Brahmamudi Serial Today July 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అప్పును బయటకు పిలిచిన కళ్యాణ్ – ధాన్యలక్ష్మీపై ఫైర్ అయిన కావ్య
Brahmamudi Today Episode: రుద్రాని చెప్పడంతో ధాన్యలక్మీ, కావ్యను తిడుతుంది. దీంతో ఫస్ట్ టైం కావ్య, ధాన్యలక్మీని గడ్డిపోచలా తీసిపారేసి మాట్లాడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కిచెన్‌లో వంట చేస్తున్న ధాన్యలక్ష్మీ దగ్గరకు రుద్రాణి వెళ్తుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి తెలుసా? నాకు తెలిసిన ఓ ప్రెండు కూతురు ఉంది కళ్యాణ్ గురించి చెప్పాను. వాళ్లు ఓకే అన్నారు. అనగానే అప్పుడే పెళ్లి గురించి మాట్లాడితే కళ్యాణ్ ఏమంటాడో అంటుంది ధాన్యలక్ష్మీ. దీంతో రుద్రాణి మెల్లగా ధాన్యలక్ష్మికి కావ్య తన చెల్లెలును ఈ ఇంటికి కోడలు చేయాలనుకుంటే నువ్వేం చేస్తావు. అంటూ తన మాటలతో రెచ్చగొడుతుంది. కావ్య అనుకుంటే ఏదైనా చేస్తుందని భయపెడుతుంది. ఒకవేళ అప్పు ఈ ఇంటికి కోడలు అయితే అప్పు నీకు మొగుడవుతుంది. కావ్య నీకు అత్త అవుతుంది. అంటూ చెప్పి వెళ్లిపోతుంది రుద్రాణి. మరోవైపు కనకం వాళ్లు ఇంట్లో హ్యాపీగా ఉంటారు.
కనకం: ఏ దేవుడు నా మొర విన్నాడో కానీ నిజంగా ఎంత మంచి సంబంధం అండి.
స్వప్న: కానీ నాకెందుకో బాధగా ఉంది అమ్మా.. చిన్నప్పటి నుంచి అన్ని నాకే కావాలని గొడవ చేసి నేను బాగానే బతికాను. కావ్య అంటే కష్టం చేసి ఇంటిని ఆదుకుంది. ఇప్పుడు దాని కాపురం కూడా కుదుటపడింది. కానీ అప్పు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడింది. ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేదు. వాళ్లు పెద్దగా డబ్బున్న వాళ్లు కాదు. రేపు దానికి ఏదైనా అవసరం వస్తే ఎవరిస్తారు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బతుకు అది రేపు అనుభవిస్తుంది.
కనకం: నాకు ఇప్పుడు ఆ భ్రమలేవి లేవు అమ్మా.. ఎప్పుడో తుడిచిపెట్టుకు పోయాయి. డబ్బుంటేనే గొప్పగా బతకొచ్చని నిన్ను ఆ రాహుల్ కు ఇచ్చి చేశాను. నువ్వేం సంతోషంగా ఉన్నావో చెప్పు. ఇన్నాళ్లు కావ్య మాత్రం ఏం సంతోషంగా ఉంది.
కావ్య: ఏదైనా సమస్య వస్తే చూసుకోవడానికి మనం ఉన్నాం కద అక్క
మూర్తి: కానీ పెళ్లికి ఎక్కువ టైం లేదు కదమ్మా ఆ విషయంలోనే కాస్త కంగారుగా ఉండేది నాకు .
కావ్య: ఎందుకు నాన్నా కంగారు. ఒకప్పుడు అంటే మాకు ఏం తెలియదు అందుకే భారం అంతా మీరు అమ్మా తీసుకున్నారు. ఇప్పుడు మీకు ఇద్దరు కూతుర్లు అండగా ఉన్నారు. మేము దగ్గరుండి పెళ్లికి ఎలాంటి లోటు లేకుండా చూస్తాము.
అని చెప్పగానే మూర్తి హ్యాపీగా ఫీలవుతాడు. ఇంతలో అప్పు లేచి వెళ్లిపోతుంది. కావ్య, స్వప్న బయటకు వచ్చి ఎందుకు అలా ఉన్నావని అడుగుతారు. ఏం లేదని అమ్మా నాన్న సంతోసంగా ఉన్నారు కదా అంటుంది. స్వప్న ఇప్పటి నుంచైనా సిగ్గుపడటం నేర్చుకో అని చెప్తుంది. తర్వాత కళ్యాణ్, అప్పుకు ఫోన్ చేసి ఒక్కసారి కలిసి మాట్లాడాలి అని చెప్తాడు. అప్పు సరే అంటుంది. మరోవైపు ధాన్యలక్ష్మీ ఇంట్లో వాళ్లందర్ని పిలుస్తుంది. కళ్యాణ్‌కు మంచి సంబంధం వచ్చిందని కళ్యాణ్‌కు మళ్లీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. అనగానే ప్రకాష్ కోప్పడతాడు. రుద్రాణి మంచి నిర్ణయమే కదా అంటుంది.
ప్రకాష్: నువ్వేంటి మధ్యలో దూరుతున్నావు. నీకు ఈ సలహా ఇచ్చింది రుద్రాణే కదా?
ధాన్యలక్ష్మీ: ఏవండి నేనేం తప్పు చేయలేదండి.
ప్రకాష్: నాతో ఉండి కూడా నాకు ఒక్కమాట చెప్పలేదని అడుగుతున్నాను.
అంటూ అందరూ మాట్లాడుకుంటుండగా.. కావ్య, స్వప్న వస్తారు. విషయం తెలుసుకుని కళ్యాణ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలిసి కూడా పెళ్లి చేయాలనుకుంటున్నారా? అని కావ్య అడగ్గానే.. నీ చెల్లి అప్పును ఇచ్చి కళ్యాణ్‌కు పెళ్లి చేయాలని నువ్వు ప్లాన్ చేశావు. అందుకే ఈ పెళ్లి వద్దంటున్నావు అంటూ తిడుతుంది. దీంతో అందరూ ధాన్యలక్ష్మీని తిడతారు. కావ్య కూడా ధాన్యలక్ష్మీని గడ్డిపోచలా తీసిపారేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: 'రాయన్' ఆడియన్స్ రివ్యూ: ప్రీమియర్స్ లేవు, లో బజ్ - కానీ హిట్ రిపోర్ట్స్... ధనుష్, సూర్య నటన హైలైట్?