Krishna Mukunda Murari September 13th: వాటే సీన్ - మురారీ తన వాడేనని తెగేసి చెప్పిన కృష్ణ, ముకుందకి అదిరే ఝలక్!
మురారీ, తను ప్రేమించుకున్న విషయం ముకుంద ఇన్ డైరెక్ట్ గా కృష్ణకి చెప్పడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Krishna Mukunda Murari September 13th
కల్నల్ తో మాట్లాడి ఎలాగైనా ఆదర్శ్ ని ఇంటికి తీసుకొస్తానని మురారీ భవానీకి మాట ఇస్తాడు. కాసేపటికి కృష్ణని పిలుస్తాడు. రేవతి వచ్చి ఏమైందని అంటుంది. కృష్ణ, ముకుందలు బయటకి వెళ్లారని అలేఖ్య చెప్తుంది. నిజం చెప్పమని రేవతి గట్టిగా నిలదీస్తుంది. వెంటనే మురారీ కంగారుగా కృష్ణకి కాల్ చేస్తాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కృష్ణకి నిజం చెప్పడానికి ముకుందతో కలిసి నువ్వు ప్లాన్ వేస్తున్నావని నాకు తెలుసు.. అందుకే వాళ్ళు బయటకి వెళ్లారని తెలియాలి నీ సంగతి చెప్తానని బెదిరిస్తుంది. ముకుంద కృష్ణకి నిజం చెప్పడానికే తీసుకుని వెళ్ళి ఉంటుందని రేవతి అనేసరికి మురారీ షాక్ అవుతాడు.
ముకుంద: నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మన జీవితాలని మార్చేస్తుంది
కృష్ణ: నాకు అర్థం కాలేదు
ముకుంద: నువ్వు మురారీ ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని అనుకున్నావ్ కదా
కృష్ణ: గీతిక చెప్పిందా? నువ్వు ఏసీపీ సర్ ఫ్రెండ్స్ కదా మరి ఆయన ప్రేమించిన అమ్మాయి ఎవరో నీకు తెలియదా
ముకుంద: తెలుసు అది చెప్పడానికే నిన్ను పిలిచింది
Also Read: కళావతిని ఇంప్రెస్ చేసేందుకు రాజ్ తిక్కపనులు- బుద్ధిచూపించిన రుద్రాణి!
కృష్ణ: ఏసీపీ సర్ ప్రేమించిన అమ్మాయి ఎవరు వాళ్ళు ఎలా విడిపోయారు. ఎందుకు విడిపోయారు. నా వల్లే తన ప్రియురాలికి దూరమయ్యారా? లేదంటే తను దూరమయ్యాకే నన్ను పెళ్లి చేసుకున్నారా అనేది నాకు తెలియాలి
ముకుంద: వాళ్ళు విడిపోవడానికి కారణం ఏదైనా ఇప్పుడు వాళ్ళ మధ్య అడ్డుగోడలాగా ఉంది నువ్వే
కృష్ణ: ఆ అమ్మాయి నీకు బాగా క్లోజా. తనకి పెళ్లి అయ్యిందా? ఎక్కడ ఉంది
ముకుంద: తను నా బ్రెస్ట్ ఫ్రెండ్. తనకి పెళ్లి అయ్యింది కానీ ఇంకా మురారీని ప్రేమిస్తుంది
కృష్ణ: తన ఫోటో నీ దగ్గర ఉందా? ఎలా ఉంటుంది
ముకుంద: తను ఎవరో కూడా చూపిస్తాను. తను రాధ, నేను ముకుంద. పేర్లే రెండు మా మనసు ఒక్కటే.
కృష్ణ: తను ఇప్పటికీ నా ఏసీపీ సర్ ని ప్రేమిస్తుందా
ముకుంద: నిజం చెప్పాలంటే నీ కంటే తనే ఎక్కువ మురారీని ప్రేమిస్తుంది
కృష్ణ: అది నువ్వు ఎలా చెప్తావ్. ప్రేమలో ఎక్కువ తక్కువలు ఉండవు ప్రేమ మాత్రమే ఉంటుంది
ముకుంద: రాధ మురారీ కోసం ఏమైనా చేస్తుంది. చివరికి ప్రాణ త్యాగం కూడ చేయగలదు. నువ్వు మురారీ కోసం ప్రాణ త్యాగం చేయగలవా?
కృష్ణ: నవ్వుతుంది. నేను ప్రేమ కోసం ఏమైనా త్యాగం చేస్తాను. కానీ ప్రేమ కోసం ప్రేమించిన వాడిని త్యాగం చేసిన పిచ్చిదాని ప్రేమ నా ప్రేమ కన్నా గొప్పది అంటే నవ్వు రాక ఏం వస్తుంది
ముకుంద: పరిస్థితుల ప్రభావం కొన్ని సార్లు ఎంతటి వారినైనా దిగజారుస్తాయి. అంత మాత్రాన వాళ్ళని తక్కువ చేయలేం. మురారీ కోసం రాధ ప్రాణ త్యాగం చేస్తుంది. నువ్వు చేయగలవా
కృష్ణ: చేయలేను
ముకుంద: అంటే నీ ప్రేమ కంటే తన ప్రేమ గొప్పదనే కదా. ప్రాణ త్యాగం చేసే ప్రేమ కంటే నీది గొప్పదా. అలా ఎలా గొప్పది.
కృష్ణ: అవును గొప్పది. నువ్వు నీ ఫ్రెండ్ మ్యాటర్ ని ఇంత పర్సనల్ గా తీసుకుంటున్నావ్
ముకుంద: నాకు రాధ ప్రేమ తెలుసు. తను మురారీ కోసం ఎన్ని త్యాగాలు చేసిందో, ఎన్ని నిందలు మోసిందో నాకు మాత్రమే తెలుసు. అందుకే అడుగుతున్నా రాధ ప్రేమ కన్నా నీ ప్రేమ ఎలా గొప్పది
ALso Read: ముకుంద, మురారీలని చూసి ముక్కలైన కృష్ణ మనసు- ఆదర్శ్ తిరిగి వస్తాడా!
కృష్ణ: ఏసీపీ సర్ నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా జీవితాంతం ప్రేమిస్తాను. ఆయన కోసం నేనేమైనా చేస్తాను ఎవరినైనా ఎదిరిస్తాను. ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఆయన్ని అంతగా ప్రేమించి నేనే చచ్చిపోతే ఆయన ఏమైపోతారు. ఆయన్ని నాలాగా ఎవరు చూసుకుంటారు. నాలా ఎవరు ప్రేమిస్తారు. అసలే ఏబీసీడీల అబ్బాయి. ఆయనకి ఎప్పుడు ఏం కావాలో నాకు తెలుసు. ఆయన గురించి నాకు తెలిసినంతగా ఏసీపీ సర్ కి తెలియదు
ముకుంద: అసలు నీది ప్రేమ అని ఎలా నమ్మమంటావ్. నిన్ను డాక్టర్ ని చేశాడని మురారీపై కలిగిన అభిమానాన్ని నువ్వు ప్రేమ అనుకోవచ్చు. ఇందులో నీ ప్రేమ కంటే స్వార్థమే ఎక్కువ కనిపిస్తుంది కదా. కానీ రాధ అలా కాదు నిస్వార్థంగా ప్రేమించింది. మురారీని గుడ్డిగా నమ్మింది. తను ఏం చెప్తే రాధకి అదే శిలాశాసనం. మురారీ కోసం ఏడుస్తుంది. అసలు తను బతికేది మురారీ కోసమే. నీకంటూ ఒక జీవితాశయం ఉంది. కానీ రాధకి అలా కాదు మురారీనే లోకం తనే సర్వస్వం
కృష్ణ: నీ రాధ కోసం ఏసీపీ సర్ ని వదులుకోవాలా?
ముకుంద: నీ వల్ల రెండు జీవితాలు నిలబడతాయంటే నీ ప్రేమని త్యాగం చేయలేవా? నువ్వు డాక్టర్ వి అందంగా ఉంటావ్ మంచి మనసు ఉంటుంది. నా రాధ కోసం మురారీ మీద ప్రేమని త్యాగం చేయలేవా?
కృష్ణ: నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? మురారీని వదిలేయడం అంటే నా ప్రాణాలు వదిలేయడమే. తాళి విలువ తెలుసా? నువ్వు కూడా పెళ్ళైన దానివే కదా ఆ మాత్రం తెలియదా? నువ్వు ఫ్రెండ్ వి కాబట్టి ఏం అనడం లేదు. అదే వేరొకరు అయితే చెంప చెల్లుమనిపించేదాన్ని. వెళ్ళి నీ రాధకి చెప్పు ఏసీపీ సర్ నావాడు. తను ఒకప్పుడు ప్రియురాలు అయితే నేను తాళి కట్టించుకున్న భార్యని. ప్రియురాలు ప్రియుడిని వదిలేసినట్టు భార్య వదిలేయదు. ఇంకొకటి ఇంకోసారి నా కాపురంలో నిప్పులు పోయాలని చూడకు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే నా భర్త ప్రాణ స్నేహితుడు భార్యవి అని కూడ చూడను నేనేం చేస్తానో నాకే తెలియదు