అన్వేషించండి

Brahmamudi Serial Today June 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పటాపంచలైన కావ్య శోభనం – అనామిక చెంప పగులగొట్టిన ధాన్యలక్ష్మీ

Brahmamudi Today Episode: హోటల్ లో జరిగిన తతంగానికి మొత్తం కారణం అనామిక అని కళ్యాణ్ సీసీటీవీ ఫుటేజీ చూపించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: ఇంట్లో వాళ్లు అందరూ కలిసి రాజ్‌, కావ్యలను డెకరేట్‌ చేసిన రూంలోకి వెళ్లేలా చేస్తారు. మరోవైపు రుద్రాణి తాను వేసిన బాంబు ఇంకా పేలలేదని ఆలోచిస్తుంది. ఇవాళ ఇంట్లో వాళ్ల ప్రవర్తన తేడాగా ఉందని మాట్లాడుకుంటూ రాజ్‌, కావ్య డెకరేట్‌ చేసిన రూంలోకి వెళ్లి లైట్‌  వేసి చూసి షాక్‌ అవుతారు. అందరూ కలిసి మనల్ని ఇలా ఇరికించారన్నమాట అని ఇద్దరూ అనుకుంటారు.

రాజ్: అబ్బా ఏం నాటకం ఆడుతున్నావే..?

కావ్య: ఏం నటిస్తున్నారండి?

రాజ్‌: నేను నటించడం ఏంటి? నాన్సెన్స్‌.. వాళ్లతో చెప్పి నువ్వే ఈ గది రెడీ చేయించావు.

కావ్య: అవ్వవ్వా ఎంత అబద్దం చెప్పారండి. నేను సిగ్గు విడిచి మాకు శోభనం జరిపించండి అని నేను వాళ్లతో చెప్పనా?

రాజ్‌: మరి నేను చెప్తానా?

కావ్య: ఆ మీరే ఈ గూడు పుఠాణీలో మీకే బాగముంది.

రాజ్‌: ఈ కుంభకోణంలో నీకే బాగముంది.

  అంటూ ఇద్దరూ నువ్వే చేశావని కాదు నువ్వే చేశావని తగువులాడుకుంటారు. ఇంతలో రాజ్‌ ఆత్మ వచ్చి ఎవరు చేస్తే ఏంటి నీ మనసులో మాట ఇవాళ చెప్పాలనుకున్నావు కదా ఇంతకన్నా మంచి చాన్స్‌ రాదని చెప్తుంది. రాజ్‌ రోమాంటిక్‌గా కావ్యకు ప్రపోజ్‌ చేయబోతుండగా కింద కళ్యాణ్‌ గట్టిగా అనామిక అంటూ అరుస్తూ పూల కుండీ పగులగొడతాడు. దీంతో ఏంటా సౌండ్‌ అంటూ రాజ్, కావ్య కిందకు వెళ్తారు.

 

ALSO READ:  ‘కల్కీ 2898 ఏడీ’లో భైరవ ఎంట్రీ సీన్‌కు అంత టైమ్ పడుతుందా? షాకింగ్ విషయం చెప్పిన నాగ్ అశ్విన్

రాజ్‌: ఏంటి కళ్యాణ్‌ ఇదంతా..?

కళ్యాణ్‌: రా నీకోసమే చూస్తున్నాను.

అనామిక: ఏంటి నేనేదో పెద్ద నేరం చేసినట్టు మాట్లాడుతున్నావు. బయపడి పారిపోతాననుకున్నావా?

కళ్యాణ్‌: నువ్వు ఒక ఆడదానివైతే.. నువ్వు ఒక మనిషివి అయితే నీ పెంపకం సరిగ్గా ఉంటే భర్త అంటే గౌరవం ఉండేది. భార్య అంటే ఎలా ఉండేదో తెలిసేది.

అనామిక: ఏంటిప్పుడు ఎంటి నీ పంచాయతి ఇప్పుడు.

అనగానే కళ్యాణ్‌ కోపంగా పేపర్స్‌ అనామిక ముఖంపై వేస్తాడు. ఆ పేపర్స్‌ ఏంటని అందరూ అడగ్గానే డైవర్స్‌ పేపర్స్‌ అని కళ్యాణ్‌ చెప్తాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ధాన్యలక్ష్మీ ఏంటని అడగ్గానే నేను నా భార్య అనే దరిద్రాన్ని వదిలించుకోవడానికి అని కళ్యాణ్‌ చెప్పగానే నన్ను వదిలించుకుని ఆ అప్పును ఏకంగా ఇంటికి తీసుకొచ్చుకోవాలని చూస్తున్నావా? అనగానే కళ్యాణ్‌ కోపంగా అనామికను కొట్టబోయి ఆగి హోటల్‌ లో జరిగిన సంఘటన నువ్వు  కావాలని క్రియేట్‌  చేశావని హోటల్‌ సీసీటీవీ పుటేజీ చూపిస్తాడు కళ్యాణ్‌. అది చూసిన అందరూ షాక్‌ అవుతారు. అయితే ఆ డోర్‌ వేసిన వాడివడో నాకేం తెలుసు అని ప్రశ్నిస్తుంది అనామిక అయితే వాణ్ని కూడా తీసుకొచ్చానని.. ఓరే రాము అని పిలవగానే వాడు వస్తాడు.

ఇందిరాదేవి: ఇతనేగా గడియ పెట్టింది.

కళ్యాణ్‌: అవును నాన్నమ్మ.. రేయ్‌ లోపలికి మేము అడుగుపెట్టగానే బయట గడియ పెట్టమని చెప్పింది ఎవర్రా?

రాము: ఈ మేడం సార్‌ ( అని అనామికను చూపిస్తాడు.)

అనామిక: నాకేం తెలియదు. ఇదంతా ఈ అప్పు కళ్యాణ్‌ కలిసి ఆడుతున్న  నాటకంలా ఉంది. నన్ను అడ్డు తప్పించడానికి ఇదంతా క్రియేట్‌ చేశారు. ఇదంతా అబద్దం.

కళ్యాణ్‌: ఇంకా ఇంకా నా మీద బురద చల్లాలని చూస్తున్నావా? ఓరేయ్‌ నీ ఫోన్‌ ఇవ్వరా

 అంటూ వాడి ఫోన్‌లో వాడి అకౌంట్‌ ఓపెన్‌ చేసి నువ్వు నీ అకౌంట్‌ నుంచి వీడికి ఎందుకు ఇంత డబ్బు పంపించావని ప్రశ్నించడంతో అనామిక షాక్‌ అవుతుంది. ధాన్యలక్ష్మీ కోపంగా ఎందుకు చేశావని అడగ్గానే ఇదంతా నేనే చేశానని.. నాతో కాపురం చేయనని చెప్పి అప్పుతో తిరుగుతావా? అందుకే ఇదంతా చేశాను. నేను చేసింది తప్పా అని ప్రశ్నించడంతో ధాన్యలక్ష్మీ, అనామిక చెంప పగులగొడుతుంది. ఇప్పటివరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించాను అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షరూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షరూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షరూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షరూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
Mowgli 2025 OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మోగ్లీ' - న్యూ ఇయర్ సర్ప్రైజ్... నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మోగ్లీ' - న్యూ ఇయర్ సర్ప్రైజ్... నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
Bajaj Pulsar: భారీ మార్పులతో పల్సర్ 150 భారత్‌లో రీలాంచ్! చేసిన మార్పులేంటో చూడండి!
భారీ మార్పులతో పల్సర్ 150 భారత్‌లో రీలాంచ్! చేసిన మార్పులేంటో చూడండి!
Embed widget