అన్వేషించండి

Brahmamudi Serial Today November 1st:  ‘బ్రహ్మముడి’ సీరియల్:     సామంత్‌ కు షాక్‌ – అనామిక అట్టర్‌ ప్లాప్‌ – సీఈవోగా కావ్య సక్సెస్‌

Brahmamudi Today Episode:   అరవింద్ వచ్చి వేలంపాటలో వచ్చిన లాభంలో 15 కోట్లు కావ్య ఇవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode:   సామంత్‌ కంగారుగా వచ్చి వేలంపాట ఇంకా మొదలవ్వలేదుగా అని అడుగుతాడు. మొదలవ్వకపోవడం ఏంటి వేలంపాట కూడా అయిపోయింది. మనమే వేలంపాటలో గెలిచాం అంటుంది అనామిక.

అనామిక: అరవింద్‌ కంపెనీని 40 కోట్లకు మనమే సొంతం చేసుకున్నాం.

సామంత్‌: అనామిక ముంచేశావు. నన్ను నిలువునా ముంచేశావు.

అనామిక: ఏమంటున్నావు సామంత్‌ నువ్వు..

సామంత్‌: నీకేమన్నా పిచ్చా.. దివాలా తీసిన కంపెనీని ఐదారు కోట్లకు కొనడమే ఎక్కువ. పైగా ఆ కంపెనీ పేరు మీద బ్యాంకులో పది కోట్ల అప్పు ఉంది తెలుసా..? ముప్ఫై అయిదు కోట్లు లాస్‌ మనకు మొత్తం మునిగిపోయాం.

కావ్య: సామంత్‌ ఎంత లాస్‌ అయ్యుంటుంది. 35 కోట్లే కదా..? దటీజ్‌ కావ్య.. సామంత్‌ ఇదే అనామిక తెలివి.

కనకం: ఇప్పుడే అర్థం అయింది. మనం కొనడానికి రాలేదా? అమ్మడానికి వచ్చామా..?

అరవింద్‌: థాంక్యూ మేడం.. మీ వల్ల నాకు అప్పులు అన్ని పోను 30 కోట్ల లాభం. మన మాట ప్రకారం మీకు 15 కోట్లు ఇదిగో మేడం చెక్‌.

కావ్య: ఎవరి వేలితో ఎవరి కన్ను పొడుస్తావు అనామిక. నన్ను మోసం చేసి నీ కంపనీకి అవార్డు వచ్చేలా చేసుకున్నావు. ఇప్పుడు నా కంపెనీకి 15 లాభం వచ్చేలా చేసుకున్నాను.

కనకం: ఇందాక రుద్రాణి ఏదో వాగింది. ఇప్పుడెందుకు గమ్ము రాసినట్టు నోరు మూతపడింది.

అని కనకం వెటకారంగా మాట్లాడుతుంటే అనామిక, సామంత్‌, రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతారు. రాజ్‌ వచ్చి మళ్లీ మోసం చేసి గెలిచావా..? నీకు మీ అమ్మకు మోసం చేయడమే వచ్చు కదా? అంటాడు. దీంతో ఇదంతా మీరు నేర్పిన విద్యే అంటూ రాజ్‌ ఇంతకముందు చెప్పిన మాటలు గుర్తు చేస్తుంది. దీంతో రాజ్‌ కామ్‌ గా వెళ్లిపోతాడు. తర్వాత ఇందిరాదేవి.. కావ్యకు ఫోన్‌ చేసి అపర్ణ, సుభాష్‌ ల మధ్య దూరం పెరిగిపోతుందని చెప్తుంది. మీరేం కంగారుపడకండి బామ్మ అని ఓదారుస్తుంది కావ్య. అపర్ణ దగ్గరకు కావ్య వెళ్తుంది.

అపర్ణ: నిన్ను చూస్తుంటే ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది కావ్య. తాతయ్యకు ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తారు.

కావ్య: కానీ మీ వల్ల ఇంట్లో వాళ్లు చాలా బాధపడుతున్నారు అత్తయ్య. మీరు మామయ్యగారిని పట్టించుకోకపోవడం

అపర్ణ: కొన్ని తప్పుల్ని సరిద్దిలేము.. శిక్ష అనుభవించాల్సిందే

కావ్య: మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. జీవితంలో ప్రతి మనిషికి రెండో అవకాశం ఇవ్వాలి. ఒక్కసారి ఆయన్ని క్షమించి చూడండి.

అపర్ణ: నన్ను క్షమించమని అడుగుతున్నావు. నా కొడుకును నువ్వు క్షమించగలవా..?

కావ్య: అత్తయ్యా ఆయన్ని నేను ఎప్పుడో క్షమించేశాను. మీరు ఆఫీసుకు రమ్మని అడిగినప్పుడే నేను ఆయన్ని క్షమించాను. ఆయన లోపం మూర్ఖత్వం. ఆయనలో ఉన్న ప్రేమను బయటకు తీసుకురావడానికి ఆయనతో కలిసి ప్రయాణించడానికే ఆఫీసుకు వెళ్తున్నాను. మరి మీరెందుకు మామయ్యను క్షమించలేరు. మీ అబ్బాయిలో మార్పు రావాలని మీరు ఇంత ప్రవర్తిస్తున్నారు. మీరు మారి భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో మీరు చూపిస్తేనే కదా ఆయనలో కూడా మార్పు వచ్చేది. మీరే ఆలోచించుకోండి.

  అని కావ్య చెప్పగానే.. అపర్ణ ఆలోచనలో పడిపోతుంది. తర్వాత ఇంటికి వచ్చిన అపర్ణ హాల్లో దగ్గుతూ కూర్చున్న సుభాష్‌ దగ్గరకు వచ్చి చూస్తూ.. కావ్య మాటలు గుర్తు చేసుకుని.. ప్రేమగా సుభాష్‌కు సూప్‌ తాగమని ఇస్తుంది. దీంతో రుద్రాణి ఇది కలా నిజమా..? అని నన్నోసారి గిల్లు అని స్వప్నను అడుగుతుంది. స్వప్న గిల్లగానే గట్టిగా అరుస్తుంది రుద్రాణి.

ప్రకాష్‌: కళ్లల్లో నిప్పులు పోసుకున్నావా? రుద్రాణి. భగ్గున్న మండుతున్నాయా..?

స్వప్న: కరెక్టుగా చెప్పారు అంకుల్‌. కళ్లు పీకి ప్రిజ్‌ లో పెట్టమంటావా అత్తయ్యా..

అపర్ణ: టాబ్లెట్స్‌ తెచ్చానండి ముందు సూప్‌ తాగండి.

సుభాష్‌: అపర్ణ నువ్వు నాతో మాట్లాడుతున్నావా..?

అపర్ణ: ఎంత ఉరకేలిసినా.. నదులన్నీ వెళ్లి సముద్రంలో కలవాల్సిందే… ఎన్ని అపార్థాలు వచ్చి చివరికి భార్యాభర్తలు ఒక్కటే..

ఇందిర: నా మనవరాలు నా కొడలు మనసు మార్చేసింది.

సుభాష్‌: నన్ను క్షమించావా..?

అపర్ణ: అంత పెద్ద మాట ఎందుకులెండి. నా నమ్మకానికి ఎదురుదెబ్బ తగిలే సరికి దూరంగా ఉన్నమాట నిజమే కానీ మీ విషయంలో నేను కటినంగా ఉన్నాను. ఈ రోజు నుంచి మన మధ్య ఎలాంటి సమస్యలు రావులేండి. మిమ్మల్ని బాధపెట్టినందుకు నేనే క్షమాపణ అడగాలి.

సుభాష్‌: వద్దు నేనే నిన్ను క్షమించమని అడగాలి. ఇప్పుడు చెప్తున్నాను ఇక ఏ విషయంలోనూ నిన్ను బాధపెట్టే పని చేయను

   అని సుభాష్‌ చెప్పగానే ఇందిరాదేవి హ్యాపీగా ఫీలవుతూ.. బావ కన్నుల పండుగలా ఉంది అటే ఇదేనేమో.. అనగానే అవును నా గుండెల్లో సగభాగం బరువు దిగిపోయింది. అంటూ రాజ్‌ను చూస్తూ.. ఇంక సగం భారం అలాగే ఉందంటాడు. తర్వాత రుద్రాణి, రాహుల్‌ రూంలో కూర్చుని కావ్యను తిట్టుకుంటూ.. బాధపడుతుంటారు. అప్పుడే అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి అనే సాంగ్‌ ఫోన్‌ లో ఫ్లే చేసుకుంటూ వస్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Embed widget