Brahmamudi Serial Today September 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన కనకం – మార్కెట్ లో పడిపోయిన స్వరాజ్ కంపెనీ వ్యాల్యూ
Brahmamudi Today Episode: పూజలో చూసిన నా కూతురు చీర, నా కూతురు చేసిన దేవుడిని ఇక్కడ చూశాక ఇద్దరూ కలుస్తారని నమ్మకం వచ్చిందని కనకం చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: ఇంటికొచ్చిన కనకానికి రాజ్ ప్రసాదం పెడతాడు. ఇంతలో రుద్రాణి ఏంటి పిలవని పేరంటానికి వచ్చావు అంటుంది. ఒక వంక దొరికిందా? ఈ సాకుతో కూతురుని అత్తారింటికి పంపించి చేతులు దులుపుకోవాలని వచ్చావా? మీకే తిండికి గతి లేదు పాపం మీ కూతురుకేం పెడతారు. అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది. కనకం మాత్రం ఏమీ మాట్లాడకుండా అపర్ణ దగ్గరకు వెళ్లి ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతుంది. దీంతో రుద్రాణి కూతురేమో చచ్చేదాకా తీసుకొచ్చింది. నువ్వేమో యోగక్షేమాలు అడగడానికి వచ్చావా? అంటుంది. దీంతో రాజ్ ఏదైనా జరిగితే నాకు కళావతికే జరిగిందని.. ఆమె ఏం చేశారని చెప్తాడు. దీంతో స్వప్న, రుద్రాణిని తిడుతుంది.
స్వప్న: నువ్వు ఎందుకు వచ్చావు అమ్మా..
కనకం: నేను వదిన గారిని పలకరించడానికే వచ్చాను. హాస్పిటల్ లో ఉన్నప్పుడే రావాలనుకున్నాను. కానీ ఈలోపే ఏవేవో జరిగిపోయాయి. మీరేమీ పట్టించుకోకండి. ఎవర్నీ పట్టించుకోకండి. భగవంతుడు అందర్నీ చల్లగా చూస్తాడు.
రుద్రాణి: ఇదేంటి మంచిగా ఉన్నట్లు నటించి మార్కులు కొట్టేయాలని చూస్తుందా? వీల్లేదు. కనకాన్ని ఎలాగైనా రెచ్చగొట్టి జీవితంలో ఈ ఇంటికి కావ్యను పంపించను అనేలా చేయాలి ( అని మనసులో అనుకుంటుంది.) అయినా ఏం ముఖం పెట్టుకుని వచ్చావు. మా వదిన ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసా...?
అపర్ణ: రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు.
రుద్రాణి: నువ్వు ఉండు వదిన వీళ్ల సంగతి నీకు తెలియదు. ఎలాగైనా తన కూతురిని ఇక్కడ వదిలేయాని ఆశపడుతున్నావా?
కనకం: ఆశ కాదు నమ్మకం. ఆ నమ్మకం ఇక్కడికి వచ్చాకా మరింత బలపడింది. నా కూతురుకు అల్లుడికి ఉన్న బందం ఇంకా తెగిపోలేదు అనడానికి రాముడి పక్కన కాంచన సీత లాగా నా అల్లుడి పక్కన ఉన్న నా కూతురి చీరే సాక్ష్యం. ఇంకొక విషయం అది భగవంతుడి సంకల్పం తప్పా ఎవ్వరూ చేయలేనిది.
రుద్రాణి: ఏంటో అది.
కనకం: నా కూతురు తన చేతులతో చేసిన వినాయకుడి విగ్రహం మీ ఇంటికే వచ్చి చేరింది. అది ఎవరు ప్లాన్ చేస్తే జరిగింది. నా కూతురు చేసిన దేవుడే ఈ ఇంటికి చేరాడు. నా కూతురు రాదా? కావ్య ఎవరి కోసమో ఈ విగ్రహం చేసింది. కానీ ఎవరింటికి రావాలని ఎవరు నిర్ణయించారు. ఏ బంధం ఇక్కడికి చేర్చింది. బయట వేల కొద్ది వినాయక విగ్రహాలు అంగట్లో పెట్టి అమ్ముతున్నారు. కానీ నా కూతురు రాత్రంతా మేలుకొని తయారు చేసిన ఆ స్వామి మీ ఇంటికి నడిచివచ్చాడు ఇదే ఆ స్వామి లీల. వచ్చాడు కదా విఘ్నాలన్నీ తొలగించి నా కూతురు కాపురాన్ని కచ్చితంగా నిలబెడతాడు.
అని చెప్పి కనకం వెళ్లిపోతుంది. ఇందిరాదేవి చూశావా? రాజ్ నీది కావ్యది బ్రహ్మ వేసిన ముడి అది ఎప్పటికీ విడిపోదు అని చెప్తుంది. మరోవైపు కావ్య కోసం అనామిక మేనేజర్ ను పిలిచి కావ్యను జాగ్రత్తగా హ్యాండిల్ చేయమని చెప్తుంది. ఇంతలో బాయ్ వచ్చి కావ్య అని ఎవరో వచ్చారని మీ క్యాబిన్ లో కూర్చోబెట్టానని చెప్పగానే మేనేజర్ వెళ్లి కావ్యతో మాట్లాడి రేపటి నుంచే వచ్చి జాబ్ లో జాయిన్ అవ్వమని చెప్తాడు. సరేనని కావ్య వెళ్లిపోతుంది.
ఇంటికి వెళ్లి తనకు జాబ్ వచ్చిందని చెప్తుంది కావ్య. దీంతో కనకం.. కావ్యను తిడుతుంది. కాపురం గురించి పట్టించుకోకుండా జాబు చేస్తాననడం నాకు నచ్చలేదు అంటుంది. అయితే కావ్య సంవత్సరం పాటు తాను ఆ ఇంట్లో పడిన అవమానాలు గుర్తు చేసుకుంటుంది. మరోవైపు సీతారామయ్య ఫ్రెండ్ వచ్చి తన మనవడు శ్రీకాంత్ మీ కంపెనీతో డీల్ రద్దు చేసుకుంటున్నాడని అందుకు రాహులే కారణం అని చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!