Brahmamudi Serial Today December 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్య కాళ్లు మొక్కుతానన్న సీతారామయ్య – రాజ్‌ను తిట్టి వెళ్టగొట్టిన ఇందిరాదేవి
Brahmamudi Today Episode: రాజ్ తరపున నేను క్షమాపణ చెప్తున్నానని సీతారామయ్య కావ్యను ఇంటికి రమ్మని అడగడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: సుభాష్‌కు విడాకుల నోటీసులు పంపిన అపర్ణను తమ ఇంట్లో ఉండొద్దని.. దీనికంతటికి కారణం నేనే అని మీ అబ్బాయి అక్కడ గొడవ చేస్తున్నాడని కావ్య చెప్తుంది. దీంతో అపర్ణ కావ్యను తిడుతూ.. ఏం చేస్తున్నానో నాకు క్లారటీ ఉంది. నువ్వేం బాధపడకు అని చెప్తుంది. దీంతో కావ్య కోపంగా కనకాన్ని తిడుతుంది. విడాకుల కాన్సెప్ట్ అత్తయ్యకు నువ్వే చెప్పావా..? అంటూ ప్రశ్నిస్తుంది. కనకం కాదని చెప్పినా కావ్య నమ్మదు. ఇంట్లో అమ్మా నాన్నల ఫోటో చూస్తూ ఆలోచిస్తున్న రాజ్ నేను బతికి ఉండగా మిమ్మల్ని విడిపోనివ్వను ఈ కుటుంబం ముక్కలు కానివ్వను అని మనసులో అనుకుంటాడు. తర్వాత రోజు కావ్య పూజ చేసి అపర్ణను ఆశీర్వదించమని అడుగుతుంది.
అపర్ణ: ఏంటి కావ్య ఈరోజు స్పెషల్..
కావ్య: ఈరోజు నుంచి కార్తీకమాసం కదా అత్తయ్యా ఉపవాసం చేస్తున్నాను.
అపర్ణ: రాజ్‌కు నీకు దూరం పోయి ఇద్దరూ హ్యాపీగా కలిసి ఉండాలి. గంపెడు పిల్లలను కని పెట్టాలి.
ఇంతలో రాజ్ పేపర్స్ తీసుకుని కనకం ఇంటికి వస్తాడు.
అపర్ణ: చూశావా..? వాళ్ల నాన్నకు నోటీసులు పంపించగానే రాజ్ దిగి వస్తున్నాడు.
కావ్య: ఆయన ముఖం చూస్తుంటే దిగి వచ్చినట్టు లేడు.. కోపంతో వస్తున్నట్టు ఉంది.
అపర్ణ: రాజ్ ఎందుకు వచ్చావు..?
రాజ్: నేను ఎందుకు వచ్చానో నీకు తెలియదా..?
అపర్ణ: ఎందుకో నీకూ తెలియదా..? సంస్కారంతో పాటు చదువు కూడా మర్చిపోయావా..? చదువుకోలేదా..?
రాజ్: చదువుకున్నాను.. ఆ పేపర్స్ లో ఏముందో ఆ పేపర్స్ పంపించడం వెనక అంతరార్థం అంతా అర్థం చేసుకుని వచ్చాను.
అపర్ణ: నువ్వేం అర్థం చేసుకున్నావో నాకు అర్థం కాలేదు.
రాజ్: ఈ పేపర్స్ చూస్తే అందరికీ అర్థం అవుతుంది.
అపర్ణ: ఏంటవి నేను మీ నాన్నకు పంపించిన పేపర్సా..?
రాజ్: కాదు నేను కళావతికి ఇవ్వడానికి తీసుకొచ్చిన పేపర్స్
కావ్య: నాకు ఇవ్వడానికా..? ఏంటా పేపర్స్..
రాజ్: మన విడాకుల పేపర్స్..
అని రాజ్ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అపర్ణ కోపంగా రాజ్‌ను తిడుతుంది. రాజ్ మాత్రం తన విడాకులు చూపించి అపర్ణను బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. నువ్వు ఇప్పుడు నాతో ఇంటికి రాకపోతే శాశ్వతంగా కళావతితో ఉన్న నా బంధాన్ని తెంచుకుంటాను. నువ్వు ఏ కోడలి కోసమైతే ఇంత దూరం వచ్చావో ఆ కోరిక నీ జీవితంలో నెరవేరదు మమ్మీ అంటూ రాజ్ చెప్పగానే అపర్ణ షాకింగ్ గా చూస్తుండిపోతుంది. కావ్య, కనకం, మూర్తి ఏడుస్తుంటారు. ఇంతలో రాజ్ వెళ్లి విడాకుల పేపర్స్ కావ్య చేతిలో పెట్టి వెళ్లిపోతుంటే వెనక నుంచి వచ్చిన సీతారామయ్య కోపంగా రాజ్‌ను కొడతాడు.
సీతారామయ్య: సమయం ఇస్తున్నావా..? ఎవరికి ఇస్తున్నావురా.. దేనికి ఇస్తున్నావురా..? దిగజారిపోయిన నీ వ్యక్తిత్వానికి ఇంకా సమయం ఇస్తున్నావా..? మాయమైపోయిన నైతిక విలువలను వెతుక్కోవడానికా..? నీ కోసం నీ జీవితం కోసం మీ అమ్మ ఇక్కడ అజ్ఞాత వాసం చేస్తుంటే.. నవ్వు ఇంత దిగజారిపోతావా..? నా వంశంలో నీలాంటి ఒక భ్రష్టుడు పుడతాడని అసలు ఊహించలేదు.
ఇందిరాదేవి: అరేయ్ అసలు నువ్వు కావ్యను ఎందుకు వద్దనుకుంటున్నావు. ఒక్క కారణం చెప్పరా.. ఒక్క తప్పు చెప్పరా..? దాని కళ్లలోకి సూటిగా చూసి చెప్పరా… ఏం తప్పు చేసిందిరా అది. ఏం పాపం చేసిందిరా అది. ఏం ద్రోహం చేసిందిరా అది.
సీతారామయ్య: అరేయ్ నట్టింట్లో నిలబడి చెప్తున్నాను. కావ్య నాకు దేవుడిచ్చిన మనవరాలురా.. దుగ్గిరాల ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిన శ్రీమహాలక్ష్మీరా అది. నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా.. దుగ్గిరాల ఇంట్లో కోడలిగా నా వారసురాలిగా ఉంటుంది.
అని సీతారామయ్య కరాకండిగా చెప్పగానే రాజ్ అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోతాడు. మూర్తి, కనకం ఏడుస్తూ సీతారామయ్య, ఇందిరాదేవికి మొక్కుతారు. తర్వాత కావ్యను ఇంటికి రమ్మని ఇందిరాదేవి పిలుస్తుంది. ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే ఆ ఇల్లు ముక్కలైపోతుందని... ఎవరికి వారే చెల్లాచెదురు అవుతారని.. నమ్మకంతో ఇంటికి రమ్మని.. అడుగుతుంది. కావ్య మౌనంగా ఉండిపోతే సీతారామయ్య కూడా కావ్యను రమ్మని.. రాజ్ చేసిన తప్పిదాలకు నేను సారీ చెప్తున్నానని కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను అని చెప్పడంతో కావ్య బాధపడుతూ తాతయ్యా మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దని ఇంటికి వస్తానని ఒప్పుకుంటుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!