అన్వేషించండి

Jagadhatri Serial Today September 9th: ‘జగధాత్రి’ సీరియల్‌: సుధాకర్ బర్తుడే చేసిన కేదార్ – కేదార్ ను చంపేస్తానన్న యువరాజ్

Jagadhatri Today Episode: సుధాకర్ బర్తుడే వేడుకల్లో నిషిక చెంప పగులగొడుతుంది కౌషికి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode:  ధాత్రి, కేదార్‌ వచ్చి డోర్‌ కొట్టడంతో ఉలిక్కిపడి నిద్ర లేచిన సుధాకర్‌ తో వైజయంతి ఎవరైనా దొంగలు వచ్చారేమో అని భయపడుతుంది. నిషికకు ఫోన్‌ చేస్తుంది. నిషిక లిఫ్ట్‌ చేయదు. యువరాజ్‌కు చేయగానే ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తుంది. తర్వాత ఒక కర్ర తీసుకుని ఇద్దరూ కలిసి డోర్‌ ఓపెన్‌ చేసి బయటకు రాగానే గార్డెన్‌ లో కౌషికి, ధాత్రి, కేదార్‌ కనిపించడంతో కంగారుగా వాళ్ల దగ్గరకు వెళ్తారు.

సుధాకర్‌: నిద్రపోకుండా మీరేం చేస్తున్నారు..?

వైజయంతి: మా గది తలుపులు కొట్టిందెవరు? మీరెవరైనా చూసుండారా?

ధాత్రి: మీ గది తలుపులు కొట్టింది. మెయిన్‌ డోర్‌ తెరిచి ఉంచింది మేమే

వైజయంతి: దేనికి అమ్మీ మీకు నిద్ర పట్టలేదని ఇంకెవ్వరినీ నిద్ర పోనివ్వొద్దు అనుకుంటున్నారా? కొంచెమైనా బుద్ది ఉందా? మీకు. బంగారం లాంటి నిద్ర చెడగొట్టారు.

 అంటూ వైజయంతి తిడుతుంటే కౌషికి అడ్డుపడుతుంది. వీళ్లు చేసింది తెలిస్తే నువ్వు షాక్‌ అవుతావు. అంటూ కేదార్‌ చేసింది అంతా చేసి ఊరికే నిలబడితే ఎలా అంటూ కౌషికి చెప్పగానే కేదార్‌, సుధాకర్‌కు బర్తుడే విషెష్ చెప్పి కేక్‌ తీసుకొస్తాడు. ఇంతలో నిద్ర లేచి బయటకు వచ్చిన నిషిక కేక్‌ చూసి షాక్‌ అవుతుంది. కోపంగా లోపలికి వెళ్లిపోతుంది. యువరాజ్‌ను నిద్రలేపుతుంది. మత్తులో ఉన్న యువరాజ్‌ నిద్రలేవడు. దీంతో నీళ్లు చల్లి నిద్రలేపి బయటకు తీసుకెళ్తుంది. బయట సుధాకర్‌ కేక్‌ కట్‌ చేయబోతుంటే యువరాజ్‌ వచ్చి గొడవ చేస్తాడు. మా నాన్న బర్తుడేకు వాడెవడు అంరెజ్‌ చేయడం అంటూ సైకోలా బిహేవ్‌ చేస్తాడు. దీంతో యువరాజ్‌ను సుధాకర్‌ తిడతాడు.  

ధాత్రి: యువరాజ్‌.. మా నాన్నా మా నాన్నా అని అరిస్తే సరిపోదు. అవి తమ పిల్లలు తీరుస్తారని ఆశపడుతూనే ఉంటారు. అదేంటో తెలుసుకుని తీరిస్తే అప్పుడనుకుంటారు నాకొడుకు అని.

వైజయంతి: జగధాత్రి..

ధాత్రి: నిజం కాదంటారా? అత్తయ్యగారు. తాగొచ్చిన కొడుక్కి బయం పెట్టకపోగా నీ కొడుకు చేయని పని కేదార్‌ చేశాడు. పొద్దన్నుంచి మామయ్యగారికి బర్తుడే విషెష్ ఎలా చెప్పాలో ఎంత తప్పన పడ్డారో తెలుసా?

యువరాజ్: ఇదంతా నీవల్లే జరిగింది నిన్ను చంపేస్తానురా..

 అంటూ యువరాజ్‌, కేదార్‌ మీదకు వెళ్లి గళ్ల పట్టుకోవడంతో ధాత్రి వచ్చి విడిపిస్తుంది. దీంతో నిషిక నా మొగుణ్నే తోస్తావే.. అంటూ ధాత్రిని కొట్టబోతుంటే కౌషికి అడ్డుపడి నిషికను కొడుతుంది. యువరాజ్‌ తాగొచ్చి ఇప్పటికే సగం గౌరవం పోగొట్టుకున్నాడు. అని తిట్టగానే యువరాజ్‌ను తీసుకుని వైజయంతి, నిషిక లోపలికి వెళ్లిపోతారు.  తర్వాత సుధాకర్‌ కేక్‌ కట్‌ చేసి కేదార్‌ కు తినిపిస్తాడు.

సుధాకర్‌: ఈరోజు నా పుట్టినరోజు అని నీకెలా తెలుసు కేదార్‌.

కేదార్: మీ గురించి నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది నాన్నా.. నాకు సంబంధించి మీకు ఏం తెలుసో నాకు తెలియదు కానీ మీకు సంబంధించిన ప్రతి చిన్న విషయం నాకు తెలుసు నాన్నా.

సుధాకర్‌: థాంక్స్‌ కేదార్‌ నేను మర్చిపోలేని ఒక మంచి మెమెరీని ఇచ్చావు.

కేదార్‌: నేనే మీకు థాంక్స్‌ చెప్పాలి నాన్నా. మీరు నాకు చెప్పకూడదు.

 అనగానే సుధాకర్‌, కేదార్‌ను మెచ్చుకుని లోపలికి వెళ్తాడు. కౌషికి కూడా వెళ్లిపోతుంది. కేదార్‌, ధాత్రి హ్యాపీగా ఫీలవుతుంటారు. మరుసటి రోజు ఉదయం కేదార్‌, ధాత్రిని భార్యామణి గారు అని ప్రేమగా పిలవడంతో చెప్పండి శ్రీవారు రాత్రి నుంచి ఎంతో ఆనందంగా ఉన్నట్లున్నారు అని అడుగుతుంది. ఇంతలో మార్కెంటింగ్‌ మేనేజర్‌ రావడంతో తండ్రి సంవత్సరికం కావడంతో ఫోటో అన్ని పేపర్స్‌ లో రావాలని చెప్పి ఫ్యామిలి మెంబర్స్‌ పేర్లలో ధాత్రి, కేదార్‌ పేర్లు రావాలని చెప్తుంది కౌషికి, దీంతో మన కుటుంబం పేర్లలో వాళ్ల పేర్లు ఎందుకని వైజయంతి అడగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.   

ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి ఘనస్వాగతం పలికిన అపూర్వ – చంద్రను చూసి ఎమోషన్ అయిన భూమి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Telangana: మినీ మాల్దీవులు లక్నవరం - మూడో ద్వీపం కూడా రెడీ - చూసొద్దామా ?
మినీ మాల్దీవులు లక్నవరం - మూడో ద్వీపం కూడా రెడీ - చూసొద్దామా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Stock Market News: పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద  
Embed widget