Brahmamudi Serial Today September 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్య కోసం కనకం ఇంటికి వెళ్లిన సీతారామయ్య ఇందిరాదేవి – రాజ్ కు హుకుం జారీ చేసిన అపర్ణ
Brahmamudi Today Episode: రాజ్ ను తిట్టిన అపర్ణ నువ్వు నా కోడలిని తీసుకురాకపోతే నేనే వెళ్లి తీసుకొస్తానని వెళ్లబోతుంటే ఇందిరాదేవి ఆపుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: అపర్ణకు నిజం చెప్పిన స్వప్న. కావ్య ఆత్మాభిమానం దెబ్బతిని ఇంట్లోంచి వెళ్లిపోయింది. అని చెప్పగానే అపర్ణ తూలి పడుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో కావ్య మంచి పని చేసిందని భర్త మనసులో ప్రేమ లేదని చెబితే నువ్వెంత నీ లెక్కెంత అని పౌరుషంతో వెల్లిపోయింది అని అపర్ణ మెచ్చుకుంటుంది. దటీజ్ కావ్య అయినా నా కోడలు ఏం తప్పు చేసిందని క్షమాపణ అడగమన్నారు. అది మన సంస్థ ప్రతిష్ట కాపాడింది అని కావ్యను ఆకాశానికి ఎత్తుతుంది అపర్ణ.
ఇందిరాదేవి: నిజమే అపర్ణ వీడు తెగేదాకా లాగుతున్నాడు. ఈ రుద్రాణేమో ఆగ్నికి ఆజ్యం పోస్తుంది. కావ్య అన్నమాట మీదే నిలబడింది. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందేమోనని రాజీ కుదర్చడానికి ప్రయత్నించాను.
అపర్ణ: రాజీ కుదర్చడానికి అది మీ పెద్దకోడలు కాదు అత్తయ్య. అది నా కోడలు. నీతిగా నిజాయితీ బతికే నా కోడలు వీణ్ని క్షమాపణ అడిగి ఉంటే నేనే దాని చెంప పగులగొట్టేదాన్ని.
రుద్రాణి: వదిన ఆ కావ్య కూడా ఇలాగే నీతి నిజాయితీలు అంటూ నిన్ను బోల్తా కొట్టించింది. కంపెనీ నుంచి అసలు ఎలాంటి ఫోన్ రాలేదు. నిన్ను అలా నమ్మించింది. రాహుల్ ను ఆఫీసుకు వెళ్లకుండా చేసేందుకే ఇదంతా చేసింది.
అపర్ణ: రాహుల్ ఆనాడే కంపెనీకి వెళ్లనని తేగేసి చెప్పాడు. మళ్లీ కొత్తగా కంపెనీకి వెళ్లకుండా కావ్య ప్రయత్నం చేయడం ఏంటి?
అని అపర్ణ అడగడంతో రుద్రాణి షాక్ అవుతుంది. అపర్ణ రాహుల్, రుద్రాణిని తిడుతుంది. అయినా ఇప్పుడు నీ మీద కూడా నాకు కోపం రావడం లేదు. చెప్పుడు మాటలు పట్టుకున్న నా కొడుకుదే తప్పు. అంటూ రాజ్ ను తిడుతుంది అపర్ణ. కావ్య మనసుకు గాయం చేసి పంపిచావు కదరా? అంటూ ఎమోషన్ అవుతుంది అపర్ణ. దీంతో రాజ్ నేనేం వెళ్లిపోమ్మనలేదు మమ్మీ అంటాడు. అయితే నాకోసమే ఇదంతా చేశావు కదా? ఇప్పుడు నేనే చెప్తున్నాను నువ్వు వెళ్లి నా కోడలును ఇంటికి తీసుకురా? అని హుకుం జారీ చేస్తుంది అపర్ణ. దీంతో ఏ కారణం చేతనైనా కానీ కళావతి నిన్ను వదిలి వెళ్లకూడదు. అలాంటి మనిషిని నేను వెళ్లి తీసుకురాలేను అని చెప్పి బెడ్ రూంలోకి వెళ్లిపోతాడు. అయితే నేనే నా కోడలు దగ్గరకు వెళ్లి తీసుకోస్తాను అని వెళ్లబోతుంటే సీతారామయ్యా ఆపి నేను మీ అత్తయ్యా వెళ్లి తీసుకొస్తాము అంటాడు. మరోవైపు రుద్రాణి పై రాహుల్ ఫైర్ అవుతుంటాడు.
రాహుల్: మమ్మీ మీ వదినకు వేరే పనేం లేదా? ప్రతిసారి కావ్య కావాలి అంటుంది.
రుద్రాణి: ఆ కావ్య ఇంట్లో వాళ్లను అంతలా మాయ చేసిందిరా..
రాహుల్: కష్టపడి ఇంత ప్లాన్ చేసి ఆ కావ్యను ఇంట్లోంచి తరిమేసాం. ఇప్పుడు ముసలొళ్లు వెళ్లి కావ్యను తీసుకొస్తే మన ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా? వీళ్లను రేపు ఎలాగైనా ఆపాలి మమ్మీ.
రుద్రాణి: ఆగురా ఎందుకు అలా అరుస్తావు. కావ్య ఆత్మాభిమానం ఉన్న ఆడదిరా.. వీళ్లు వెళ్లి పిలవగానే కావ్య రాదు.
రాహుల్: అయితే నువ్వు చెప్పిన దాని ప్రకారం ఎవరు పిలిచినా ఆ కావ్య రాదంటావా?
అని రాహుల్ అడగ్గానే ఎవరు పిలిచినా రాదు కానీ రాజ్ వెళ్లి పిలిస్తే వస్తుంది. అది కూడా రాజ్ తప్పైపోయిందని క్షమాపణ చెప్తేనే వస్తుంది. రాజ్ ఆ పని చేయడు కదా? అంటుంది రుద్రాణి. తర్వాత ఇందిరాదేవి, సీతారామయ్య కనకం ఇంటికి వెళ్తారు. వాళ్లను చూసిన కనకం కంగారుగా కావ్య, కృష్ణమూర్తిని పిలుస్తుంది. ఇంట్లోకి వచ్చిన ఇందిరాదేవి ఇలా ఎన్నిరోజులని దూరంగా ఉంటావు. నువ్వు తిరిగి ఆ ఇంటికి రావాలని అందరూ కోరుకుంటున్నారు అని చెప్తుంది. కనకాన్ని కూడా నువ్వు తల్లిగా కూతురుని అత్తారింటికి పంపాలని లేదా అని అడుగుతుంది. దీంతో తను వస్తే ఈ క్షణమే మీతో పాటు తీసుకువెళ్లండి అని చెప్తుంది కనకం. దీంతో కావ్య మీరు కోరుకున్నట్లే వస్తాను కానీ ఆ ఇంట్లో నా స్థానమేంటో చెప్పండి అమ్మమ్మా అంటూ ప్రశ్నించడంతో ఇందిరాదేవి, సీతారామయ్య ఏమీ చెప్పలేక తిరిగి వెళ్లిపోతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఇంట్లో బల్లులతో విసిగిపోయారా? ఇలా చేయండి బల్లులన్నీ పరార్