Brahmamudi Serial Today September 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యను గెంటేస్తానన్న రుద్రాణి – రుద్రాణికి వార్నింగ్ ఇచ్చిన సుభాష్
Brahmamudi Today Episode: ఇప్పటికైనా రాజ్ ను కమాపణ అడగమని కావ్యకు ఇందిరాదేవి చెప్పడంతో నేను తప్పు చేయనప్పుడు ఎందుకు కమాపణ అడగాలని కావ్య ప్రశ్నించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: నీ నిర్లక్ష్యం ఖరీదు మా అమ్మ నిండు ప్రాణాలు. అది తెలుసా నీకు ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగిదే నిన్ను జీవితంలో క్షమించను అంటూ రాజ్ వార్నింగ్ ఇవ్వడంతో ఏదైనా జరిగిదేకా ఈ దరిద్రాన్ని ఇంట్లో ఉండనిస్తావా..? జరిగిన అనర్థం చాలు ఇక ఇంట్లోంచి గెంటి పారేసేయ్ రాజ్ అని రుద్రాణి అంటుంది.
సుభాష్: ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి. తప్పు ఒప్పో ఏదో జరిగింది. వాడు ఏదో ఆవేశంలో ఉంటే నువ్ వాడిని ఇంకా రెచ్చగొడుతున్నావేంటీ?
ఇందిరాదేవి: రాజ్ పెద్ద పొరపాటే జరిగింది. కానీ, సర్దుకుపోవాలి. రుద్రాణి మాటలు పట్టుకుంటే ఇంట్లో ఏ ఒక్కరి కాపురం నిలబడదు.
రాజ్: అంత సింపుల్‌గా ఎలా క్షమించను. అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటుంది. పోతే కోట్లు పోతాయ్. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుండాలి.
ఇందిరాదేవి: రాజ్ ఇదే మొదటి తప్పు అనుకుని కావ్యను క్షమించరా..! నువ్వైనా జరిగినదానికి క్షమాపణ అడగొచ్చు కదా అని కావ్య.
కావ్య: నేను ఎందుకు అడగాలి అమ్మమ్మ. నేనేం తప్పు చేశాను. నేను ఎన్నటికీ క్షమాపణ అడగను. ఒకవేళ క్షమించమని అడిగానంటే నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నట్లే.
రుద్రాణి: చూశావా అమ్మా.. ఇది నీ మనవరాలి అసలు స్వరూపం. ఇన్నాళ్లకు బయటపడింది. ఇవాళ మీ పెద్దరికాన్ని కూడా పూచికపుల్లలా తీసిపడేసింది.
ధాన్యలక్ష్మీ: అవును, ఆడదానికి ఇంత అహంకారం ఉండకూడదు. పుట్టింట్లో తినడానికి దిక్కుండదు కానీ, ఇక్కడ తల ఎగిరేసుకుని మాట్లాడుతుంది.
రుద్రాణి: అక్కడ మా వదిన ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఎంత పొగరుగా మాట్లాడుతుంది. ఏం జరిగినా ఇంట్లోంచి గెంటేయరనే ధీమా ప్రదర్శిస్తోంది.
అంటూ రుద్రాణి కావ్యను గెంటేయడానికి చేయి పట్టుకుంటే కావ్య రుద్రాణిని నువ్వెవరు నన్ను గెంటేయడానికి అంటూ విదిలించుకుంటుంది. అందరూ నీలాగా మొగుణ్ని వదిలేసి పుట్టింట్లో ఉండాలా? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో మర్యాదగా బయటకు నడువు అని రుద్రాణి అంటుంది. ఆ మాట మీరు చెప్పకూడదు. నా భర్త చెప్పాలి అని కావ్య అంటుంది.
కావ్య: ఏవండి నన్ను వెళ్లిపోమంటారా?
రుద్రాణి: రాజ్ విన్నావా. నువ్ పొమ్మంటే కనీసం బతిమిలాడుకోవాలని కూడా లేదు. ఇలాంటిది నీకు భార్యగా ఉండాలా?
స్వప్న: వాళ్ల మధ్య దూరి ఓవరాక్షన్ చేస్తున్నావేంటీ.. ఇన్నాళ్లు లేనిది అపర్ణ ఆంటీపై ప్రేమ పొంగిపోయినట్లు మాట్లాడుతున్నావు.
సుభాష్: రాజ్ చాలు కావ్య తప్పు చేసే మనిషి కాదు.
కావ్య: మావయ్య గారు మీరు ఉండండి.. ఇంట్లోంచి వెళ్లిపోమంటారా మీరు చెప్పండి.
Also Read : బిగ్బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి త్వరలోనే తండ్రి కాబోతున్నాడు.. ఇన్స్టాలో వైరల్ అవుతోన్న శ్రీజ సీమంత ఫోటోలు
రాజ్: అసలు ఏమనుకుంటున్నావు నువ్వు. నువ్వు ఏ తప్పు చేయలేదా? ఇప్పుడు చెబుతున్నాను విను. నువ్వు నా భార్యగా ఉండటానికే పనికిరావు. ఇంటి కోడలిగా ఉండే అర్హత నీకు లేదు. నేను నిన్ను కోరుకుని పెళ్లి చేసుకోలేదు. దుగ్గిరాల ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడతావని తాతయ్య వాళ్లు అంటే.. ఇష్టం లేకపోయినా తాళి కట్టాను. తాళి కట్టాను కాబట్టి, భరించాను..ఇంట్లో ఉండనిచ్చాను. మా అమ్మ చెప్పడం వల్ల బలవంతంగా నీతో కాపురం చేశాను.
కావ్య: ఏమన్నారు.. ఇష్టం లేకపోయినా తాళి కట్టారా..? పెద్దవాళ్ల మాట కోసం నాతో బలవంతంగా కాపురం చేశారా..? ఛ.. నేను ఇవన్ని విని కూడా ప్రాణాలతో ఎలా ఉన్నాను.
అంటూ కావ్య ఎమోషనల్ గా ఫీలవుతూ రాజ్ తనతో ప్రేమగా ఉన్న సందర్భాలు గుర్తు చేసుకుని ఏడుస్తుంది. ఎవరి కోసమో నన్ను ఇంట్లో ఉండనిచ్చి.. నాకు అన్నం పెట్టినందుకు మీకు శతకోటి వందనాలు మహాప్రభో. నాకు అస్థిత్వం లేని ఇంట్లో.. ఇంకా నేనెందుకు ఉండాలి అంటూ కావ్య బాధపడుతుండగానే ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ ఐ లవ్ యూ చెప్పిన భూమి – భూమిని తోసేసిన గగన్