఇంట్లో గొడవ అవుతుంది. ముందు బిడ్డని తీసుకెళ్తా తర్వాత నిన్ను తీసుకెళ్తా. 

మాయ: సరే కానీ మాట తప్పినా నా బిడ్డకు హాని తలపెట్టినా సాక్ష్యాలతో సహా మీడియా ముందుకు వస్తా.

రాజ్: నీకు అలాంటి పరిస్థితి రాదు. నేను మాటిస్తున్నాను.

రాజ్‌డబ్బిచ్చిన వ్యక్తి: అప్పుడు అర్థమైంది మేడమ్. ఆ బాబు రాజ్ సార్‌కి మాయా మేడంకి పుట్టిన అక్రమ సంతానం అని. రాజ్ సార్‌ డబ్బున్న వ్యక్తి అని అతన్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకున్నా. కానీ రాజ్ సార్ చాలా మంచి వ్యక్తి మేడం. మాయ మేడం ఇచ్చిన ఫోన్ నెంబరు అడ్రస్ అంతా ఫేక్ మేడమ్.

అప్పు: ఏంటి అక్క ఇది నువ్వు బావ మీద అంత నమ్మకం పెట్టుకున్నావ్ కానీ బావ చూశావా నిన్ను ఎంత మోసం చేశాడో. ఇంకా ఏంటి అక్క ఆలోచిస్తున్నావ్. బావని అందరి ముందు నిలదీయ్.

కావ్య: లేదు అప్పు మా పెళ్లి రోజు ఆయన కళ్లలో ఓ నిజం కనిపించింది. మా జీవితానికి సంబంధించి ఓ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఒక వేళ ఇదే అయితే మీకు ఓ విషయం చెప్పాలి అంటారు కానీ నిర్ణయం తీసుకున్నా అనరు కదా. నాకు శ్వేత చెప్పింది. ఆ రోజు ఆఫీస్‌లో నాతో మనసు విప్పి మాట్లాడాలి అనుకున్నారని. అంటే దాని అర్థం ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన వరకు ఆయనకు ఏం తెలీదు. 

అప్పు: అంటే ఆఫీస్‌లో ఏమైనా జరిగింది అంటావా.

కావ్య: అవును మనకు నిజం తెలియాలి అంటే ఆఫీస్‌కు వెళ్లాలి.

మరోవైపు రుద్రాణి, రాహుల్‌లు జరిగినదాన్ని ఆలోచిస్తూ ఉంటారు. సేటు తిరిగి కాగితాలు ఇవ్వడం ఏంటని ఆలోచిస్తారు. ఇక రాహుల్ కోటి రూపాయల గురించి ఆలోచించాలి అంటాడు. సేటుకి వెంటనే కోటి ఇవ్వకపోతే ఇంటికి వచ్చి గోల చేస్తాడని అంటాడు. ఆ డబ్బుని తిరిగి ఇచ్చేస్తానని ఇవ్వమని తల్లిని రాహుల్ అడుగుతాడు. 

ఇంతలో స్వప్న తన స్టేటస్‌కు తగ్గట్టు కారు కొనాలి అనుకుంటున్నాను అని కోటి రూపాయల కారు కావాలి అని ఫోన్ లో చెప్తుంది. అది విని రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు. సింగిల్ పేమెంట్ క్యాస్ ఇస్తా అని ఫోన్‌లో స్వప్న అనడం విని వెంటనే తమ లాకర్లో డబ్బులు కోసం తల్లీ కొడుకులు వెతుకుతారు. అయితే అందులో కాగితం మీద నామం గుర్తు పెట్టి ఉంటుంది. అది చూసి ఇద్దరూ షాక్ అవుతారు. రుద్రాణి ఆవేశంగా స్వప్నని ప్రశ్నిస్తాను అని అంటే రాహుల్ అడ్డుకుంటాడు. కోటి రూపాయల అప్పు తన నెత్తి మీద పడిందని ఏం చేయాలో ఆలోచించని రాహుల్ అంటాడు. 

ఇంతలో కావ్య, అప్పు ఆఫీస్‌కు వెళ్తారు. కావ్య సెక్యూరిటీని రాజ్‌ని కలవడానికి ఎవరు వచ్చారని అడుగుతుంది. ఇక కావ్య సీసీ టీవీ ఫుటేజ్ చూస్తుంది. అందులో మూడు గంటల ఫుటేజ్ డిలీట్ చేసి ఉంటుంది. దాన్ని రాజ్ డిలీట్ చేశాడని సెక్యూరిటీ కావ్యకు చెప్తాడు. 

సెక్యూరిటీ: అవును మేడం రాజ్ సార్ డిలీట్ చేసి హడావుడిగా కార్ ఎక్కి ఎక్కడికో వెళ్లిపోయారు.

కావ్య: ఆ సమయంలోనే ఏదో జరిగింది. అది బయట పడకూడదు అని వాంటెడ్‌గా ఫుటేజ్ డిలీట్ చేశారు.

అప్పు: ఇప్పుడేం చేస్తాం అక్క. అక్క ఒక్క అవకాశం ఉంది. ఆ హార్డ్ డిస్క్ ఉంటే ఫుటేజీ రికవర్ చేయొచ్చు.  కావ్య సెక్యూరిటీకి అడుగుతుంది. 

మరోవైపు అందరూ భోజనాలు చేయడానికి కూర్చొంటారు. రాజ్ కూడా వస్తాడు. రాజ్ కూర్చొవడంతో అపర్ణ లేచేస్తుంది. కావ్య అపర్ణని ప్రశ్నిస్తుంది. మీరు లేచి వెళ్లి పోతే రాజ్ ప్రశాంతంగా భోజనం చేయడని చెప్తుంది. రాజ్ తండ్రి కూడా కావ్యకు సపోర్ట్ చేస్తాడు.  

అపర్ణ: రెండు రోజుల్లో గడువు ముగిసిపోతుంది. ఇన్ని రోజులు గుట్టు బయట పెట్టనివాడు రెండు రోజుల్లో బయట పెట్టడని నాకు తెలుసు. బయట పడటం తప్ప నిజం చెప్పడు. ఇంటికి, తల్లికి విలువ ఇవ్వడం వాడికి తెలియకపోవచ్చు. కానీ నాకు తెలుసు కదా. ఎంతైనా నా కన్న కొడుకు. పాతికేళ్ల ప్రాణం పెట్టి పెంచుకున్నాను. అయినా వీడికి తల్లి కంటే వాడి కొడుకే ముఖ్యం. వాడు దూరం అయితే ఆ బాధని తట్టుకోవడం నాకు చాలా కష్టం. అందుకే ఈ క్షణం నుంచే అలవాటు చేసుకుంటున్నా.

కావ్య: అసలు ఎందుకు వెళ్లిపోవాలి. ఆయన ఏనాడు మీ మాటకు ఎదురు చెప్పలేదు కదా. ఆయన నేరస్తుడో నేరంలో భాగస్వామో కాలమే నిర్ణయిస్తుంది. 

అపర్ణ: అసలు వాడిని నువ్వు ఎందుకు వెనకేసుకొస్తున్నావు. 

రుద్రాణి: ఇంకా అర్థం కాలేదా వదినా వాడు కట్టు బట్టలతో ఇళ్లు దాటితే లోకం కోసం అయినా తాను కూడా వాడి వెనక వెళ్లి కష్టాలు పడాల్సి వస్తుందని ఇలా చేస్తుంది.

కావ్య: అలాంటి పరిస్థితే వస్తే ఏం చేయాలో అదే చేస్తాను. ఇంత ఆస్తి ఉండి నేను ఏం అనుభవించాను. పట్టెడు అన్నమే కదా. బయటకు వెళ్తే నా భర్త నాకు తిండి పెట్టలేడా. రాజ్ తండ్రి కూడా కావ్యను వెనకేసుకొచ్చి మాట్లాడుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: ఒకే గదిలో సత్య, క్రిష్‌లు వేరు వేరు కాపురం.. నందినిని మార్చుకోవడానికి హర్ష ప్రయత్నాలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy on Potti Sriramulu: తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరు, చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు: రేవంత్ రెడ్డి
తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరు, చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు: రేవంత్ రెడ్డి
AP Volunteer System: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
Vijayashanti: ఇద్దరూ మంచి బాలురు, మనసున్న వాళ్లు - మహేష్, కల్యాణ్‌రామ్‌పై విజయశాంతి ప్రశంసలు, అప్పుడు.. ఇప్పుడూ.. తగ్గేదేలే...
ఇద్దరూ మంచి బాలురు, మనసున్న వాళ్లు - మహేష్, కల్యాణ్‌రామ్‌పై విజయశాంతి ప్రశంసలు, అప్పుడు.. ఇప్పుడూ.. తగ్గేదేలే...
Telangana Jobs: కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం- ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్
కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం- ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nikhil on Swayambhu Movie Update | కొంపల్లిలో ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన నిఖిల్ | ABP DesamAR Rahman Wife Saira Rahman | ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సైరా రెహ్మాన్ | ABP DesamNASA Space X Crew 10 Docking Success | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చేందుకు రూట్ క్లియర్ | ABP DesamTDP Activist Loss life in Punganur | పెద్దిరెడ్డి ఇలాకాలో బలైపోయిన మరో టీడీపీ కార్యకర్త | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy on Potti Sriramulu: తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరు, చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు: రేవంత్ రెడ్డి
తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరు, చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు: రేవంత్ రెడ్డి
AP Volunteer System: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
Vijayashanti: ఇద్దరూ మంచి బాలురు, మనసున్న వాళ్లు - మహేష్, కల్యాణ్‌రామ్‌పై విజయశాంతి ప్రశంసలు, అప్పుడు.. ఇప్పుడూ.. తగ్గేదేలే...
ఇద్దరూ మంచి బాలురు, మనసున్న వాళ్లు - మహేష్, కల్యాణ్‌రామ్‌పై విజయశాంతి ప్రశంసలు, అప్పుడు.. ఇప్పుడూ.. తగ్గేదేలే...
Telangana Jobs: కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం- ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్
కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం- ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్
War 2 Movie Release Date: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ సంబరాలు
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ సంబరాలు
KTR News: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్, త్వరలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్, త్వరలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
Samantha : నాగ చైతన్య చివరి గుర్తును చెరిపేస్తున్న సమంత - ప్లీజ్... అలా చేయొద్దంటూ అభిమానుల రిక్వెస్ట్
నాగ చైతన్య చివరి గుర్తును చెరిపేస్తున్న సమంత - ప్లీజ్... అలా చేయొద్దంటూ అభిమానుల రిక్వెస్ట్
Return On Gold: రూ.2943కు కొన్నారు, రూ.8624కు అమ్ముతున్నారు - గోల్డ్‌ మీద మూడు రెట్ల లాభం
రూ.2943కు కొన్నారు, రూ.8624కు అమ్ముతున్నారు - గోల్డ్‌ మీద మూడు రెట్ల లాభం
Embed widget