Thane Train Accident News | రైలు నుంచి జారిపడి చనిపోయిన ఐదుగురు ప్రయాణికులు | ABP Desam
ముంబై లోకల్ ట్రైన్స్ రష్ ఎంత దారుణంగా ఉంటుందో చెప్పే ఘటన ఇది. కనీసం నిలబడేందుకు స్థలం లేక ప్రయాణికులు లోకల్ ట్రైన్స్ లో ఫుట్ బోర్డ్ పట్టుకుని వేలాడుతుంటే జరిగిన ఘోర విషాదం ఇది. థానే లోని ముంబ్రా, దివా స్టేషన్ల మధ్య వేగంగా కదులుతున్న రెండు రైళ్ల నుంచి పదిమంది జారిపడగా..వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవటం తీవ్ర విషాదాన్ని నింపింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ నుంచి థానే కసారా స్టేషన్ కు బయల్దేరిన లోకల్ ట్రైన్ కు ఎదురుగా ఎక్స్ ప్రైస్ రైలు రావటంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రెండు రైళ్లలోనూ ఫుట్ బోర్డులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్ ఒకరినొకరు తాకటంతో పట్టు తప్పి కిందకు పది మంది పడిపోయారు. వారిలో ఐదుగురు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోగా..మరో ఐదుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రైల్వే వ్యవస్థ ఘోర తప్పిదమని...రైల్వే మంత్రి రీల్స్ చేసుకునే హడావిడిలో ఇలాంటి ఘటనలను అస్సలు పట్టించుకోవటం లేదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.





















