అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

Brahmamudi Serial Today January 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : కావ్యకు సారీ చెప్పిన అనామిక – ఎవ్వరి విషయంలో జోక్యం చేసుకోనన్న కావ్య

Brahmamudi Today Episode: ఇంట్లో పెత్తనం కోసం అనామిక నాటకం మొదలు పెట్టింది. దీంతో కావ్యకు సారీ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తి కరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: ధాన్యలక్ష్మీ కోపంగా కావ్యను, స్వప్నును వాళ్ల ఫ్యామిలీని తిడుతుంది. దొంగచాటుగా పెళ్లి చేసుకుని వచ్చారని అంటుంది. మీలా నా కొడలు రాలేదని.. ప్రేమించినా కూడా పెద్దలను ఒప్పించి సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకుందని అంటుంది. దీంతో రాజ్‌ కోపంగా కళ్యాణ్‌ ను తిడతాడు. సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారని సీరియస్‌ అవుతాడు. అనామికను తీసుకెళ్లి సర్ధి చెప్పుకో.. పెట్టిన పంచాయతీ చాలు వెళ్లు అంటాడు. దీంతో సీరియస్‌గా అపర్ణ రాజ్‌ను తిడుతుంది.

అపర్ణ: రాజ్‌ ముందు నీ భార్యకి నువ్వు బుద్ది చెప్పుకోరా? నీ మరదలు గురించి నీ తమ్ముడు చూసుకుంటాడు. ఈ ఇంట్లో ఎప్పుడూ ఎలాంటి గొడవలు లేవు. స్వప్న వల్ల కొద్ది రోజులు, నీ భార్య వల్ల కొద్ది రోజులు, అప్పు వల్ల ఇంకెన్ని రోజులు. అసలు ఆ కుటుంబం వల్లే మన ఇంట్లో గొడవలు మొదలవుతున్నాయి.

రాజ్‌, కావ్య పైకి వెళ్లిపోతారు. అనామికను తీసుకుని కళ్యాణ్‌ కూడా పైకి వెళ్లిపోతారు. రూంలో కావ్య కూర్చుని బాధపడుతుంది. ఇంతలో రాజ్ వస్తాడు. కావ్య పక్కనే కూర్చుని

రాజ్‌: నాకు నిన్ను బాధపెట్టడమే తెలుసు కానీ ఓదార్చడం తెలియదు. ఇప్పుడు నేను ఎం చేస్తే నీకు ప్రశాంతంగా ఉంటుంది.

కావ్య: భార్య బాధలో ఉంటే భర్త వచ్చి ఏ పద్దతిలో ఓదార్చాలి అని అడగడం ఈ ఇంట్లోనే జరుగుతుందేమో..

రాజ్‌: అది తెలియదని నేను ముందే చెప్పాను. ఒక మనిషి మాట్లాడే ప్రతి మాటలకు ఒక కొలమానం ఉంటుంది.

కావ్య: మీరు మనుషుల్ని ఇంత బాగా చదవగలరని ఇవాళే తెలిసింది. నిజం చెప్పాలంటే నేను కూడా ఇదే ఫిలాసఫీని నమ్ముతాను. అందుకే మా స్వప్న అక్కలాగా అంత తొందర పడి బయటపడను.

అనగానే రాజ్‌, కావ్యను  ఓదారుస్తాడు. మరోవైపు అనామిక బయటకు వెళ్లి వాళ్ల అమ్మానాన్నలకు ఫోన్‌ చేసి మనం అనుకున్నది అనుకున్నట్లుగానే జరిగింది. నా ఫస్ట్‌ నైట్‌ చెడగొట్టుకున్నాను. అది మొత్తం కావ్య వల్లనే అని ఇంట్లో వాళ్లు నమ్మేలా చేశాను. అయితే కొందరు కావ్య మీద జాలి చూపించారు. ఇక చూడండి కావ్యతో ఎలా ఆడుకుంటానో  అని చెప్పి ఫోన్‌ పెట్టేస్తుంది. హాల్లో అందరూ కూర్చుని ఉంటారు. కావ్య కిచెన్‌లోంచి హాల్లోకి వస్తుంటే పైనుంచి కిందకు వచ్చిన అనామిక కావ్య దగ్గరకు వెళ్లి

అనామిక: కావ్య అక్క నువ్వు నన్ను క్షమిస్తే తప్పా కళ్యాణ్‌ నన్ను భార్యగా ఒప్పుకునేటట్టు లేడు. అంటే నా ఉద్దేశ్యం నిన్ను ఇష్టపడే వాళ్లందరికీ నేను చెడ్డదాన్ని అయిపోయాను. నాకు ఇలా జరుగుతుందని తెలియదు. హాల్లోకి వచ్చి పడుకుంటే మా గొడవ అంతటితో ఆగిపోతుందని అనుకున్నాను. కానీ నీకు మాటొస్తుందనుకోలేదు.

అంటూ బాధపడుతున్నట్లు నటిస్తూ కావ్యకు సారీ చెప్తుంది. దీంతో ధాన్యలక్ష్మీ మీరు ఎవరికి సారీ చెప్పినా అర్థం చేసుకునే పెద్ద మనసు ఇక్కడ ఎవరికీ లేదు అంటుంది. నాకవన్నీ తెలియదు. కావ్య అక్కకు సారీ చెప్తే తప్పేం లేదు అందుకే చెప్తున్నాను. జరిగిన దాంట్లో నా తప్పు ఉందని అనుకున్నవాళ్లంతా నన్ను క్షమించండి అంటూ నటిస్తుంది. దీంతో అపర్ణ ఈ దుగ్గిరాల ఇంటికి ఇప్పటికి సరైన కోడలు వచ్చింది. అనగానే

స్వప్న: అంటే ఆమె కన్న ముందు వచ్చిన వాళ్లు కాదని మీరంటున్నారా?

అపర్ణ: అదే అని కదా అర్థం

స్వప్న: అయితే మాకంటే ముందు మీరిద్దరు కోడళ్లుగా అడుగుపెట్టారు. అంటే మీరు అంతేనా?

అనగానే అపర్ణ కోపంగా స్వప్నను తిడుతుంది. ఇంతలో కావ్య, కూడా  అనామికకు సారీ చెప్పి ఇప్పటి నుంచి కళ్యాణ్‌, అనామికల విషయంలో నేను తలదూర్చను అని చెప్పి వెళ్లిపోతుంది. ఒక్క దెబ్బతో ఇంట్లో అందరికి నేను మంచిదాన్ని అయిపోయాను. కావ్య నా కాపురంలో కలగజేసుకోకుండా చేశాను అని మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు అప్పు రూంలోంచి  లేచి బయటకు వస్తుంది. అందరూ షాకింగ్‌గా చూస్తుండిపోతారు. అప్పు నడవలేక కింద పడబోతుంటే.. అందరూ వెళ్లి పట్టుకోబోతుంటే ఎవ్వరూ నన్ను పట్టుకోవద్దని నేను నడవగలనని కోపంగా చెప్తుంది. దీంతో మూర్తి కూడా తన కాళ్ల మీద తను నడుస్తానంటుంది కదా వదిలేయ్‌ అంటూ కనకానికి చెప్తాడు. దీంతో అప్పు చిన్నగా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్ జనవరి 17th: టైలరింగ్ మానేస్తానని మాటిచ్చిన సీత, కోడలికి చుక్కలు చూపిస్తానన్న మహాలక్ష్మి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
Jharkhand Exit Poll 2024: జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగామెగాస్టార్ కోసం..  కలిసిన మమ్ముట్టి-మోహన్ లాల్ టీమ్స్ఏఆర్ రెహమాన్ విడాకులు, 29 ఏళ్ల బంధానికి ముగింపుMarquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
Jharkhand Exit Poll 2024: జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
Pawan Kalyan In Assembly: ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
Game Changer Pre Release Event: కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
Embed widget