Brahmamudi Serial Today June 11th - ‘బ్రహ్మముడి’ సీరియల్ : నిజం చెప్పిన సుభాష్ - కుప్పకూలిపోయిన అపర్ణ, మాయను చంపేస్తానన్న రుద్రాణి
Brahmamudi Today Episode: సుభాష్ నిజం చెప్పడంతో అపర్ణ కుప్పకూలిపోతుంది. మరోవైపు రుద్రాణి, మాయను చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన ట్విస్టులతో ఇవాళ్టీ బ్రహ్మముడి ఎపిసోడ్ జరిగింది.
Brahmamudi Serial Today Episode: అపర్ణ వచ్చి సుభాష్‌ను తన పక్కన నిలబడమని అడుగుతుంది. దీంతో సుభాష్ తాను రాలేనని చెప్తాడు. ఇంతలో రుద్రాణి వచ్చి నువ్వు వచ్చి వదిన పక్కన నిలబడు అని చెప్తుంది. రాజ్, కావ్య పెళ్లిలో వదిన ఎలాగూ లేదని ఇప్పుడైనా వచ్చి నిలబడు అని చెప్తుంది. దీంతో సుభాష్, రుద్రాణిని తిడతాడు. అపర్ణ, సుభాష్ చేయి పట్టుకుని మండపంలోకి తీసుకెళ్తుంది. మరోవైపు హాస్పిటల్‌లో డాక్టర్ వచ్చి మాయ కోమాలోకి వెళ్లిందని చెప్పగానే కావ్య ఏడుస్తూ వెళ్లిపోతుంది. మరోవైపు ఇందిరాదేవి, సుభాష్, కళ్యాణ్, స్వప్న నలుగురు గార్డెన్‌లో నిలబడి కావ్య కోసం ఎదురుచూస్తుంటారు.
సుభాష్: ముహూర్తం దగ్గర పడుతుంది కావ్య ఇంకా రాలేదు.
కళ్యాణ్: అసలు ఏం చేయాలని వెళ్లిందో అర్థం కావడం లేదు.
స్వప్న: ఏమైనా ఆధారాలు తీసుకురావడానికి వెళ్లిందేమో? ఈలోపే వచ్చేసినా బాగుండు.
ఇందిరాదేవి: భగవంతుడా నీదే భారం కావ్య జీవితం నిలబడాలి. ఈ పెళ్లి ఆగిపోవాలి.
ఇంతలో కావ్య ఏడుస్తూ వస్తుంది. అందరూ ఏమైందని అడగ్గానే కావ్య ఏడుస్తూనే ఉంటుంది. అందరూ లోపలికి వస్తారు. కావ్యను చూసిన రాజ్ ఏమైందని అడుగుతాడు. కావ్య రాజ్‌కు దండం పెడుతుంది. రుద్రాణి, రాహుల్, మాయ హ్యాపీగా ఫీలవుతారు. ముహూర్తం దాటి పోతుంది వెంటనే తాళి కట్టించండి అని రుద్రాణి, పంతులుకు చెప్తుంది. పంతులు రాజ్‌ను తాళి కట్టమని చెప్తాడు. తాళి పట్టుకున్న రాజ్ ఆయోమయంగా చూస్తుండిపోతాడు. అందరూ తాళి కట్టమని చెప్పగానే రాజ్ తాళి కట్టబోతుంటే సుభాష్ గట్టిగా ఆపండి అని అరుస్తాడు. అందరూ షాక్ అవుతారు.
సుభాష్: చాలు రాజ్ ఇంక చాలు తల్లి ప్రాణం కోసం తండ్రి పరువు కోసం ఇప్పటివరకు తల వంచింది చాలు. ఏయ్ లెగవే.. లేయ్..
స్పప్న: ఏయ్ లేగయే..లేవు..
మాయ: ఏం జరుగుతుంది ఇక్కడ
స్వప్న: అన్నీ జరుగుతాయి నీ పెళ్లి తప్పా..
అపర్ణ: ఏంటండి ఇది మీరెందుకు పెళ్లి ఆపుతున్నారు. తాళి కట్టాల్సిన టైంలో మీరెందుకు అడ్డుపడుతున్నారు.
సుభాష్: ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు..
రుద్రాణి: అన్నయ్యా ఏదైనా ఉంటే తాళి కట్టిన తర్వాత మాట్లాడదాం..
సుభాష్: ఏయ్..(గట్టిగా అరుస్తాడు) ఆగు అక్కడే ఆగు వాడు దీని మెడలో తాళి కట్టే ప్రసక్తే లేదు నేను కట్టనివ్వను
అపర్ణ: కావ్యకు అన్యాయం జరుగుతుందన్న బాధలోనే కదా మీరు ఈ పెళ్లి ఆపేది. కావ్యకు ఎలాంటి న్యాయం చేయాల్నో చేద్దామండి.
అనగానే ఈ పెళ్లి జరిగితే నా కొడుకు జీవితం నాశనం అవుతుంది. అంటూ రాజ్ ఏ తప్పూ చేయలేదని నిజం చెప్పబోతుంటే రాజ్, కావ్య అడ్డుపడతారు. అయినా వినకుండా ఆ బిడ్డ రాజ్ బిడ్డ కాదు. ఇది అసలు మాయే కాదు. డబ్బు కోసం నన్ను నాకొడుకును, నా కొడలిని బ్లాక్ మెయిల్ చేసింది అని చెప్తాడు సుభాష్. మరి ఆ బిడ్డ ఎవరని అపర్ణ అడగ్గానే వాడు నా బిడ్డ అని నిజం చెప్తాడు సుభాష్. దీంతో అందరూ షాక్ అవుతారు. జరిగిన విషయాలన్నీ సుభాష్ బాధతో చెప్పడంతో అపర్ణ స్పృహ కోల్పోతుంది. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అపర్ణకు హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేస్తుంటారు. మరోవైపు మాయను ఇంట్లోంచి వెళ్లిపోమ్మని రుద్రాణి చెప్తుంది. దీంతో ఎక్కడికి వెళ్లేది ఈ ఇంటికి నన్ను కిరాయి కోడలుగా తీసుకొచ్చారు. ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా నాకు ముట్టలేదు. నాకిస్తానన్న డబ్బు ఇవ్వండి అని అడుగుతుంది మాయ. తర్వాత ఇస్తానని రుద్రాణి చెప్పడంతో మాయ రుద్రాణిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. దీంతో రుద్రాణి, మాయ గొంతు పట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే నీకు జీవితమే లేకుండా చేస్తాననడంతో మాయ పారిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: కమల్ తప్ప ఇంకొకరు చేయగలరా? ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా 'కల్కి'లో లుక్... ఎంత మంది గుర్తు పట్టారు?