అన్వేషించండి

Brahmamudi Serial Today July 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: భూత్ బంగ్లా డ్రామా ఆడిన రాజ్ – నిజం తెలిసి షాకైన ఇందిర, అపర్ణ

Brahmamudi Today Episode: బూత్ బంగ్లా డ్రామా రాజే ఆడాడని తెలిసి అపర్ణ, ఇందిరాదేవి షాకవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  రాజ్, కావ్య శోభనం కోసం అంతా రెడీ చేసిన అపర్ణ, ఇందిరాదేవి ఎదురుచూస్తుంటారు. ఇంత టైం అయినా ఇంకా రాలేదేంటని అపర్ణ కంగారుపడుతుంది. వసుసులో ఉన్నవాళ్లు సరాదాగా గడిపి వస్తారులే అని ఇందిరాదేవి చెప్తుంది. తాను ఇన్ని రోజులు కావ్యను అపార్థం చేసుకున్నానని ఇకపై కావ్య సంతోషమే తన సంతోషమని చెప్తుంది. తర్వాత తెల్లవారుతుంది. బూత్‌ బంగ్లాలో కావ్య, రాజ్ ల శోభనం అయిపోయి ఉంటుంది. రాజ్‌ మెల్లగా నిద్ర లేచి కిందకి రాగానే రెస్టారెంట్‌ మేనేజర్‌ వస్తాడు.

మేనేజర్‌: సార్‌ అరైంజ్‌మెంట్స్‌ ఎలా ఉన్నాయి సార్‌.

రాజ్: స్టుపిడ్‌ ఫెల్లో నేనేం చెప్పాను.. నువ్వేం చేశావు.

మేనేజర్‌: మీరు చెప్పిందే చేశాను సార్‌

రాజ్‌: దూరం నుంచి నైట్‌ ఎఫెక్ట్ లో దెయ్యంలా వెళ్లమంటే నా పక్కనుంచే వెళ్తావా?

మేనేజర్‌: సార్‌ మేడం గారు భయపడ్డారు కదా సార్‌.

రాజ్‌: నువ్వు దెయ్యంలా వెళ్లినందుకు భయపడలేదు. నేను అరిచిన అరుపులకు నన్ను చూసి భయపడింది.

 అని చెప్పగానే మేనేజర్‌ సరేలేండి సార్‌ ఎలాగోలా మీ శోభనం అయిపోయిందిగా మరోసారి శోభనం చేసుకోవాలనుకుంటే ఇక్కడికే రండి సార్‌ అంటాడు. దీంతో రాజ్‌ మేనేజర్‌ను తిడతాడు. శోభనం ఒక్కసారే చేసుకుంటారని చెప్తాడు. మేనేజర్‌కు పేమెంట్‌ ఇచ్చి పంపిస్తాడు. వెనక నుంచి అంతా వింటున్న కావ్యను చూసి రాజ్‌ షాక్‌ అవుతాడు.  

కావ్య: అబ్బబ్బా ఏం ప్లాన్‌ చేశారండి మీరు. అంటే ఈ బూత్‌ బంగ్లాకు నన్ను కావాలనే తీసుకొచ్చారన్నమాట.

రాజ్: అలాంటిదేం లేదు కళావతి. ఏదో అలా జరిగిపోయింది.

కావ్య: నాకు అంతా అర్థం అయ్యింది. ఈ బూత్‌ బంగ్లాలో భూతంలా తిరిగింది వాడేనన్న మాట. రాత్రి వర్షం కురిపించిన వరుణ దేవుడు వాడేనన్న మాట. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థం అయ్యింది. మీకు కింద నుంచి పై దాకా ఇగో ఉంటుంది.

రాజ్: అయ్యో నాకు ఏం ఇగో లేదు.

కావ్య: నన్ను ప్రేమతో దగ్గరకు తీసుకోలేక ఇన్ని తింగరి వేషాలు వేస్తారా? పెళ్లి అయిన సంవత్సరం తర్వాత మీరు మీ పెళ్లాంతో కాపురం వెలగబెట్టడానికి మీకు ఇంతకన్నా సుందరమైన, రమణీమైన స్థలమే దొరకలేదా?

  అనగానే రాజ్‌, కావ్యకు సారీ చెప్తాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు.  ఇంటి దగ్గర అపర్ణ, ఇందిరాదేవి రాజ్, కావ్యలు ఇంకా రాలేదని కంగారుగా ఎదురుచూస్తుంటారు. ఇంతలో రాజ్‌, కావ్య వస్తారు. రాత్రంతా ఎక్కడికి వెళ్లారని నిలదీస్తారు. రాజ్‌ కంగారుగా ఏదేదో చెప్తుంటే ఇందిరాదేవి రాజ్‌ను తిడుతుంది. కావ్య నువ్వు నిజం చెప్పు అని అడుగుతుంది. దీంతో కావ్య భూత్‌ బంగ్లాలో రాత్రి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. దీంత అపర్ణ, ఇందిరాదేవి షాక్‌ అవుతారు. తర్వాత ఇందిరాదేవి, కావ్య దగ్గరకు వెళ్లి రాజ్ గురించి చెప్తుంది. వాడికి నీ మీద అమితమైన ప్రేమ ఉంటుందని వాడిని తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్తుంది. దీంతో ఆయన మీద ఆయనకంటే నాకే ఎక్కువ నమ్మకం ఉందని కావ్య చెప్తుంది. అయితే త్వరలోనే నాకు ఒక మనవడినో..మనవరాలినో ఇవ్వండి అంటుంది ఇందిరాదేవి. దీంతో కావ్య సిగ్గుతో బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: దర్శకుడితో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ - జైలుకు వెళ్లిన దర్శన్ కలిపిన జంట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tata Trusts New Chairman: టాటా ట్రస్ట్స్‌ కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటా - ఏకగ్రీవంగా ఎన్నిక
టాటా ట్రస్ట్స్‌ కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటా - ఏకగ్రీవంగా ఎన్నిక
Telangana : ఐజీఎస్టీ స్కామ్‌లో ఈడీ కేసు నమోదు - మాజీ సీఎస్‌ సోమేష్‌కు మరిన్ని చిక్కులు
జీఎస్టీ స్కామ్‌లో ఈడీ కేసు నమోదు - మాజీ సీఎస్‌ సోమేష్‌కు మరిన్ని చిక్కులు
Vaazhai OTT: ఓటీటీలోకి వచ్చేసిన సెల్వరాజ్ తమిళ బ్లాక్ బస్టర్... ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సెల్వరాజ్ తమిళ బ్లాక్ బస్టర్, ఎక్కడ చూడాలంటే?
Vijayawada: విజయవాడలో లోకోపైలట్‌ను హత్య చేసిన నిందితుడి అరెస్టు
విజయవాడలో లోకోపైలట్‌ను హత్య చేసిన నిందితుడి అరెస్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: అంత పెద్ద రతన్ టాటాకు చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్Ratan Tata: రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ గర్ల్‌ ఫ్రెండ్Ratan Tata Last Post: సోషల్ మీడియాలో రతన్ టాటా లాస్ట్ పోస్ట్ ఇదేRatan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tata Trusts New Chairman: టాటా ట్రస్ట్స్‌ కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటా - ఏకగ్రీవంగా ఎన్నిక
టాటా ట్రస్ట్స్‌ కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటా - ఏకగ్రీవంగా ఎన్నిక
Telangana : ఐజీఎస్టీ స్కామ్‌లో ఈడీ కేసు నమోదు - మాజీ సీఎస్‌ సోమేష్‌కు మరిన్ని చిక్కులు
జీఎస్టీ స్కామ్‌లో ఈడీ కేసు నమోదు - మాజీ సీఎస్‌ సోమేష్‌కు మరిన్ని చిక్కులు
Vaazhai OTT: ఓటీటీలోకి వచ్చేసిన సెల్వరాజ్ తమిళ బ్లాక్ బస్టర్... ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సెల్వరాజ్ తమిళ బ్లాక్ బస్టర్, ఎక్కడ చూడాలంటే?
Vijayawada: విజయవాడలో లోకోపైలట్‌ను హత్య చేసిన నిందితుడి అరెస్టు
విజయవాడలో లోకోపైలట్‌ను హత్య చేసిన నిందితుడి అరెస్టు
Young India Integrated Residential Schools: తెలంగాణ వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటులో మరో ముందడుగు- భూమిపూజాలో మంత్రుల కీలక వ్యాఖ్యలు
తెలంగాణ వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటులో మరో ముందడుగు- భూమిపూజాలో మంత్రుల కీలక వ్యాఖ్యలు
Tesla Cyber Cab : రోబో ట్యాక్సీ లను ఆవిష్కరించిన టెస్లా చీఫ్ మస్క్ - పాత తెలుగు సినిమాల్లోని ఫాంటసీ కార్లను దించేస్తున్నారుగా !
రోబో ట్యాక్సీ లను ఆవిష్కరించిన టెస్లా చీఫ్ మస్క్ - పాత తెలుగు సినిమాల్లోని ఫాంటసీ కార్లను దించేస్తున్నారుగా !
EPFO News: ఈపీఎఫ్‌ విత్‌డ్రాలో పెను మార్పులు?, కనీస పెన్షన్ పరిమితి కూడా పెంపు!
ఈపీఎఫ్‌ విత్‌డ్రాలో పెను మార్పులు?, కనీస పెన్షన్ పరిమితి కూడా పెంపు!
Tirumala News: రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు
రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు
Embed widget