Brahmamudi Serial Today March 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: పుట్టింటికి వెళ్లిన కావ్య, వాళ్ల బావ – కావ్యతో పాటు వెళ్లిన రాజ్
Brahmamudi Today Episode: కావ్య వాళ్ల బావతో కలసి పుట్టింటికి వెళ్తుంటే రాజ్ కూడా వారితో పాటు వెళ్లడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా కామెడీగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కావ్య తన పుట్టింటికి వెళ్తానని రాజ్‌తో చెప్పడంతో సరే వెళ్లమని నేను ఇక్కడ ఫ్రీగా ఉంటానని చెప్తాడు రాజ్. ఇంతలో తన బావ కూడా వస్తున్నాడని కావ్య చెప్పడంతో రాజ్ ఇరిటేటింగ్‌గా పీలవుతాడు. తనకు ముందే ఎందుకు చెప్పలేదని కావ్యపై కోప్పడతాడు. నేనంటే మీ పర్మిషన్ తీసుకోవాలి. కానీ మా బావ ఎవరి పర్మిషన్ తీసుకోవాలి అంటూ కావ్య ప్రశ్నించడంతో రాజ్ షాక్ అవుతాడు. కావ్య, వాళ్ల బావ ఇద్దరూ రెడీ అవుదామని పైకి వెళ్తారు. ఓరేయ్ బావ తమ్ముడు చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఎలాగైనా నేను కూడా వస్తానురా! అని మనసులో అనుకుంటాడు రాజ్. పైకి వెళ్తున్న కావ్య, వాళ్ల బావకు ఇందిరాదేవి ఎదురుగా వచ్చి విషయం మీటారా? అని అడుగుతుంది. మీటాము కానీ ఆయన ఏం చెప్పి మాతో వస్తారో అర్థం కావడం లేదు అంటుంది కావ్య. మీరైతే రెడీ అవ్వండి నేను వెళ్లి ఏదో ఒకటి చేస్తాను అంటుంది ఇందిరాదేవి. రాజ్ రూంలో ఇరిటేటింగ్ గా ఆలోచిస్తుంటాడు.
రాజ్: ఈ కళావతిని పుట్టింటికి పిలిచి నన్ను మాత్రం ఎందుకు పిలవలేదు. పైగా ఆ బావ గాడ్ని కూడా పిలిచారు.
ఇందిరాదేవి: ఏంటి రాజ్ ఏదో టెన్షన్‌లో ఉన్నట్లున్నావు.
రాజ్: నా టెన్షన్ పక్కన పెట్టు నీకసలు విషయం తెలుసా?
అనగానే ఇందిరాదేవి తెలుసని వాళ్ల ఈడూ జోడూ బాగుందని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అనగానే రాజ్ మరింత ఇరిటేట్ అవుతారు. నాన్నమ్మ మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి? అనగానే మన మేనేజర్ సంతోష్ ఆయన కాబోయే పెళ్లాంతో కలిసి కాశీ వెళ్తే తప్పేంటి అని అంటుంది ఇందిరాదేవి. అది కాదని రాజ్ అసలు విషయం చెప్తాడు. వాళ్లిద్దరే వెళ్తున్నారా? నువ్వు వెళ్లటం లేదా? అనగానే తనను పిలవలేదని బాధగా చెప్తాడు రాజ్. దీంతో కోపంగా ఇందిరాదేవి కనకానికి ఫోన్ చేసి తిడుతుంది. తర్వాత ముగ్గురూ కలిసి కావ్య పుట్టింటికి బయలుదేరుతారు.
కావ్య: బావ ఇలా మనం పక్కపక్కన కూర్చుని కలిసి ప్రయాణం చేసి ఎన్నో ఏళ్లు అయ్యింది కదా?
కావ్య బావ: అవును బుజ్జి చాలా ఏళ్లు అయ్యింది.
కావ్య: బావా అప్పట్లో నీ కారులో వెళ్తున్నప్పుడు మొక్కజోన్న పొత్తులు, చిలగడదుంపలు కొనుక్కుని తింటూ వెళ్లే వాళ్లం కదా
అటూ ఇద్దరూ పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నట్లు నటిస్తుంటే వెనకాల కూర్చున్న రాజ్ ఇరిటేటింగ్‌గా ఫీలవుతాడు. మీ సోది వినలేక చచ్చిపోతున్నాను అంటూ ఇద్దరిని తిడతాడు. మరోవైపు కనకం కావ్య, రాజ్ ల కోసం ఎదురుచూస్తుంది. ఇందిరాదేవి ఫోన్ చేసి ముగ్గురూ బయలుదేరారు అని చెప్తుంది. ఇంతలో కారు వస్తుంది. కనకం, మూర్తి, అప్పు వచ్చి కావ్యను వాళ్ల బావను మాత్రమే పలకరిస్తూ దిష్టి తీయబోతుంటే... కంగారుగా కారు దిగిన రాజ్ ఇరిటేటింగ్ గా తిడుతూ..
రాజ్: ఏం చేస్తున్నారండి మీరు ముగ్గురికి కలిసి చత్వారం వచ్చిందా? కళావతికి ఇతనికి కలిపి హారతి ఎలా ఇస్తారు. ఇదేనా మన సాంప్రదాయం. ఇదేనా మన సనాతన ధర్మం.
మూర్తి: బాబు చిన్నప్పటి నుంచి వాడు మా ఇంట్లో పెరిగాడు. ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చాడని సంతోషంలో హారతి పడుతుంది.
కనకం: అవును బాబు ఇద్దరూ కలిసి వచ్చినా కూడా హారతి అల్లుడుకే ఇచ్చేదాన్ని.
రాజ్: అల్లుడు కాదు మేనల్లుడు అనండి. ఇదిగో ఇతను మేనల్లుడు, నేను ఈ ఇంటి అల్లుడు.
అప్పు: ఇప్పుడు కాదని ఎవరన్నారు బావ. చిన్నప్పటి నుంచి మా అక్కని ఈ బావకే ఇద్దామని మా అమ్మా నాన్న కలలు కన్నారు. కానీ మా స్వప్న అక్క చేసిని నిర్వాకం వల్ల కావ్య అక్క మీతోటి తాళి కట్టించుకోవాల్సి వచ్చింది. మా బావ గుండె పగిలిపోయి ఆ గాయం మానడానికి ఇన్ని రోజలు పట్టింది. ఇప్పుడే కోలుకుని అమెరికా నుంచి వచ్చిండు.
అనగానే నాకు కాలగర్బంలో కలిసిపోయిన మాటలు చెప్పొద్దు అనగానే ఇద్దరికి సపరేట్‌గా హారతి ఇస్తుంది కనకం. తర్వాత అందరూ కలిసి లోపలికి వెళ్లడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: అన్నపూర్ణ-చిన్మయి వివాదంపై మాధవిలత షాకింగ్ కామెంట్స్ - సమాజం అన్నాక అన్నీ ఉంటాయి, కానీ..