Brahmamudi Serial Today September 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంటికొచ్చిన కావ్య – అనామిక రీ ఎంట్రీ
Brahmamudi Today Episode: కావ్యకు సారీ చెప్పి ఇంటికి తీసుకురమ్మని రాజ్ కు ఆత్మ హితబోధ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: రూంలో ఉన్న రాజ్ దగ్గరకు ఆత్మ వస్తుంది. గుర్రుగా చూస్తుంది. ఏంటో చెప్పు అంటాడు రాజ్. ఆత్మ అలాగే చూస్తుంటుంది. దీంతో ఆ కావ్యను నేను ఏమీ అనలేదని దానికి ఎంత పొగరో చూశావా? అంటూ చెప్తుంటే ఆత్మ అలాగే చూస్తుంది. నువ్వేంటి నా పెళ్లాం కంటే గుర్రుగా చూస్తూనే ఉన్నావు అంటాడు. దీంతో నువ్వు కళావతిని జీతం ఇస్తా పెళ్లాంగా ఉండమంటావా? అంటూ ఆత్మ రాజ్ ను తిట్టి వెళ్లి క్షమించమని అడిగి కళావతిని తెచ్చుకో అంటాడు. మరోవైపు కావ్య బెడ్ సర్ధుతుంది. తన రూంలోని పెళ్ళి ఫోటో చూసుకుని ఎమోషనల్ అవుతుంది. రాజ్ తిట్టిన మాటల గుర్తు చేసుకుంటుంది. ఇంతలో కనకం రావడాన్ని చూసి కన్నీల్లు తుడుచుకుని....
కావ్య: అమ్మా నాన్న వచ్చేశాడా? అమ్మా.. భోజనం అంతా సిద్దం చేశాను రమ్మని చెప్పు అందరం కలిసి భోజనం చేద్దాం. అమ్మా ఏంటి అలా చూస్తున్నావు. నాన్న ఆకలికి అస్సలు తట్టుకోలేరు రమ్మని చెప్పు.
అని కావ్య కిచెన్ లోకి వెళ్లిపోతుంది. కనకం బెడ్ మీద కావ్య పెట్టిన పెళ్లి ఫోటో చూసి వెళ్లిపోతుంది. తర్వాత పడుకుని ఉన్న రాజ్ దగ్గరకు కాఫీ తీసుకుని వస్తుంది కావ్య. రాజ్ ను నిద్ర లేపుతుంది.
కావ్య: ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న పెనిమిటి గారు లేవండి.
రాజ్: నువ్వా…
కావ్య: ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్న భర్త గారు. కాఫీ తీసుకోండి.
రాజ్: నువ్వు వచ్చావా..? ఎలా వచ్చావు.
కావ్య: షేర్ ఆటోలో వచ్చాను.
రాజ్: ఓహో నిన్న నేను మాట్లాడిన మాటలకు భయపడి, బాధపడి, బెదిరిపోయి, హడలిపోయి వచ్చావన్నమాట. ఆ పొగరు తగ్గిందా?
కావ్య: లేదు. నా చార్జర్ మరిచిపోయాను. అలాగే తెగిపోయిన రెండు చెప్పులున్నాయి. వాటిని తీసుకెళ్లడానికి వచ్చాను.
రాజ్: అయితే ఉండి పోవడానికి రాలేదా?
కావ్య: చీచీ.. వాళ్ల బలవంతం మీద. వీళ్ల బలవంతం మీద మొగుడు నా మీద చెయ్యి వేస్తుంటే.. గొంగళి పురుగులు పాకినట్లు ఉంటుంది.
అని కావ్య చెప్పగానే అలాంటిది నాకు కాఫీ ఎందుకు తీసుకొచ్చావు అని రాజ్ అడుగుతాడు. మీకు కాఫీ ఇస్తేరే త్వరగా రెడీ అవుతారు కదా? రెడీ అయితేనే నన్ను అక్కడ డ్రాప్ చేస్తారు కదా? అంటుంది కావ్య. దీంతో సరేలే ఎలాగూ వచ్చావు కదా? ఇక్కడే ఉండిపో అంటాడు. నేను ఎలా ఉండాలి. నేను ఇక్కడే ఉండాలి అంటే మీరు కిందకు దిగిరావాలి అని అదంతా బాండ్ పేపర్ మీద రాసివ్వాలి అని చెప్తుంది. ఇంతలో రాజ్ కళ్లు తెరచి చూడగానే ఎదురుగా పనిమనిషి కనిపిస్తుంది. కళావతి ఎక్కడ అని అడుగుతాడు. రాలేదని మీరు కళ కని ఉంటారని కావ్య అమ్మ లాంటి భార్యను బాధపెట్టి పంపిచారు. అని చెప్పి వెళ్లిపోతుంది పనిమనిషి. మరోవైపు కళ్యాణ్, అప్పు ఇద్దరూ మార్కెట్ కు వెళ్లి వస్తూ.. కూరగాయల రేట్లు చాలా పెరిగాయని మాట్లాడుకుంటుంటారు. ఇంతలో వారికి ఎదురుగా అనామిక వచ్చి కారు దిగుతుంది. కారులోంచి సామంత్ దిగుతాడు.
అనామిక: దుగ్గిరాల వారసుడు రోడ్డు మీద పడ్డట్టున్నాడు. కారు కూడా లేనట్టుంది.
అప్పు: నీలాగా పరాయివాళ్ల కారులో తిరిగే అలవాటు లేదు.
అనామిక: పరాయివాళ్లు ఎవరున్నారు ఇక్కడ. ఇతను నా పియాన్సీ.. పేరు సామంత్. సామంత్ గ్రూప్ ఆఫ్ జ్యూవలరీస్ చైర్మన్. స్వరాజ్ గ్రూప్‌కు నిజమైన ప్రత్యర్థి. తొందరలోనే స్వరాజ్ కంపెనీని పడగొట్టి సామంత్ కంపెనీ ఎదుగుతుంది.
( కళ్యాణ్, అప్పు నవ్వుతుంటారు.) ఎందుకు అలా నవ్వుతున్నారు.
కళ్యాణ్: ఒక చీమ ఏనుగు కుంభస్థలం మీద నిలబడి పాతాళానికి తొక్కేస్తా అన్నట్లుంది.
సామంత్: నా గురించి నీకు తెలియదు.
అప్పు: నీ గురించి కళ్యాణ్ కు తెలియదు. కానీ నీ పక్కన ఉన్నదాని గురించి తెలుసు. నిన్ను మొత్తం ఊడ్చేసి రోడ్డున పడేస్తుంది.
అనగానే అనామిక ఎవరు రోడ్డున పడ్డారో తెలుస్తుంది కదా అంటుంది. దీంతో నేను రోడ్డున పడలేదు. నచ్చిన అమ్మాయి కోసం ఆస్థులు వదులుకున్నాను అంటాడు కళ్యాణ్. దీన్నే రోడ్డుపడటం అంటాడు సామంత్. ఆయన రోడ్డున పడటం కాదు. నిన్ను ఇది రోడ్డున పడేయకుండా చూసుకో అంటుంది అప్పు. దీంతో ఆలోచనలో పడిపోతాడు సామంత్ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!