Brahmamudi Serial Today May July 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఉట్టి చేతులతో ఇంటికొచ్చిన రాజ్, కావ్య – ఇంట్లో వాళ్లపై రుద్రాణి ఫైర్
Brahmamudi Today Episode: శ్రీనును పట్టుకోవడానికి బయటకు వెళ్లిన రాజ్, కావ్య తిరిగి ఇంటికి రావడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: ఇందిరాదేవి, రేవతి ఇంట్లోంచి రావడం చూసిన రాజ్ మెల్లగా దగ్గరకు వెళ్లి హలో ఓల్డ్ ఉమెన్ అంటూ పలకరిస్తాడు. రాజ్ కావ్యలను చూసిన ఇందిరాదేవి షాక్ అవుతుంది.
ఇందిరాదేవి: అయ్యో ఎవరి కంట్లో అయితే పడకూడదు అనుకున్నానో వాళ్ల కంట్లోనే పడ్డాను కదా..? ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. ( మనసులో అనుకుంటుంది)
రాజ్: నాన్నమ్మ నువ్వేంటి ఇక్కడా..?
ఇందిరాదేవి: మరి మీరేంటి ఇక్కడా
రాజ్: క్వశ్చన్‌కు క్వశ్చన్ ఆన్సరా
ఇందిరాదేవి: అవును
రాజ్: అయితే మేము పని మీద వచ్చాము
ఇందిరాదేవి: నేను పని మీద వచ్చాను
కావ్య: పని మీద వచ్చారా..? మీకు ఈ బస్తీలో పనేంటి అమ్మమ్మ గారు పైగా మీకు ఇక్కడ తెలిసిన వాళ్లు కూడా ఎవ్వరూ లేరు కదా
ఇందిరాదేవి: అంటే ఏంటి బస్తీలో మనుషులు ఉండరా..? వారితో పని ఉండదా..? నేనే ఏదో గ్రహానికి వచ్చినట్టు రాకూడని ప్లేస్‌కు వచ్చినట్టు అలా ఆరాలు తీస్తారేంటి..?
కావ్య: మా ఉద్దేశం అది కాదు అమ్మమ్మ గారు ఇక్కడ మీకు పనేంటని
ఇందిరాదేవి: ఏదో పని పడి వచ్చాను ఇప్పుడు ఆ పని అయిపోయింది వెళ్లిపోతున్నాను ఇక చాలా..? అవును ఇంతకీ మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు..?
రాజ్: చెప్పాను కదా నాన్నమ్మ పని మీద వచ్చామని
ఇందిరాదేవి: అదేరా ఏం పని మీద వచ్చారు
రాజ్: నువ్వు చెప్పనప్పుడు మేమెందుకు చెప్పాలి
ఇందిరాదేవి: అంటే ఏంట్రా పెద్ద వాళ్లు అడిగినప్పుడు పిల్లలు చెప్పకూడదా…?
రాజ్: పిల్లలు అడిగినప్పుడు పెద్దవాళ్లు చెప్పన్నప్పుడు.. పెద్దవాళ్లు అడిగినప్పుడు పిల్లలు కూడా చెప్పకూడదు
కావ్య: అబ్బా మీరు ఉండండి రామ్‌గారు. అమ్మమ్మ అప్పు కేసు విషయంలో ఇక్కడ సాక్షి ఉన్నాడని వచ్చాము.
ఇందిరాదేవి: అవునా అయితే వెంటనే పట్టుకోండి
అంటూ ఇందిరాదేవి వెళ్లిపోతుంది. రాజ్, కావ్య కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. యామిని ఒక్కతే నవ్వుకుంటుంటే వైదేహి వస్తుంది.
వైదేహి: ఏంటి బేబీ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు పైకి చెబితే మేము నవ్వుకుంటాము కదా
యామిని: పాపం ఆ కావ్య సాక్ష్యం సంపాదించడానికి వెళ్లింది. ఆ సాక్షిని నేను కనిపించకుండా దాచేశాను పాపం కావ్య ఏం చేయలేక ఇంటికి మళ్లిందట అందుకే నవ్వొస్తుంది మామ్.. ఇక ఆ అప్పు లైఫ్ క్లోజ్ మామ్. అది జీవితాంతం కుళ్లి కుళ్లి ఏడవాల్సిందే..?
వైదేహి: లేదు బేబీ ఆ కావ్యను తక్కువ అంచనా వేయకు. ఆ కావ్య పెళ్లి ఆపకుండానే ఈ పెళ్లి ఆగిపోతుందని చెప్పింది. అది చెప్పినట్టే పెళ్లి ఆగిపోయింది. అలా ఏం చేయకుండానే తను అనుకున్నది సాధించిన ఆ కావ్య ఏం చేసైనా సరే అప్పును కాపాడుకోలేదని గ్యారంటీ ఏంటి
యామిని: అది ఏం చేయలేదు మామ్. ఎందుకంటే అప్పును బయటకు తీసుకొచ్చే కీ నా దగ్గర ఉంది. ఆ కీ లేకుండా అది ఏమీ చేయలేదు.. నువ్వేం టెన్షన్ పడకు మామ్ నాకొంచెం బయట పనుంది వెళ్లొస్తాను
అని చెప్పి యామిని వెళ్లిపోతుంది. ఇంటికి వెళ్లిన రాజ్, కావ్యలను సాక్షి దొరికాడా అంటూ అందరూ అడుగుతారు. దొరకలేదని చెప్తారు. ఇప్పుడెలా అంటూ అందరూ బాధగా ఆలోచిస్తుంటారు. రేపటి వరకు టైం ఉంది కదా ఏదైనా జరగొచ్చు అని కావ్య చెప్తుంది. మరోవైపు శ్రీను దగ్గరకు వెళ్లిన యామిని ఈ రెండు రోజులు నువ్వు బయటకు రాకుండా ఉంటే నీకు మరో రెండు లక్షలు ఎక్కువ ఇస్తానని డబ్బు ఆశ చూపిస్తుంది శ్రీను సరే అంటాడు. దేవుడి దగ్గర నిలబడి రేవతి గురించి బాధపడుతున్న ఇందిరాదేవి దగ్గరకు కావ్య వస్తుంది. రేవతి ఇంట్లో నిన్ను చూశానని అసలు రేవతికి ఈ ఇంటికి సంబంధం ఏంటని అడుగుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















