Brahmamudi September 14th: కావ్యపై చేయెత్తిన అపర్ణ- తల్లికి ఎదురుతిరిగిన రాజ్, రుద్రాణి పైశాచికానందం
మూడు నెలల్లో మారతానని రాజ్ కావ్యకి మాట ఇవ్వడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Brahmamudi September 14th : రాజ్ కావ్యకి థాంక్స్ చెప్పేసరికి అదిరిపడుతుంది. గోదానం చేసినట్టు థాంక్స్ దానం ఎందుకు చేశారని కావ్య అడుగుతుంది. తాతయ్య దగ్గర నిజం చెప్పనందుకు అంటాడు. అయితే ముందు థాంక్స్ కంటే సోరి చెప్పమంటే చెప్పనని అనేస్తాడు.
కావ్య: మిమ్మల్ని చూస్తుంటే డౌట్ వస్తుంది. మీరు మూడు నెలల్లో మారతారని అనిపించడం లేదు. ఒక్కోసారి అరుస్తారు. ఇంకొకసారి మీకు నచ్చినట్టు ఉంటారు. మీరు జీవిస్తున్నారో, నటిస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు
రాజ్: వామ్మో ఈ కళావతి ఆవులిస్తే ఎండో స్కోప్, అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఈజీగా చేస్తుందే అని మనసులో అనుకుంటాడు
కావ్య: మీరు మారుతున్నారా లేదా అనేది ఇంకోకరిని న్యాయ నిర్ణేతగా పెట్టుకుందాం, తాతయ్య అయితే బాగుంటుందని అనేసరికి రాజ్ వామ్మో వద్దులే మారతానని చెప్తాడు. పొద్దున్నే సీతారామయ్య దగ్గరకి వెళ్ళి కావ్య మాట్లాడుతుంది.
కావ్య: మీ మనవడి మీద అనుమానంగా ఉంది. మూడు నెలల్లో మారతానని మాట ఇచ్చారు. కానీ గంటకి ఒకలా ఉంటున్నారు. మూడు నెలల్లో మారకపోతే నేనేం చేయాలి తాతయ్య
Also Read: తులసిపై ఒంటికాలి మీద లేచిన నందు- సామ్రాట్ కంపెనీ బాధ్యతలు తీసుకోమన్న పెద్దాయన
సీతారామయ్య: మూడు నెలలు గడువు పెట్టాడా అంటే నేను చచ్చాక నిన్ను వదిలేయాలని అనుకుంటున్నాడా?
ఆ మాటకి కావ్య షాక్ అయి ఏమన్నారు అంటాడు
రాజ్: నేను కళావతిని గర్భవతిని చూసుకుంటునంత జాగ్రత్తగా చూసుకుంటున్నానని అంటే కావ్య అబద్ధం అంటుంది. రాజ్ నిజమంటే వినవెంటీ అని నిద్రలో నుంచి అరుస్తూ లేస్తాడు. కాసేపటికి అది కల అని అర్థం అవుతుంది. ఈ కళావతి నిజం చెప్పినా చెప్పేస్తుందని అనుకుంటాడు. అప్పుడే టీవీలో భార్య బూచిలాగా కనిపిస్తుందా? అంటూ భర్తల బాధ గురించి ఒకాయన చెప్పుకొస్తాడు. చేతులు వీపు వెనక్కి పెట్టే ఆసనం చెప్తే రాజ్ అలాగే చేస్తాడు. కానీ రాజ్ చేతులు ఇరుక్కుపోతాయి. కావ్య వచ్చి అయ్యయ్యో ఇదేం ఆసనం అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఇరుక్కుపోయిన ఆసనం విడదీయమని అడుగుతాడు. రాత్రి సోరి అడిగితే చెప్పలేదు కదా సోరి చెప్తే హెల్ప్ చేస్తానని అంటుంది. రాజ్ చేసేది లేక భార్యకి సోరి చెప్తాడు. కావ్య కష్టపడి చేతులు విడదీస్తుంది.
కావ్య కిచెన్ లో నుంచి వెళ్తుంటే రుద్రాణి తనని పిలిచి కాఫీ ఇవ్వమని అమర్యాదగా అడుగుతుంది. పొగరుగా సమాధానం చెప్తావా అంటూ రుద్రాణి తన మీద సీరియస్ అవుతుంది. ఇద్దరి మధ్య కాసేపు వాదన జరుగుతుంది. రాజ్ కి ఏం మందు పెట్టావ్ నీ వెనుక తిప్పించుకుంటున్నావ్ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది.
కావ్య: భర్త మనసు గెలుచుకోవాలంటే మందులు పనికిరావు. ప్రేమగా ఓపికతో ఎదురు చూస్తే చాలు. ఈ విషయం తెలియక మీరు ఒంటరిగా మిగిలిపోయారు. లేదంటే మీ వారు మీతోనే ఉండేవాళ్ళు. అందుకే పచ్చని కాపురం చూస్తే మీ మనసు భగ్గున మండుతుంది అనేసి వెళ్ళిపోతుంది.
పని మనిషి శాంత అపర్ణకి టీ తీసుకుని వస్తుంది. కొంచెం డబ్బు అవసరం ఉందని అడ్వాన్స్ కావాలని అడుగుతుంది. కానీ అపర్ణ మాత్రం ఇచ్చేందుకు అంగీకరించదు. వాళ్ళ మాటలు రుద్రాణి వింటుంది. కావ్యని ఇరికించడానికి మంచి అవకాశం దొరికిందని రుద్రాణి అనుకుని అపర్ణ దగ్గర నుంచి వెళ్తున్న శాంతని పిలుస్తుంది.
రుద్రాణి: నీకు డబ్బు అవసరం ఉంది కదా. నువ్వు డబ్బులు అడగాల్సింది ఇప్పటి కోడలిని. వెళ్ళి కావ్యని అడుగు తప్పకుండా ఇస్తుంది
శాంత: పెద్దమ్మ ఇవ్వనని అన్నారు
రుద్రాణి: నీకు ఇప్పుడు కావ్య ఒక్కటే దిక్కు. నీ ఇష్టం ఏం చేస్తావో మరి అని పుల్ల వేస్తుంది.
Also Read: వాటే సీన్ - మురారీ తన వాడేనని తెగేసి చెప్పిన కృష్ణ, ముకుందకి అదిరే ఝలక్!
కావ్య కళ్యాణ్ దగ్గరకి వెళ్తుంది. అనామిక ప్రేమ ఇంట్లో అందరికీ అర్థం అయ్యింది మీకే అర్థం కాలేదని కావ్య అంటుంది. మనసులో మాట తనకి వెంటనే చెప్పమని ఆలస్యం చేయవద్దని సలహా ఇస్తుంది. కావ్య కిచెన్ లోకి రాగానే శాంత తనని పదిహేను వేలు డబ్బులు కావాలని అడుగుతుంది. వీళ్ళని రుద్రాణి చాటుగా గమనిస్తుంది. రాజ్ ని అడిగి డబ్బులు ఇస్తానని చెప్పి కావ్య వెళ్తుంది. తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు సంతోషంగా రుద్రాణి అపర్ణ దగ్గరకి వెళ్తుంది. కావ్య రాజ్ దగ్గరకి వెళ్ళి డబ్బు అవసరం వచ్చిందని చెప్తుంది. మీ దగ్గర పని చేసే వాళ్ళకి కష్టం వచ్చిందని అంటుంది. శాంతకి ఏదో అవసరం వచ్చిందని చెప్పి డబ్బు కావాలని అడుగుతుంది. సరే తీసుకో అంటాడు.
రుద్రాణి: నీ కోడలు నీ పరువు గంగలో కలుపుతుంది. ఈ ఇంట్లో అందరి ముందు నిన్ను విలన్ చేసి అందరినీ తనవైపుకి తిప్పుకుని తన విలువ చాటుకుంది. ఇప్పుడు కొత్తగా నీ మీద గెలవాలని చూస్తుంది.
అపర్ణ: ఎప్పుడు ఎదుటి వారిలో ఏ తప్పు దొరుకుతుందా అని చూస్తావా నీకేం పని లేదా?
రుద్రాణి: నీకు మంచి చేద్దామని అంటే నువ్వు ఇలా అంటావే. కావ్య నీ మాట కాదని పని మనిషికి డబ్బులు ఇవ్వడానికి రెడీ అయిందని చెప్పడానికి వచ్చాను కానీ నువ్వు వినడం లేదు. నువ్వు ఇందాక శాంతకి డబ్బులు ఇవ్వనని చెప్తే కావ్య మాత్రం ఇస్తుంది.
తరువాయి భాగంలో..
అపర్ణ కావ్యని నిలదీస్తుంది. ఆరోజు నా కొడుకు మంచితనం అలుసుగా తీసుకుని డబ్బులు నీ పుట్టింటికి దోచి పెట్టావ్. ఇప్పుడు పనిమనిషికి దోచి పెడుతున్నవని అరుస్తుంది. ఈ ఇంటి కోడలిగా మీకు ఎంత హక్కు ఉందో మీ కోడలిగా నాకు అంతే హక్కు ఉందని కావ్య చెప్తుంది. ఆ మాటకి అపర్ణ కోపంగా తనని కొట్టబోతుంటే రాజ్ తల్లికి అడ్డుపడతాడు.