Brahmamudi Serial Today January 12Th: ‘బ్రహ్మముడి’ సీరియల్: పూజలోంచి వెళ్లిపోయిన కళ్యాణ్ - కావ్యను అనుమానించిన అపర్ణ
Brahmamudi Today Episode: అప్పుకు బ్లడ్ ఇవ్వడానికి పూజ మధ్యలో కళ్యాణ్ వెళ్లిపోవడంతో ఇవాళ్టి ఏపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగింది.
Brahmamudi Serial Today Episode: ఇంట్లో వ్రతం కన్నా బయట పనులు కావ్యకు అంత ముఖ్యం అయ్యాయా.. అయితే ఇంట్లో వాళ్లకు చెప్పి వెళ్లొచ్చు కదా అంటూ అనామిక కావ్యను తిట్టడంతో.. కట్టుకున్న భర్తకు చెబితే అందరికి చెప్పినట్లే.. రాజ్ నీకు బావ అవుతాడు. నువ్వు ఏమైనా ఉంటే నీ భర్తతో మాట్లాడుకో అంతే కానీ రాజ్ ను తప్పు పట్టే అర్హత నీకు లేదని బామ్మ, అనామికకు వార్నింగ్ ఇస్తుంది.
ధాన్యలక్ష్మీ: మీరిలా అందరి నోళ్లు మూయించబట్టే ఆ కావ్య అలా తయారైంది. కొంచెం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంటే ఇంకా వెనకేసుకొస్తారేంటి అత్తయ్య.
రుద్రాణి: అవునమ్మా ధాన్యలక్ష్మీ, అనామిక అన్నదాంట్లో తప్పేముంది. మనసులో ఎలాంటి చెడు ఉద్దేశ్యం లేకపోతే ఎందుకు వెళ్లిపోతుంది. సరిగ్గా పూజ మొదలయ్యే టైంకే ఎందుకు వెళుతుంది. పూజ ఆగిపోవాలనే కదా? మనసులో అంత కుళ్లు ఉండకూడదు.
అంటూ రుద్రాణి మాట్లాడుతుంటే రాజ్ కోపంగా అప్పుకు యాక్సిడెంట్ అయ్యిందన్న విషయం చెప్పేస్తాడు. అందుకే కావ్య వెళ్లిందని ఈ విషయం తెలుసుకోకుండా అందరూ కావ్యను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ కోపంగా రాజ్ అనడంతో అందరూ షాక్ అవుతారు. కళ్యాణ్ వెంటనే హాస్పిటల్ కు వెళ్దామనడంతో రాజ్ వద్దని వారిస్తాడు. ఏదైనా అవసరం అయితే చూసుకోవడానికి మేమున్నామని.. కావ్య అక్కడే ఉంది అన్ని చూసుకుంటుందని పూజ పూర్తి చేయమని చెప్తాడు. అటు స్వప్న కోపంగా రాహుల్ ను చూస్తూ..
స్వప్న: అప్పు మా చెల్లెలే కదా కనీసం ఆయ్యో అని కూడా అనవేంటి? మీకు మీ అమ్మకు మీరు బాగుంటే చాలా? ఎవరేమైపోతే మీకేంటి?
రాహుల్: మరైతే నువ్వెందుకున్నావిక్కడ? పరుగెత్తుకుంటూ వెళ్లు.
స్వప్న: అవును పరుగెత్తుకుంటూనే వెళ్లాలి. నిన్ను చేసుకున్నాను కదా కనీసం ఆటోకి డబ్బులు ఇవ్వడానికి కూడా నీకు గతి లేదు.
రాహుల్: ఏయ్ ఎక్కువ మాట్లాడకు నీకు డబ్బులే కదా ఇస్తాను వెళ్లు.
స్వప్న: అవసరం లేదు. కావ్య వెళ్లిందని ఇంత పెంట చేశారు. ఇక నేను వెలితే మా ప్యామిలీ మీదే దుమ్మెత్తిపోస్తారు. అలాగని పూజలో కూడా కూర్చోను. నా చెల్లెలుకు సీరియస్‌గా ఉంటే నేను సంతోషంగా ఉండలేను పూజలో కూర్చోలేను అది కూడా నీతో కలిసి..అస్సలు చేయలేను. కళ్యాణ్ నువ్వు అనామిక పూజలో కూర్చోండి. లేదంటే నీ భార్య సూటుకేసు సర్దుకుని పుట్టింటికి వెళ్తుంది. ఆ నిందలు మాకెందుకయ్యా..
అనగానే సుభాష్ అందరిని తిట్టి కళ్యాణ్‌ను పూజలో కూర్చోమని చెప్తాడు. కళ్యాణ్, అనామిక పూజలో కూర్చుని వ్రతం చేస్తుండగానే మరోవైపు కావ్య బ్లడ్ కోసం నానా తిప్పలు పడుతుంది. కనకం వచ్చి ఏమైందని అడుగుతుంది. ఎంత ప్రయత్నించినా బ్లడ్ దొరకడం లేదని ఏడుస్తుంది కావ్య.
కనకం: కావ్య ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అల్లుడు గారు తప్ప ఇంకెవ్వరూ సాయం చేయలేరు వెంటనే ఫోన్ చేయ్ నీకు దండం పెడతాను.
కావ్య: చేస్తానమ్మా.. అంతకన్నా ఆపద్బాందవుడు మనకెవరున్నారు చేస్తాను.
మరోవైపు పూజలో కూర్చున్న కల్యాణ్ డల్‌గా ఉంటాడు. ఇంతలో రాజ్‌కు ఫోన్ వస్తుంది. కళ్యాణ్ ఎవరన్నాయ్య వదినేనా అని అడుగుతాడు. రాజ్ అవునని చెప్పడంతో వెంటనే కళ్యాణ్ లేచి ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేస్తాడు. అయితే ఫోన్ ఎత్తింది కళ్యాణ్ అని తెలియక..
కావ్య: ఏవండి అప్పుకు చాలా సీరియస్ గా ఉందండి. వెంటనే బ్లడ్ ఎక్కించాలంటున్నారు. లేదంటే కోమాలోకి వెళ్లిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. నేను వచ్చినప్పటి నుంచి బ్లడ్ బ్యాంకులకు డోనర్స్‌కు ఫోన్ చేస్తూనే ఉన్నానండి. ఏవండి మీకు దండం పెడతాను ఓ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు ఎవరైనా ఉంటే పంపిస్తారా?
కళ్యాణ్: వదిన అప్పూకు అంత సీరియస్‌గా ఉంటే ఇప్పుడా ఫోన్ చేసేది.
అంటూ కళ్యాణ్ ఫోన్‌లో మాట్లాడగానే కావ్య షాక్ అవుతుంది.
కావ్య: కవిగారు మీరు పూజలో ఉన్నారు. ఇవన్నీ మీకెందుకు కవిగారు. మీ అన్నయ్యకు ఫోన్ ఇవ్వండి.
కళ్యాణ్: అయ్యో వదినా నాది ఓ నెగిటెవ్ బ్లడ్ గ్రూప్. అది చాలా రేర్‌గా దొరుకుతుంది. మీరింత సేపు ట్రై చేసినా దొరకలేదంటే అది మీకు దొరకదు. నేను ఇప్పుడే వస్తున్నాను మీరేం టెన్షన్ పడకండి వదిన
అంటూ ఫోన్ కట్ చేసి అప్పుకు సీరియస్ గా ఉందట నేను వెళ్లి బ్లడ్ ఇస్తాను. అంటూ వెళ్లిపోతుంటే అందరూ వద్దని ఆపేస్తారు. కానీ కళ్యాణ్ వాళ్ల నాన్నా మాత్రం ప్రాణం పోయడానికి వెళ్తున్నావు దేవుడు క్షమిస్తాడులే అని చెప్పి పంపిస్తాడు. కళ్యాణ్ వెళ్లిపోతాడు. అనామిక, ధాన్యలక్ష్మీ బాధపడతారు. కళ్యాణ్ వెళ్లి హాస్పిటల్ లో బ్లడ్ ఇస్తాడు. మరోవైపు ఇంట్లో అందరూ టెన్షన్ పడుతుంటే..
రుద్రాణి: పాపం అనామిక. అనామకురాలు అయిపోయింది. అందరూ కావ్యని బతుకమ్మను నెత్తిన పెట్టుకున్నట్లు పెట్టుకున్నారు. ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించినట్లు భుజాలకెత్తుకుని ఊరేగించారు. ఒక్కమాట బాణంలా కావ్య వైపు ఎక్కుపెట్టేలోపు గబాలున చక్రం అడ్డు వేస్తారు. అత్తాకోడళ్ల మధ్య యుద్దం జరగనివ్వరు, సంధి పొసగనివ్వరు. సరిగ్గా పూజలో కూర్చోగానే అప్పుకు యాక్సిడెంట్ అవ్వడమేంటో? చడీచప్పుడు లేకుండా కావ్య వెళ్లిపోవడం ఎంటో? మీకు అర్థం కావడం లేదా?
అనగానే ధాన్యలక్ష్మీ, అపర్ణ కూడా కావ్యను అనుమానిస్తారు. దీంతో రాజ్, సుభాష్ సీరియస్ అవుతారు. వీళ్ల బుద్ది కుక్క తోక వంకర లాంటిది ఎప్పటికీ మారదు అంటారు. ఒక మనిషిని బతికించడానికి వెళితే మనుషులుగా మనం ఇలాగేనా ప్రవర్తించేది అంటూ బామ్మ కూడా తిడుతుంది. మరోవైపు అప్పూకు బ్లడ్ ఎక్కించిన డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్ అవుటాఫ్ డేంజర్ అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. కనకం, మూర్తి చేతులెత్తి కళ్యాణ్‌కు మొక్కుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: #90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ రివ్యూ : ఈటీవీ విన్‌లో శివాజీ నటించిన వెబ్ సిరీస్