Brahmamudi Serial Today September 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఆఫీసుకు వెళ్లిన రాజ్ – అనామికకు ఫోన్ చేసిన రుద్రాణి
Brahmamudi Today Episode: ఆఫీసుకు వెళ్తూ మధ్యలో గుడిలోకి వెళ్లిన రాజ్ కు మళ్లీ కావ్య ఎదురుపడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఫన్నీగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కావ్య ఆఫీసుకు వెళ్తుంటే కనకం టిఫిన్, లంచ్ బాక్స్ తీసుకొస్తుది. ఆఫీసుకు టైం అవుతుందని టిఫిన్ చేయలేనని.. బాక్స్ తీసుకుని వెళ్లిపోతుంది. బయట ఎదురుగా వచ్చిన కృష్ణమూర్తి ఆటోకు డబ్బులు ఉన్నాయా? అని అడుగుతాడు. దీంతో కావ్య ఉన్నాయని చెప్పగానే మూర్తి ఎమోషన్ అవుతాడు. డబ్బులు లేకున్నా ఉన్నాయని మా కష్టం అర్థం చేసుకుని ఆఫీసు నడిచి వెళ్లాలనుకున్నావా? తల్లీ అంటూ తన జేబులో డబ్బులు ఇస్తాడు. కావ్య ఆఫీసుకు వెళ్లిపోతుంది. కనకం బయటకు వచ్చి కావ్య కాపురం గురించి బాధపడుతుంది. మరోవైపు రాజ్ కూడా ఆఫీసుకు వెళ్తుంటాడు.
అపర్ణ: జరగవు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. అంటే ఏదీ ఎవరి చేతుల్లో ఉండదని గుర్తుపెట్టుకో.. అయితే కాలమైన సమస్యలు తీరుస్తుంది. లేదా భగవంతుడైనా తీరుస్తాడు. కళ్యాణ్ ఇంటికి వస్తేనే నువ్వు ఆఫీసుకు వెళ్లొద్దు అన్నవాళ్లే నిన్ను ఆఫీసుకు వెళ్లమన్నారు. అలాగే నువ్వు మళ్లీ నీ చేతులతోనే కావ్యను తీసుకొస్తావు.
ఇందిరాదేవి: రేయ్ నువ్వు మళ్లీ కంపెనీ బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన కంపెనీకి ఉన్న పేరును నిలబెట్టు.
అపర్ణ: ఎలాగూ ఆఫీసుకు వెళ్తున్నావు కదా? దారిలో గుడి ఉంది వెళ్తూ వెళ్తూ ఆ భగవంతుడిని ఆశీర్వాదం కూడా తీసుకో
అని చెప్పగానే రాజ్ సరేనని వెళ్లిపోతాడు. అంతా గమనించిన రుద్రాణి లోపలికి వెళ్లి అనామికకు ఫోన్ చేస్తుంది. నువ్వేదో చేస్తానన్నావు. అవతల రాజ్ కంపెనీ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. అని చెప్తుంది. దీంతో అనామిక కావ్యను రంగంలోకి దించానని భార్య వర్సెస్ భర్త ఆట మొదలు కానుందని చెప్తుంది. మరోవైపు గుడికి వెళ్లిన రాజ్ గంట కొట్టబోతే..కావ్య కూడా అదే గంట కొట్టడానికి వస్తుంది.
రాజ్: నువ్వా.. ఏంటి గొగళి పురుగు పాకిందా? అనుకున్నాను.
కావ్య: గంట లోపల తేళ్లు జెర్రులు ఉన్నాయోమో అనుకున్నాను.
రాజ్: చీచీ ఎక్కడికి వెళ్లితే అక్కడకు ఫాలో అవుతున్నావా?
కావ్య: ఎవరైనా రావణాసురుణ్ని, మహిశాసురుణ్ని ఫాలో అవుతారా?
రాజ్: అసలు ప్రశాంతంగా గుడికి వస్తే నువ్వు కనిపించావేంటి?
కావ్య: గుడి మీ తాత కట్టించిందేం కాదు.
రాజ్: మరి మీ తాత కట్టించిందా?
కావ్య: మా తాత రంగులేసింది ఈ గుడికే..
అంటూ ఇద్దరూ గొడవ పడుతుంటారు. ఇంతలో పూజారి వచ్చి రాజ్‌ను గోత్రనామాలు చెప్పమని అడుగుతాడు. దీంతో రాజ్ నాకు పెళ్లి కాలేదని చెప్తాడు. పంతులు వెటకారంగా ఏదైనా లోపమా అని అడుగుతాడు. ఎక్కడైనా చూపించుకోండి అని ఉచిత సలహా ఇస్తాడు. కావ్య నవ్వుతుంది. కావ్య మాత్రం నాకు పెళ్లి అయిందని మా ఆయన బూత్ బంగ్లాను ఊడుస్తుంటాడని.. బాగా తాగొచ్చి కొడుతుంటాడని చెప్తుంది. దీంతో రాజ్ ఇరిటేటింగ్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు కంపెనీలో అందరూ ఉద్యోగులు ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ ఉంటారు.
ఉద్యోగి: ఆ బేబీ ఇంకేంటి సంగతులు మా కంపెనీలో ఉన్నత ఫ్రీడమ్ ఇంకే కంపెనీలో దొరకదు. మా కంపెనీలో అసలు బాసే ఉండడు. నువ్వు త్వరగా పర్మిషన్ తీసుకుని వచ్చేయ్ నైట్ పబ్బుకు వెళ్దాం
అంటూ మాట్లాడుతుంటాడు. ఇంతలో రాజ్ ఆఫీసులోకి ఎంట్రీ ఇస్తాడు. ఎంప్లాయిస్ ను చూసి ఆఫీసు పరిస్థితిని చూసి సీరియస్ గా చెస్ ఆడుతున్న వాళ్ల దగ్గరకు వెళ్లి చెక్ చెప్తాడు. దీంతో రాజ్‌ను గమనించిన షాకింగ్ గా లేచి కూర్చుంటారు. కట్ చేస్తే వెంటనే అందరితో మీటింగ్ లో ఉంటాడు రాజ్. ఉద్యోగులందరినీ తిడుతూ ఉంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?