Brahmamudi Serial Today December 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కేరళలో రాజ్, కావ్య – ఆఫీసులో కుట్రలు చేస్తున్న రాహుల్
Brahmamudi serial today episode December 4th: రాజ్, కావ్య వచ్చే వారంలోనే స్వరాజ్ కంపెనీ లేకుండా చేయాలనే ప్లాన్ చేస్తాడు రాహుల్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజ్, కావ్య కేరళ బయలుదేరే ముందు ఇక వారం రోజుల్లో మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయని రాజ్, కావ్యకు చెప్తాడు. మరోవైపు అప్పు కూడా చనిపోయిన పాప కేసును వారం రోజుల్లో పరిష్కరిస్తానని కళ్యాణ్‌కు చెప్తుంది. మరోవైపు రాహుల్ కూడా వారం రోజుల్లో మిమ్మల్ని రోడ్డు మీదకు తీసుకొస్తాను అనుకుంటాడు. తర్వాత అప్పు రేణుకు దగ్గరకు వెళ్తుంది. రేణుక ఒక ప్లేస్ చూపిస్తుంది.
రేణుక: ఇక్కడే నాకు పాప కనిపించింది మేడం.. నేను దగ్గరకు వచ్చి చూసేలోపు కనిపించడం లేదు.
రేణుక భర్త: సంవత్సరం నుంచి తను ఇలాగే చెప్తుంది.. ఆ భ్రమలోంచి బయటకు రమ్మని ఎంత చెప్పినా వినడం లేదు. నా మాట తను నమ్మడం లేదు
రేణుక: లేదండి నాది భ్రమ కాదు ఫ్లీజ్ నన్ను నమ్మండి
రేణుక భర్త: తను పాప గురించి మర్చిపోతుంటే.. మీరొచ్చి మళ్లీ గుర్తు చేస్తున్నారు మేడం.
అప్పు: నిజానిజాలు బయటకు తీయాల్సింది మేము.. మీరు రేణుకను తీసుకుని లోపలికి వెళ్లండి
రేణుకను తీసుకుని అతను వెళ్తాడు. అప్పు చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తుంది. ఎవ్వరిని అడిగినా సంవత్సరం క్రితమే ఆ పాప చనిపోయింది అని చెప్తుంటారు. అప్పు ఆలోచనలో పడిపోతుంది. మరోవైపు రాజ్, కావ్య కేరళలో ఆయుర్వేద హాస్పిటల్ లో జాయిన్ అవుతారు. అప్పుడే రాహుల్ కూడా మేనేజర్ సతీష్ ద్వారా కావ్య వేసిన డిజైన్స్ తెప్పించుకుంటాడు.
రాహుల్: థాంక్యూ సతీష్ నువ్వు డెవలప్ కావాలంటే నీకు ధైర్యం ఉండాలని చెప్పాను.. కావ్య వేసిన డిజైన్స్ తీసుకొచ్చి నీ ధైర్యం నిరూపించుకున్నావు.. గ్రేట్ సతీష్ గ్రేట్..
సతీష్: సార్ స్వరాజ్ కంపెనీలో పని చేస్తున్న నా అసిస్టెంట్‌ను ఒప్పించి చాలా రిస్క్ చేసి కావ్య గారి డిజైన్స్ దొంగిలించాను సార్
రాహుల్: ఎలా అయితేం ఏం సతీష్ మనం అనుకున్నది అయితే జరిగింది కదా..?
సతీష్: అది కాదు సార్ రాజ్ సార్ గురించి మీకు తెలుసు కదా..? ఆయనకు అసలే కోపం ఎక్కువ. ఇప్పుడు వాళ్ల డిజైన్స్ కొట్టేశామని తెలిస్తే నన్ను చంపేస్తారేమో సార్
రాహుల్: రాజ్ నుంచి నిన్ను రక్షించే బాధ్యత నాది.. నేను అనుకున్న ప్లాన్ వర్కవుట్ అయి క్లయింట్స్ అందరూ తిరిగి వచ్చారంటే నువ్వు సెటిల్ అయిపోయినట్టే.. అలాగే మన కంపెనీకి ఒక కొత్త డిజైనర్ కావాలి. వాడు ఈ కావ్య గీసిన డిజైన్స్ మళ్లీ గీసి ఇచ్చేలా చేయ్
సతీష్: సరే సార్ ఇప్పుడే తీసుకొస్తాను
అని చెప్పి వెళ్తాడు. రాజ్, కావ్య కేరళ హాస్పిటల్ చూసి హ్యాపీగా ఫీలవుతారు.
కావ్య: నిజంగా అతను చెప్పినట్టు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది కదండి
రాజ్: ఉరుకుల పరుగుల జీవితంలో బతుకుతున్న వాళ్లం కళావతి ఇలాంటి చోట అలాగే ఉంటుంది.
ఇంతలో ఒక వ్యక్తి వచ్చి రాజ్, కావ్యలను గురువు దగ్గరకు తీసుకెళ్తారు. రాజ్ తన దగ్గర ఉన్న కావ్య రిపోర్ట్ ఆయనకు ఇస్తాడు. రిపోర్ట్ చూస్తాడు గురువు.
గురువు: సమస్య అర్థమైంది
రాజ్: ఈ సమస్యకు పరిష్కారం ఉందా గురువు గారు
గురువు: పరిష్కారం లేని సమస్య లేదు.. నమ్మకాన్ని మించిన వైద్యం లేదు
రాజ్: మేము కలవని డాక్టర్ లేడు.. తిరగని హాస్పిటల్ లేదు.. ఎంత మందిని కలిసినా వాళ్లు చెప్పిన మాట ఒక్కటే బిడ్డను కాపాడతాము.. తల్లిని కాపాడలేము అని చివరి ప్రయత్నంగా మీ దగ్గరకు వచ్చాము
గురువు: చూడండి కొన్ని సార్లు ఆ సైన్స్ కు కూడా అందని పరిష్కారాలు ప్రకృతి మనకు చూపిస్తుంది. ప్రకృతి అంటే అమ్మవారు.. ఆ తల్లిని నమ్మి ప్రకృతిని ఆశ్రయిస్తే చాలు పరిష్కారం చూపిస్తుంది. మనలో ఎలాంటి రుగ్మతలు ఉన్నా వాటి అన్నింటిని దూరం చేస్తుంది
రాజ్: ఆ నమ్మకంతోనే మిమ్మల్ని ఆశ్రయించాము గురువు గారు.. ఎలాగైనా మీరే కాపాడాలి.
గురువు: బాధపడొద్దు అంతా మీకు మంచే జరుగుతుంది
అంటూ రాజ్, కావ్య ఉండటానికి వారం ఉంటే ఎలా ఉండాలి. ఏం చేయాలి. ఏం తినాలి లాంటి విషయాలు చెప్పి పంపిస్తాడు గురువు. అక్కడి నుంచి రాజ్ వాళ్లు ఉండే ప్లేస్‌కు వెళ్తుంటే.. మధ్యలో కొంత మంది రౌడీలు ఒకతన్ని చంపడానికి కత్తులు పట్టుకుని వస్తుంటారు. అతను పరుగెత్తుకుంటూ వెళ్లి రాజ్ కారు ముందు పడిపోతాడు. కారు దిగిన రాజ్, కావ్య ఎవరు మీరు అని అడుగుతుంటే అతను చెప్పలేకపోతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















