Brahmamudi Serial Today July 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ను ఇంటికి తీసుకెళ్లిన అపర్ణ – షాకైన ఇందిరాదేవి
Brahmamudi serial today episode July 29th: రాజ్, కావ్య ప్లాన్ చేసి అపర్ణ చేత జూనియర్ రాజ్‌ను ఇంటికి తీసుకెళ్లేలా చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ మరింత ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: అపర్ణ తిట్టిందే గుర్తు చేసుకుని రేవతి బాధపడుతుంది. కొడుకు వచ్చి ఆకలి అవుతుంది అమ్మా అని అడిగినా పట్టించుకోదు. దీంతో జగదీష్ దగ్గరకు వచ్చి రేవతిని ఓదారుస్తాడు.
జగదీష్: రేవతి.. బాబుకు ఆకలేస్తుందట ఏదైనా పెట్టు
రేవతి: పది నిమిషాలు ఆగు నాన్న నీకు టిఫిన్ చేస్తాను (రాజ్ ఫోన్ చేస్తాడు.) ఇదేంటండి తమ్ముడు ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తున్నాడేంటి..?
రాజ్: సారీ అక్కా మిమ్మల్ని ఇంటికి పిలిచి అవమానించాను
రేవతి: ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు తమ్ముడు ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరగుతుంది
రాజ్: అందుకే ఒక మంచి ఐడియా వచ్చిందక్కా వెంటనే బస్తీ చివరన ఉన్న శివాలయానికి బాబును తీసుకుని రా అక్క
రేవతి: ఇక నేను రాలేను తమ్ముడు
రాజ్: లేదు అక్కా నువ్వు తప్పకుండా రావాలి..
రేవతి: ఎందుకు తమ్ముడు..
రాజ్: నువ్వు గుడకి రా అక్కా ఇక్కడికి వచ్చావా చెప్తాను
జగదీష్: ఏమైంది రేవతి ఏంటట..?
రేవతి: తమ్ముడు బాబును తీసుకుని వీధి చివర ఉన్న గుడి దగ్గరకు అర్జెంట్ గా రమ్మంటున్నాడు.. ఎందకంటే వచ్చాక చెప్తా అంటున్నాడు
జగదీష్: ఏం పనే ఏంటో అక్కడికి వెళ్తే విషయం ఏంటో నీకు కూడా తెలుస్తుంది కదా వెళ్లు
అంటూ జగదీష్ చెప్పగానే.. సరే అంటూ రేవతి వెళ్తుంది. కట్ చేస్తే.. గుడిలో జూనియర్ ఆడుకుంటూ ఉంటాడు. రేవతి, కావ్య, రాజ్ మాట్లాడుకుంటూ ఉంటారు.
రేవతి: ఏంటి తమ్ముడు నా కొడుకును మా అమ్మతో మీ ఇంటికి పంపిస్తారా..? అది కూడా వాడు నా కొడుకని చెప్పకుండా పంపిస్తారా..?
రాజ్: అవును అక్కా నా ప్లాన్ మొత్తం నీకు అర్థం అయింది
రేవతి: అమ్మో వద్దు తమ్ముడు పొరపాటున అమ్మకు వాడు తన మనవడు అని తెలిసింది అనుకో ఇక అంతే సంగతి.. అసలు మొన్న ఇంటికి వచ్చినందుకు భద్రకాళిలా నా మీద విరుచుకుపడింది. ఇప్పుడు ఈ నాటకం ఆడి నా కొడుకును ఇలా దగ్గర చేస్తున్నాను అని తెలిసింది అనుకో ఇక జీవితాంతం నన్ను శత్రువుగా చూస్తుంది
రాజ్: మా అమ్మకు నిజం ఎలా తెలుస్తుంది అక్కా.. అసలు తెలియదు.. ఎవరు చెప్తారు. ఏం కళావతి గారు మీరు చెప్తారా..?
కావ్య: అయ్యో నేనెందుకు చెప్తానండి వాళ్లను కలపడానికి ఇంత కష్టపడుతున్నాం ఈ నిజం చెప్తానా..?
రేవతి: అయినా ఈ నాటకం ఎందుకు తమ్ముడు.. అమ్మకు ఏదో ఒక రోజు నా మీద ప్రేమ కలిగిన రోజు ఆమె వాడిని దగ్గరకు తీసుకుంటుంది.
రాజ్: ఎప్పుడు కలుగుతుంది అక్కా ఇన్ని రోజులు కలిగిందా..? ఇకపై కలుగుతుంది అన్న నమ్మకం ఉందా..? మనం ఏదో ఒకటి చేస్తేనే రిజల్ట్ వచ్చేది
రేవతి: కానీ ఒకసారి ఆవిడకు చెప్పకుండా నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకున్నాను. ఆ తప్పుకు ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నాను. మళ్లీ ఇంకొక తప్పు చేయడమంటే..?
రాజ్: ఇప్పుడు నువ్వు చేస్తుంది తప్పు కాదక్కా జరిగిన తప్పును సరిదిద్దుకోవడం.. ఒకసారి రాజ్‌ను చూడు వాడికొక పెద్ద ఫ్యామిలీ ఉంది. రాజులా బతికే అవకాశం ఉంది. కానీ ఎవ్వరూ లేనట్టు ఇలా బతకడం నీకు ఇష్టమేనా..?
కావ్య: అవును రేవతి గారు కనీసం వాడి భవిష్యత్తు గురించి ఆలోచించి ఒప్పుకోండి
రేవతి: సరే మీ ఇష్టం.. కానీ ఒక్క విషయం.. రేపు ఎప్పుడైనా అమ్మకు నిజం తెలిసి గొడవ చేస్తే..
రాజ్: దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదని ఈ కథ స్క్రీన్ ప్లే బాధ్యతలు మొత్తం కళావతి గారిదే అని
కావ్య: ఏంటి..?
రాజ్: అబ్బే అదే.. మేమిద్దరం కలిసి చేశామని అమ్మకు చెప్తాను. ఇక మీరు ఈ విషయం గురించి మర్చిపోండి వాడిని వాళ్ల అమ్మమ్మకు ఎలా దగ్గర చేయాలో మేము చూసుకుంటాం
అంటుండగానే అపర్ణ టెంపుల్‌కు వస్తుంది. ఇంతలో రాజ్, కావ్య జూనియర్ రాజ్‌ను పిలిచి నాటకం గురించి చెప్పి అపర్ణ దగ్గరకు పంపిస్తారు. తర్వాత అపర్ణ వాడిని ఇంటికి తీసుకెళ్తుంది. జూనియర్ రాజ్‌ను అపర్ణ ఇంటికి తీసుకురావడం చూసిన ఇందిరాదేవి షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















