అన్వేషించండి

Gruhalakshmi September 13th: తులసిపై ఒంటికాలి మీద లేచిన నందు- సామ్రాట్ కంపెనీ బాధ్యతలు తీసుకోమన్న పెద్దాయన

తులసిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నందు ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Gruhalakshmi September 13th: కేఫ్ కి సంబంధించి కొత్త కాంట్రాక్ట్ వస్తుందని, మీటింగ్ ఉందని నందు తులసికి చెప్తాడు. దాని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదని తులసి అనేసి వెళ్ళిపోతుంది. వాళ్ళ మాటలు విని పరంధామయ్య తులసి లేకపోతే ఏం చేయలేవా అనేసి కాసేపు ఆడుకుంటాడు. మీటింగ్ లో హాయిగా నిద్రపో అన్నీ తులసి చూసుకుంటుందిలే అనేసి దెప్పి పొడుస్తాడు. దివ్య గార్డెన్ లో కూర్చుని యోగా చేస్తూ ఉండగా విక్రమ్ మొక్కలకు నీళ్ళు పోయడానికి వస్తాడు. భర్తని చూసి యోగా నేర్పిస్తాను రమ్మని పిలుస్తుంది. దివ్య పిలిచినా కూడా విక్రమ్ రానని అంటాడు. వాళ్ళని జాహ్నవి గమనిస్తుంది. తను వెళ్లిపోగానే జాహ్నవి వచ్చి యోగా చేయాలి రమ్మని బలవంతంగా లాగుతుంది. దివ్య పిలిస్తే రాని వాడు జానూ పిలిస్తే వస్తాడు. అది చూసి రాజ్యలక్ష్మి నవ్వుకుంటుంది. కావాలని దివ్యని తీసుకొచ్చి వాళ్ళిద్దరినీ చూపిస్తుంది. నువ్వు పిలిస్తే రాని వాడు జాహ్నవి పిలిస్తే వచ్చాడని రెచ్చగొడుతుంది. కానీ దివ్య మాత్రం ఇష్టం లేని పని చేస్తున్నాడు ఏదో ఒక రోజు ఇష్టంలేకపోయినా తన దగ్గరకి వస్తుందని ధైర్యంగా చెప్పేసి వెళ్ళిపోతుంది. యోగాకి ఒప్పించిన జానూ ఏదో ఒకరోజు పెళ్లికి కూడా ఒప్పించి దివ్యని గెంటేస్తుందని రాజ్యలక్ష్మి సంబరపడుతుంది.

Also Read: వాటే సీన్ - మురారీ తన వాడేనని తెగేసి చెప్పిన కృష్ణ, ముకుందకి అదిరే ఝలక్!

నందు, తులసి మీటింగ్ కి అటెండ్ అవుతారు. కేఫ్ గురించి చెప్పమని  క్లయింట్స్ తులసిని అడుగుతారు. తను మాట్లాడుతూ ఉండగా సామ్రాట్ బాబాయ్ ఫోన్ చేస్తాడు. నందు ఫోన్ లిఫ్ట్ చేసి ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉందని అయిపోగానే కాల్ చేస్తానని చెప్తాడు. కానీ ఆయన అర్జెంట్ గా మాట్లాడాలి అనేసరికి తులసి ఫోన్ తీసుకుంటుంది. అర్జంట్ గా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి ఏ నిమిషంలోనైనా నాకు ఏమైనా అవ్వచ్చు వెంటనే వచ్చేయమని కాల్ కట్ చేస్తాడు. దీంతో తులసి మీటింగ్ మధ్యలో వదిలేసి వెళ్లిపోతుంటే నందు ఆపడానికి చూస్తాడు. కానీ తులసి మాత్రం మీరు మ్యానేజ్ చేసుకొండని చెప్పేసి వెళ్ళిపోతుంది. కేఫ్ గురించి ఏం చెప్పాలో తెలియక నందు క్లయింట్స్ ఇంప్రెస్ చేయలేకపోతాడు. తులసి హనీ ఇంటికి వస్తుంది.

తులసి: ఏం జరిగింది ఎందుకు కంగారుపడుతున్నారు

సామ్రాట్ బాబాయ్: సామ్రాట్ రుణం తీర్చుకోవాలని అనుకున్నావ్ ఇప్పుడు ఆ సమయం వచ్చింది. సామ్రాట్ మూడు విషయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఒకటి హనీ, తులసి, మరొకటి ఆఫీసు. బిజినెస్ గురించి నేను రాజీ పడదలచుకోలేదు. కంపెనీ మూసేస్తే వెయ్యి కుటుంబాలు రోడ్డున పడతాయి. సామ్రాట్ లేడని కంపెనీ షేర్లు పడిపోయాయి. బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన లోన్ తిరిగి ఇవ్వమని ఒత్తిడి తీసుకొస్తున్నారు.

తులసి: ఎందుకు అలా

పెద్దాయన: సామ్రాట్ లేకపోవడం వల్ల అలా జరుగుతుంది. ఆ కంపెనీ బాధ్యతలు నువ్వే తీసుకోవాలి. నువ్వు ఏంటో నీకు తెలుసు నాకు తెలుసు. ఈరోజే నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి లేకపోతే అని మాట్లాడుతుండగా రత్నప్రభ వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతారు

తులసి: కంపెనీ షేర్ వాల్యూ పడిపోతుందని అంకుల్ టెన్షన్ పడుతున్నారు

రత్నప్రభ: అంకుల్ నీతో డిస్కస్ చేస్తున్నారు కానీ మా ఆయన ఆఫీసు మేనేజర్స్ తో మాట్లాడి ఎలా చేయాలి ఏం చేయాలి యాక్షన్ ప్లాన్ కూడా చెప్పేశారు

తులసి: అనుభవం ఉన్న ధనుంజయ్ ని పక్కన ఉంచుకుని అంత టెన్షన్ పడటం ఎందుకు

ధనుంజయ్: నా మీద నమ్మకం లేదేమో

తులసి: అంకుల్ అలా అనుకునే వాళ్ళు  కాదు

ధనుంజయ్: కంపెనీ విషయాలు నేను చూసుకుంటాను. తులసిని ఇబ్బంది పెట్టొద్దు

పెద్ద భారం దించేశారు సంతోషం అనేసి తులసి వెళ్ళిపోతుంది. తమ ప్లాన్ వర్కౌట్ అయినందుకు రత్నప్రభ వాళ్ళు సంతోషపడతారు. నందు ఇంటికి వచ్చి చిరాకుగా ఉంటాడు. అప్పుడే తులసి వచ్చి మీటింగ్ ఏమైంది డీల్ ఒకే అయ్యిందా అని అడుగుతుంది.

Also Read: కళావతిని ఇంప్రెస్ చేసేందుకు రాజ్ తిక్కపనులు- బుద్ధిచూపించిన రుద్రాణి!

నందు: నిన్ను నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నీ కారణంగా డీల్ చేజారిపోయింది

తులసి: మిమ్మల్ని నమ్ముకుని నేను నా జీవితాన్ని పోగొట్టుకున్నా మరి నేనేం చేయాలి. ఎవరి చెప్పుతో కొట్టుకోవాలి.

నందు: మాట్లాడితే పాత సంగతులు బయటకి తీసి నన్ను దెప్పి పొడుస్తావ్. ఎన్ని రోజులు ఈ టెక్నిక్ వాడతావ్. మీటింగ్ వదిలేసి వెళ్లొద్దని బతిమలాడితే ఎందుకు వదిలేసి వెళ్లిపోయావ్. మన పని కంటే పరాయి వాళ్ళ పని ముఖ్యమా.

తులసి: అర్జెంట్ పని అనేసరికి వెళ్ళాను

నందు: మన కేఫ్ ముఖ్యం కాదా?

తులసి: మన కేఫ్ ఏంటి? అది మీ కేఫ్ కదా దాని బాధ్యత మీది నన్ను బ్లెమ్ చేస్తారు ఏంటి? దానికి నాకు ఏ సంబంధం లేదు

నందు: ఏ సంబంధం లేకుండానే కష్టపడి నాతో తిరుగుతున్నావా

తులసి: ఒక ఫ్రెండ్ కోసం తిరిగాను. అసలు ఏ హక్కుతో మీరు నామీద అరుస్తున్నారు. మొత్తం నా మీద వదిలేస్తే ఎలా అయినా డీల్ మాత్రమే మీ చేతిలో వదిలి పెట్టి వెళ్ళాను. కేఫ్ గురించి మొత్తం నేనే ఎక్స్ ప్లేన్ చేశాను కదా అది కూడా చేతకపోతే ఎలా? మీకు చేతనయింది నామీద వేలెత్తి చూపించడమే

ఇద్దరి గొడవ విని పరంధామయ్య కొడుకుని తిడతాడు. తప్పు నీదే కుదురుగా కూర్చుని మనసులో మాట చెప్పడం చేతకాదు కానీ మొగుడిలా పెత్తనం చెలాయించాలని చూస్తావా? ఇప్పుడు చూపిస్తుందిలే అసలు సినిమా అని దెప్పి పొడుస్తాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
HMD Fusion: ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Embed widget