అన్వేషించండి

Meghasandesham Serial Today September 10th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్ ఐ లవ్ యూ చెప్పిన భూమి – భూమిని తోసేసిన గగన్

Meghasandesham Today Episode: గగన్ కు తన ప్రేమ విషయం చెప్పగానే తనను దూరం పెట్టేస్తాడేమోనని భూమి భయపడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode: భూమి ఆనందంతో ఏడుస్తూ వెళ్లి గగన్‌ ను హగ్‌ చేసుకుంటుంది. ఏమైందని గగన్‌ అడగ్గానే నేనెవరో తెలుసా? నీ మనసులో ఉన్న నీ మువ్వని అని భూమి జరిగిన విషయం మొత్తం గగన్‌ కు గుర్తు చేస్తుంది. గగన్‌ దాచుకున్న మువ్వను తీసి చూపిస్తుంది భూమి. అది చూడగానే గగన్‌ ఎమోషనల్‌ అవుతాడు.

భూమి: ఈ మువ్వ మా అమ్మది. మా అమ్మ నాకు ప్రాణం పోస్తే నువ్వు నాకు పునర్జన్మను ఇచ్చావు. నా ప్రాణాలు కాపాడినందుకు ఏమిచ్చి నేను మీ రుణం తీర్చుకోగలను.

గగన్‌: ఆ పాప నువ్వా.. అప్పటికి కనీసం కళ్లు కూడా తెరవలేదు. కానీ ఆ పాప దగ్గర దొరికిన మువ్వ మీ అమ్మదే అని నువ్వు ఎలా చెప్తున్నావు. ఆ పాప నువ్వే అని నీకెలా తెలుసు?

   అని గగన్‌ అడగ్గానే భూమి జరిగిన విషయం మొత్తం తనకు తెలిసింది మొత్తం చెప్తుంది. అందరూ అనుకుంటున్నట్లు మా అమ్మ కడుపులో బిడ్డతో చనిపోలేదు. చనిపోయేముందు నేను చనిపోకుండా నన్ను బొమ్మలో పెట్టి బయటకు విసిరేసింది. ఆ బొమ్మలో ఉన్న నన్ను మీరు కాపాడారు. లేదంటే ఏమైపోయేదాన్ని. ఆరోజు మీరు కాపాడారు కాబట్టే నేను బతికాను అని భూమి చెప్తుంది. అసలు ఇదంతా నీకెలా తెలుసు అని గగన్‌ అడగ్గానే ఆరోజు నన్ను కిడ్నాప్‌ చేసిన నాగు నాకు మొత్తం చెప్పారు అంటుంది.

 భూమి: ఈరోజే తెలిసింది ప్రముఖ నాట్యకారిణి శోభాచంద్ర గారు మా అమ్మ. పెద్ద బిజినెస్‌ మాన్‌ శరత్‌చంద్ర మా నాన్న. అది నా ఇల్లు. వాళ్లందరూ నావాళ్లు. ఈరోజు నేను బతికి ఉన్నానన్నా.. దానికి కారణం మీరు. ఐ లవ్‌ యూ..

 అని భూమి గగన్‌ ను హగ్‌ చేసుకుంటుంది. దీంతో శరత్‌చంద్రతో తనకు గొడవ అయిన విషయం గుర్తు చేసుకుంటాడు గగన్‌.

గగన్‌: వదులు..

భూమి: వదలను.. ఇప్పుడే కాదు ఎప్పటికీ వదలను మీరంటే నాకు అంత ఇష్టం.

గగన్‌: నాకు ఇష్టం లేదు.

భూమి: నేను రాగానే ఇష్టపడ్డానా? అలాగే నాలుగు రోజులైతే మీరు ఇష్టపడతారు.

గగన్‌: అది ఈ జన్మకు జరగదు.

భూమి: ఏ జన్మలోనో రాసింది కాబట్టే ఈ జన్మలో కలిశాము. కలిసే ఉంటాం.

అనగానే జరగదని చెప్పానా? అని కోపంగా గగన్‌ చెప్పగానే భూమి ఎప్పటికైనా జరుగుతుంది అని భూమి చెప్పగానే ఏ ఇంటినైతే నా లోకం నుంచి తీసేశానో ఏ బంధం అయితే నాకు వద్దని వదిలేసుకున్నానో ఆ బంధం నీ నుంచి వస్తుందని తెలిస్తే నిన్ను ఆరోజే వదిలేసే వాణ్ని అంటూ గగన్‌ తనను దూరంగా నెట్టివేసినట్టు ఆటోలో వస్తూ కలగంటుంది భూమి. భయంగా గగన్‌ ఆఫీసులోకి అడుగుపెడుతుంది. తనతో పాటు తీసుకొచ్చిన ఫోటో పక్కన పెట్టి గగన్‌ చాంబర్‌ లోకి వెళ్తూ.. ముందు తనమీద ప్రేమను పుట్టించుకుంటే తర్వాత ఎలాగైనా చేయోచ్చని అనుకుంటుంది.

భూమి: లోపలికి రావొచ్చా గగన్‌ గారు.

గగన్‌: నీ మాట మారింది. తీరు మారింది. ఏదో తేడాగా ఉందే..

భూమి: ఇదిగో తలతిక్క గారు నేనేం మారలేదు.

గగన్‌: ఇది కదా వర్జినల్‌.

భూమి: అయ్యో లేదండి.. అలవాటులో పొరపాటులా వచ్చింది. ఇంకెప్పుడూ మీకు కోపం తెప్పించను.

 అంటూ ప్రేమగా మాట్లాడుతూ.. గగన్‌కు కాఫీ కలిపిస్తానని.. పూరికి డాన్స్‌ నేర్పిస్తానని.. ఆంటీకి ఇంట్లో సాయం చేస్తానని చెప్తుంది భూమి. ఇంతలో భూమి కలిపి ఇచ్చిన కాఫీ బాగాలేని గగన్‌ నా కాఫీ నేనే కలుపుకుంటానని వెళ్లి కాఫీ కలుపుకుంటాడు. గగన్‌ వదిలేసిన కాఫీని భూమి తాగుతుంది. మరోవైపు పూరి మాటలు గుర్తు చేసుకున్న కృష్ణప్రసాద్‌ శారదకు ఫోన్‌ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘జగధాత్రి’ సీరియల్‌: సుధాకర్ బర్తుడే చేసిన కేదార్ – కేదార్ ను చంపేస్తానన్న యువరాజ్

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today July 28th: నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
Karthika Deepam 2 Serial Today July 28th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!
Podarillu Serial Today July 28th:ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్న మాధవ్‌,కేశవ్‌, కన్నా....దీనికి మహాలక్ష్మీ రియాక్షన్ ఏంటి..?
పొదరిల్లు: ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్న మాధవ్‌,కేశవ్‌, కన్నా....దీనికి మహాలక్ష్మీ రియాక్షన్ ఏంటి..?
Brahmamudi Serial Today July 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ, మదన్ మధ్య గొడవ – శశికి పడిపోయిన ఐషు
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ, మదన్ మధ్య గొడవ – శశికి పడిపోయిన ఐషు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget