అన్వేషించండి

Meghasandesham Serial Today September 7th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి ఘనస్వాగతం పలికిన అపూర్వ – చంద్రను చూసి ఎమోషన్ అయిన భూమి

Meghasandesham Today Episode: అపూర్వతో చాలెంజ్ చేసి తనకు ఇంట్లోకి ఘనస్వాగతం పలికేలా భూమి చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Meghasandesham Serial Today Episode:  భూమి లోపలికి వెళ్లబోతే నక్షత్ర కర్రతో కొట్టబోతుంది. దీంతో ఆ కర్రను లాక్కుని భూమి విరగ్గొడుతుంది. నువ్వు కొట్టాలంటే కర్రలు కావాలేమో నాకు ఈ చెయ్యి చాలు. అయినా నేను ఇలా గొడవ పడి ఇంట్లోకి రావాలనుకోవడం లేదు. ఎలా రావాలో నాకు తెలుసు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. భూమి. ఇంతలో లోపల నుంచి అపూర్వ రాగానే చూశావా అమ్మా దెబ్బకు ఎలా పారిపోయిందో.. అని చెప్తుంది. అందుకే కదమ్మా ఈ పని నీకు అప్పజెప్పింది అంటుంది అపూర్వ.

       మరోవైపు చెర్రికి తాను, భూమి అడవిలో ఎలా ఇరుక్కుపోయింది చెప్తుంటాడు గగన్‌. తాను పడుకోవడానికి దేవుడి చీరతో ఊయల కట్టిన విషయం వివరిస్తాడు. దీంతో భూమి తెలివి గురించి నాకు తెలసు అంటుండగానే బిందు ఫోన్‌ చేసి భూమి ఇక్కడకు వచ్చి గొడవ చేసిందని చెప్తుంది. దీంతో చెర్రి వెంటనే పరుగెత్తుకువెళ్తాడు. మరోవైపు రిటర్న్‌ వెళ్తున్న భూమి ఇంత దూరం వచ్చింది తిరిగి వెళ్లడానికి  కాదు అనుకుని అపూర్వకు ఫోన్‌ చేస్తుంది.

అపూర్వ: హలో నా కూతురు దెబ్బకు వెళ్లిపోయావు కదా మళ్లీ ఎందుకు ఫోన్‌ చేశావు.

భూమి: వెళ్లిపోతే ఏం బాగుంటుంది. నేను రావాలి అనుకున్నాను. నీ ఇంట్లో అడుగు పెట్టాలనే నిర్ణయించుకునే వచ్చాను. అది జరక్కుండా ఎలా వెళ్లిపోతాను అపూర్వగారు.

అపూర్వ: ఎక్కడికే వచ్చేది. ఈ సారి వచ్చావంటే నా కూతురు కాదే నేనే స్వయంగా వచ్చి నీ కాళ్లు చేతులు విరగొడతాను.

భూమి: ఎవరు ఎవరివి విరగొడ్డతారో చూద్దాం కానీ అయినా నేను గొడవలు పడి ఇంట్లోకి రావాలనుకోవడం లేదు. నువ్వు నీ కూతురు నక్షత్ర దగ్గర ఉండి ఇంట్లోకి ఆహ్వానించి తీసుకెళ్లాలి.

అపూర్వ: ఏంటి మేము నిన్ను ఇంట్లోకి పిలవడమా? అది ఈ జన్మలో జరగదు.

భూమి: నువ్వు చేసే పాపాలకు మళ్లీ జన్మ ఉన్నా.. నువ్వు మనిషిగా అయితే పుట్టవు కదా? అయినా వచ్చే జన్మ దాకా ఎందుకు ఈరోజే.. ఇప్పుడే నీయంతట నువ్వు నీ కూతురు నక్షత్ర దగ్గరుండి లోపలికి ఆహ్వానించి తీసుకువెళ్తారు.

 అని భూమి ఫోన్‌ కట్‌ చేస్తుంది. దీంతో అపూర్వ ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. తర్వాత భూమి, శరత్‌చంద్రకు ఫోన్‌ చేసి తనను ఎవరో కిడ్నాప్‌ చేశారని అదంతా కలిసి చెబుదామని మీ ఇంటి దగ్గరకు వచ్చానని కానీ ఇంట్లోకి రానిస్తారో లేదోనని భయంగా ఉందని చెప్పడంతో చంద్ర.. అపూర్వను పంపిస్తాను లోపలికి రామ్మా అంటాడు. దీంతో సరే అంటుంది భూమి. వెంటనే చంద్ర, అపూర్వను పిలిచి భూమిని పద్దతిగా మన ఇంట్లోకి తీసుకురమ్మని చెప్తాడు. సరేనని అపూర్వ, నక్షత్ర గేటు దగ్గరకు వస్తారు. అక్కడే భూమి ఎదురుచూస్తుంటుంది. ఇద్దరూ పలకకుండా అలాగే ఉండిపోతారు. దీంతో భూమి వెళ్లిపోతుంటే..

అపూర్వ: ఏయ్‌ అలా వెళ్లిపోతావేంటి?

భూమి: మీరు వచ్చిన పని చేయడం లేదు కదా?

అపూర్వ: ఏం చేయాలి?

భూమి: అంకుల్‌ ఏం చెప్పి పంపించారు.

అపూర్వ: నిన్ను తీసుకురమ్మన్నారు.

భూమి: మరి మీరు నన్ను పిలవడం లేదుగా.. మర్యాదగా పిలిస్తే వస్తాను..

అపూర్వ: లోపలికి రా..  పిలిచాగా రావేంటి..?

భూమి: మరి మీ అమ్మాయి పిలవదా?

 అనగానే నక్షత్ర ఏదోలా పిలవగానే పనిమనిషిని పిలిచనట్లు పిలిస్తే రానని అంటుంది. దీంతో నక్షత్ర రిక్వెస్టుగా పిలుస్తుంది. ఇలా పిలవాలి అంటూ నక్షత్ర లోపలికి వెళ్తుంది. తర్వాత గుమ్మం దగ్గరే ఆగిపోయి కాళ్లకు పసుపు రాసి బొట్టు పెట్టి పిలిస్తే లోపలికి వస్తానని భూమి చెప్పడంతో సరేనని కోపంగా పసుపు తీసుకొచ్చి భూమి పాదాలకు రాసి, బొట్టు పెట్టగానే ఇంట్లోకి అడుగుపెడుతుంది భూమి. ఎదురుగా ఉన్న తన తల్లి ఫోటో శోభ ఫోటో చూసి ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో శరత్‌చంద్ర రావడంతో ఏడుస్తూ నాన్న అనబోయి ఆగిపోయి అంకుల్‌ అంటూ వెళ్లి హగ్‌ చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు పెరిగిన ఆశ్రమానికి తీసుకెళ్లిన అమర్ – ఆశ్రమం చూడగానే ఎమోషన్

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Godavari Serial Today August 14th: 'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 14th: నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget