Brahmamudi Serial Today May July 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేవతిని ఇంట్లోంచి గెంటేసిన అపర్ణ – జగదీష్‌ను చితకబాదిన సుభాష్
Brahmamudi Today Episode: ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన రేవతిని అపర్ణ ఇంట్లోంచి గెంటి వేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: ఇందిరాదేవి నిజం చెప్పడం లేదని అపర్ణను అడుగుతానని కావ్య బయటకు వెళ్లబోతుంటే ఇందిరాదేవి అపేస్తుంది. ఈ విషయం అపర్ణకు ఇంట్లో ప్రళయం వస్తుంది అంటూ బయపడుతుంది ఇందిరాదేవి.
కావ్య: అయితే ఆ రేవతి గారు ఈ ఇంటి మనిషే అన్నమాట.. ఇక్కడ ఇంత మంచి జీవితాన్ని వదిలేసి అక్కడ బస్తీలో ఉండాల్సిన పరిస్థితి ఆవిడకు ఎందుకు వచ్చింది..? అమ్మమ్మగారు ఒకవేళ ఆవిడ ఏదైనా చేయకూడని తప్పు చేశారా..?
ఇందిరాదేవి: నోర్మూయ్ అది చేసింది తప్పు కాదు.. పొరపాటు తెలిసి తెలియక చేసిన ఆ పొరపాటకు పదిహేనేళ్ల నుంచి బాధపడుతూనే ఉంది. అయినా ఆ దేవుడి మనసు కరగటం లేదు. అపర్ణ మనసు మార్చడం లేదు. ఇందాకటి నుంచి నువ్వు చెప్పు చెప్పు అంటున్నావే అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా..? ఆ సాయం పొందిన ఆ రేవతి ఎవరో నీకు తెలుసా..?
కావ్య: ఎవరు అమ్మమ్మగారు
ఇందిరాదేవి: అపర్ణ కూతురు.. నా మనవడికి అక్క.. నీకు సొంత వదిన.. అకారణంగా అన్యాయం అయిపోయిన నా మనవరాలు. రేవతి అంటే నాకే కాదు ఈ ఇంటిళ్లిపాదికి ఎంతో ఇష్టం. తను మాకో కిరీటం.. దాన్ని నెత్తిన పెట్టుకుని చూసుకునేవాళ్లం అంత ప్రేమ అదంటే మాకు
కావ్య: ఏంటి అమ్మమ్మ గారు మీరు చెప్పేది..? రేవతి గారు.. ఈ ఇంటి ఆడపడుచా..?
ఇందిరాదేవి: అవును ఈ ఇంట్లో అల్లారుముద్దుగా పెరిగిన ఆడపడుచు.
కావ్య: మరి అలాంటప్పుడు తనను ఎందుకు దూరం చేసుకున్నారు అమ్మమ్మగారు.
ఇందిరాదేవి: మేము దూరం చేసుకోవడం కాదు. తనే మా నుంచి దూరంగా వెళ్లిపోయింది
కావ్య: అసలు ఏం జరిగింది అమ్మమ్మ
అంటూ కావ్య అడగ్గానే ఇందిరాదేవి పదిహేనేళ్ల క్రితం జరిగిన విషయం చెప్తుంది. అప్పట్లో రేవతిని ఇంట్లో వాళ్లు ఎలా చూసుకునేది.. చెప్తుంది. అయితే సడెన్‌గా ఒకరోజు రేవతి డ్రైవర్ జగదీష్‌ను పెళ్లి చేసుకుని డైరెక్టుగా ఇంటికి వస్తుంది. అది చూసి ఇంట్లో వాళ్లు అందరూ షాక్ అవుతారు. సుభాష్ కోపంగా జగదీష్‌ను తిడుతాడు.
సుభాష్: మీ అమ్మా నాన్నలకు ఆరోగ్యం బాగాలేకపోతే లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్‌మెంట్ ఇప్పించాను. అడిగినప్పుడల్లా జీతం పెంచాను. అడక్కపోయినా బోనస్ ఇచ్చాను. దానికి నువ్విచ్చే బహుమతి ఇదా..?
రేవతి: నాన్న కొట్టకండి నాన్న
సుభాష్: నోర్మూయ్.. ప్రాణంగా ప్రేమిచాను కదాని ఇలా పరువు తక్కువ పని చేస్తానంటే చూస్తూ ఊరుకోను చంపిపడేస్తా.
రుద్రాణి: అన్నయ్యా ఆగు.. చూశావా రేవతి తనకు నచ్చని పని చేసినా నిన్ను నెత్తిన పెట్టుకుంటున్నాడు మీ నాన్న.. నాకు తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. అలాంటిది వాడితో కలిసి జీవితాంతం ఎలా కాపురం చేయాలనుకున్నావు. ఇప్పడు మీ ఇద్దరికి పుట్టబోయే బిడ్డను వీళ్ల మనవడిగా నెత్తిన పెట్టుకుని ఊరేగాలా..? అంతకంటే అవమానం ఇంకొకటి ఉంటుందా వీళ్లకి.
సుభాష్: అంతవరకు నేను రానిస్తే కదా..? కన్న తండ్రిగా నాకు తెలియకుండా చేసుకున్న ఈ పెళ్లి చెల్లదు. అసలు వీడు కట్టిన తాళి తాళే కాదు. వీడసలు ఇక్కడి నుంచి ఈరోజు ప్రాణాలతో వెళ్లడు
అని సుభాష్… జగదీష్‌ను కొట్టబోతుంటే రేవతి అడ్డకుంటుంది.
రేవతి: ఆగండి నాన్నా నేను ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను.. ప్రేమిస్తే చంపేస్తారా..? ఇప్పటి వరకు మీరు నన్న అర్థం చేసుకుంటారు కదా అని పెళ్లి చేసుకుని వచ్చాను.. కానీ మీరు కూడా అందరి తల్లిదండ్రుల్లాగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు
అపర్ణ: అసలు ఈ ఇంట్లో ఉండే అర్హతే నీకు లేదు. అందరికీ చెప్తున్నాను ఈరోజు నుంచి దీనికి ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఇంట్లో మనుసులు ఎవరైనా దీనితో మాట్లాడాలని ప్రయత్నించినా… కలిశారని తెలిసినా..? వాళ్లు కూడా ఈ ఇంటితో సంబంధం కోల్పోతారు. ఇక నుంచి ఈ ఇంట్లో దీని పేరు కూడా వినబడటానికి వీల్లేదు. నా కూతురు ఈ క్షణమే చచ్చిపోయిందని అనుకుంటాను. ఏంటి అలా చూస్తున్నావు.. నా భర్తకు విలువ ఇవ్వని వాళ్లు.. ఈ ఇంటితో సంబంధం లేనివాళ్లు ఇక్కడ ఉండటానికి వీల్లేదు వెల్లిపోండి..
అంటూ ఇద్దరిని మెడపట్టి ఇంట్లోంచి బయటక గెంటి వేస్తుంది అపర్ణ. నేను బతికి ఉన్నంత వరకు నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదు. ఎవరైనా మీ అమ్మా నాన్న ఎవరని అడిగితే చనిపోయారని చెప్పుకో అంటుంది అపర్ణ. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















