Brahmamudi Serial Today July 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అప్పు, కళ్యాణ్, రాజ్ జైలులో – ఎస్సైకి కావ్య వార్నింగ్
Brahmamudi Today Episode: కానిస్టేబుల్ ని కొట్టి కళ్యాణ్, ఎస్సై ని కొట్టి రాజ్ జైలుకు వెళ్లడంతో కావ్య కంగారుగా స్టేషన్ కు వచ్చి పోలీసులకు వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: బంటి కళ్యాణ్‌కు ఫోన్ చేసి అప్పును అరెస్ట్ చేశారని చెప్పడంతో కళ్యాణ్ స్టేసన్ కు వెళ్లబోతుంటే ధాన్యలక్ష్మీ వచ్చి అపుతుంది. ఆమెకు అబద్దం చెప్పి కళ్యాణ్ స్టేషన్‌కు వెళ్తాడు. మరోవైపు స్టేషన్ లో ఎస్సై అప్పును తిడుతుంటాడు. ఇంతలో కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ పోకిరిగాళ్లను కొడతాడు. పోలీసులు కళ్యాణ్ ను కూడా అరెస్ట్ చేస్తారు. దీంతో అప్పు బాధపడుతుంది. మరోవైపు రాజ్ ఆఫీసుకు వెళ్తుంటే స్టేషన్ నుంచి ఎస్సై ఫోన్ చేస్తాడు.
రాజ్: హలో ఎవరూ
ఎస్సై: రాజు అంటే మీరేనా?
రాజ్: అవును మీరెవరు?
ఎస్సై: నేను జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేషన్ నుంచి ఎస్సైని మాట్లాడుతున్నాను.
రాజ్: పోలీస్ స్టేషన్ నుంచా ఎమైంది?
ఎస్సై: ఏమయ్యా పెద్దమనిషి కొడుకును కనగానే సరిపోదయ్యా ఇలా రౌడీలాగా పెంచుతారా? ఎవరిని లెక్క చేయకుండా తయారుచేస్తారా?
రాజ్: హలో మీరు ఏమంటున్నారో.. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.
ఎస్సై: మీకు అర్థం అయితే మీ కొడుకు ఇలా ఎందుకు తయారవుతాడు. ఒక అబ్బాయి లాంటి పిల్లా, ఇంకొక అబ్బాయిని తల పగులగొడితే అరెస్ట్ చేస్తే.. ఆ పిల్ల కొసం వచ్చిన మీ కొడుకు మా కానిస్టేబుల్‌ను పిక్ ప్యాకెటర్‌ను కొట్టినట్టు కొట్టాడు.
రాజ్: హలో హలో ఒక్కనిమిషం ఒక్కనిమిషం ఆగండి.. మీరు చెప్పిందంతా బాగుంది. నాకు ఒక్కకొడుకు ఉండుంటే ఇంకా బాగుండేది.
ఎస్సై: ఏమయ్యా నువ్వేం తండ్రి వయ్యా కొడుకు అరెస్ట్ అయ్యాడని తెలియగానే అసలు నాకు కొడుకే పుట్టలేదు అంటావా? నీ కొడుకు హీరో అనుకుంటున్నావా? నువ్వు హీరో తండ్రివి అనుకుంటున్నావా?
కావ్య: ఏంటి మీకు కొడుకు ఉన్నాడా? మన కథ మళ్లీ మొదటికి వచ్చిందా?
రాజ్: ఏయ్ నోరు మూయవే..
ఎస్సై: ఏంటి పోలీస్ ను పట్టుకుని నోరు మూయ్ అంటావా? మర్యాదగా స్టేషన్‌కు వచ్చి నీ కొడుకు సంగతి ఏంటో చూడు.
అని ఎస్సై మేము అరెస్ట్ చేసింది కళ్యాణ్ ని అని చెప్పగానే రాజ్ కంగారుగా వెళ్లిపోతుంటే కావ్య కూడా తాను వస్తానంటుంది. వద్దని నువ్వొచ్చి అక్కడ ఏం చేస్తావని చులకనగా మాట్లాడి రాజ్ వెళ్లిపోతాడు. స్టేషన్‌కు వెళ్లిన రాజ్ కోపంగా ఎస్సైని కొట్టడంతో రాజ్‌ను కూడా అరెస్ట్ చేసి సెల్ లో వేస్తాడు ఎస్సై. బంటి బయటకు వచ్చి కావ్యకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. వెంటనే కావ్య స్టేషన్‌కు వస్తుంది.
కావ్య: నమస్తే సార్..
ఎస్సై: నమస్తే అమ్మా కూర్చో అమ్మా ఏ పని మీద వచ్చారు.
కావ్య: పర్వాలేదు సార్ లోపల ఉన్న ఆ ముగ్గురు మా వాళ్లే సార్..
ఎస్సై: ఏంటి వాళ్లు ముగ్గురు మీ వాళ్లా? నువ్వెవరిని కొట్టడానికి వచ్చావమ్మా? ఆ పిల్లేమో ఆ ముగ్గురిని కొట్టింది. ఆ కళ్యాణ్ మా కానిస్టేబుల్‌ను కొట్టాడు. ఈ రాజు వచ్చి నన్ను కొట్టాడు. నువ్వెవరిని కొట్టడానికి వచ్చావు అమ్మా..
కావ్య: మీరు పొరపాటు పడుతున్నారు సార్ నేను ఎవ్వరిని కొట్టడానికి రాలేదు. వాళ్లను విడిపించడానికి వచ్చాను.
ఎస్సై: ఎంటి వాళ్లను విడిపించడానికి వచ్చావా? వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. క్రిమినల్ కేసు బుక్ చేయబోతున్నాను.
కావ్య: చూడండి మాది గొప్ప ఫ్యామిలి. అయినా నేను ఎవరి ఇన్‌ప్లియెన్స్ ఉపయోగించడం లేదు. ఎందుకంటే మీరు తొందరపడి మా చెల్లెలిని అరెస్ట్ చేశారు.
ఎస్సై: ఏది కరెక్టో ఏది కాదో నాకు తెలుసులేమ్మా..
అని ఎస్సై మాట్లాడుతుంటే కావ్య కోపంగా మీరు లక్ష రూపాయలు లంచం తీసుకోవడం తప్పు కాదా? అనగానే ఎస్సై నేను జీవితంలో ఇంత వరకు రూపాయి కూడా లంచం తీసుకోలేదని కోప్పడతాడు. దీంతో కావ్య చూశారా మీరు చేయని తప్పు చేశామని చెప్తే అంత కోపం వచ్చింది. అలాగే ఒక ఆడపిల్లను వాళ్లు ఎంతగా ఇబ్బంది పెట్టి ఉంటారో అర్థం చేసుకోండని లేదంటే ఒక ఆడపిల్లను అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు మీ మీదే తిరిగి మేము కేసు పెడితే మీ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: వెన్నెల్లో చందమామలా తమన్నా - బ్లాక్ అండ్ గోల్డ్ లెహెంగాలో మిల్కీ బ్యూటీ అందాలు చూశారా?