అన్వేషించండి

Brahmamudi November 8th : స్వప్న, రుద్రాణి, రాహుల్‌ కలిపిపోయారా? – కనకాన్ని తిట్టిన అపర్ణ

ఇంటికి వచ్చిన కనకాన్ని అపర్ణ తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ ఆసక్తికరంగా జరిగింది.

రాజ్‌ను పిలిచిన తాతయ్య కావ్యను మనస్ఫూర్తిగా భార్యగా స్వీకరించమని చెప్పడంతో రాజ్‌ చూస్తుండిపోతాడు. ఎన్ని జరిగినా నాలాగే నువ్వు కూడా ఈ ఇల్లు ముక్కలు కాకుండా చూశావమ్మా, నీ మంచి తనమే నీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది అంటూ  తాతయ్య,  కావ్యను మెచ్చుకుంటాడు. బామ్మ తాతయ్యను విశ్రాంతి తీసుకోమని లోపలికి తీసుకెళ్తుంది.

కనకం కంగారుగా ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది.

కనకం: ఇలా టెన్షన్‌ పడటం నావల్ల కాదయ్య అక్కడ ఏం జరిగిందో.. మన పిల్లల గురించి ఏ నిర్ణయం తీసుకున్నారోనని నా తల పగిలిపోతుంది. మనం కూడా వెళ్దామంటే వద్దు మనం వెళ్తే గొడవ అవుతుంది అంటారు. 

కనకం భర్త: స్వప్న తప్పు చేసిన తర్వాత కూడా ఏ ముఖం పెట్టుకుని వెళ్లగలం చెప్పు. మనల్ని ఆ ఇంట్లో తల ఎత్తుకోకుండా చేసింది.

కనకం: దాని కోసం కాదయ్యా పాపం కావ్య అక్కడ ఎలా ఉందో అని నా దిగులంతా కనీసం ఫోన్‌ చేసైనా మాట్లాడుదాం.. ఆరోజు నువ్వు కూడా చూశావు కదా ఇంట్లో ఏదో అన్నారని కావ్య ఎవ్వరికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇప్పుడు అంతమంది వద్దు అంటే మనల్ని ఇబ్బంది పెట్టకూడదని ఎక్కడికైనా వెళ్లిపోతుంది.

అంటూ కనకం, కావ్యకు ఫోన్‌ చేస్తుంది.

కావ్య: చెప్పమ్మ

కనకం: ఏమైందమ్మ పెద్దాయన ఏమన్నారు. కావాలంటే నేను వచ్చి వాళ్ల కాళ్లు పట్టుకుంటాను.

కావ్య: లేదమ్మ.. తాతయ్య మమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పారు. అందర్నీ ఆ మాటకే కట్టుబడి ఉండాలని చెప్పారు.

తాతయ్యకు కాన్సర్‌ ఉందట ఆఖరి స్టేజిలో ఉందని డాక్టర్‌ చెప్పారట అని ఏడుస్తూ కావ్య ఫోన్‌ కట్‌ చేస్తుంది. విషయం తెలియడంతో కనకం ఆమె భర్త తాతయ్యను చూసొద్దామని బయలుదేరుతారు. అనామిక, కళ్యాణ్‌ కు  ఫోన్‌ చేసి మన పెళ్లి గురించి మా డాడీ నీతో మాట్లాడమన్నారని చెప్తుంది. ఈ విషయం  తర్వాత  మాట్లాడదామని తాతయ్యకు కాన్సర్‌ ఉందన్న విషయం కళ్యాణ్‌  చెప్పడంతో అనామిక షాక్‌ అవుతుంది. ఈ టైంలో ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడొద్దు అని టైం చూసుకుని మాట్లాడుకుందామని చెప్తుంది అనామిక.

గార్డెన్‌లో సుభాష్‌, అపర్ణ కూర్చుని ఆలోచిస్తుంటారు.

అపర్ణ: ఇంత పెద్ద విషయం ఎలా దాచాలనుకున్నారండి? ఇంట్లో పెద్దదాన్ని నాకైనా చెప్పొచ్చు కదా.

అపర్ణ బాధపడుతుంటే ఎవరూ బాధపడొద్దనే నాన్న ఎవ్వరికీ చెప్పొద్దన్నారు. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో నాన్నని సంతోషంగా చూసుకోవాలి అని సుభాష్‌ చెప్తాడు. ఇంతలో కనకం ఆమె భర్త ఇంట్లోకి వస్తుంటే.. అపర్ణ వారిని ఆపి తిడుతుంది. సుభాష్‌ అడ్డుపడి ఏం మాట్లాడుతున్నావ్‌.. అంటూ అపర్ణను తిడతాడు. దీంతో కనకం ఆమె భర్త రిటర్న్‌ వెళ్లిపోతుంటే..

సుభాష్‌: ఆగండి నాన్నగారికి అలా జరిగిందన్న బాధలో అపర్ణ ఏదో మాట్లాడింది. మీరేం అనుకోకండి. నాన్నగారు లోపల పడుకున్నారు వెళ్లండి వెళ్లి చూడండి.

అపర్ణ: వాళ్లను ఎందుకు అంతలా గౌరవిస్తున్నారు.

సుభాష్: గొడవలు పెట్టుకోవద్దని ఇప్పుడే చెప్పాను. మళ్లీ అప్పుడే గొడవలు పెట్టుకుంటున్నావు. ముందు నువ్వు మారాలి. తర్వాత ఇంట్లో వాళ్లను మార్చాలి.

అంటూ సుభాష్‌ వెళ్లిపోతాడు. తాతయ్య, బామ్మ ఇద్దరూ ఏడుస్తూ మాట్లాడుకుంటుంటారు. ఇంతలో  కనకం ఆమె  భర్త వచ్చి తాతయ్యను పలకరిస్తారు.

రాహుల్‌, స్వప్న ఇద్దరూ గొడవపడుతుంటారు.

రాహుల్‌ : ఇక నువ్వు ఎంత నటించినా ఈ ఇంట్లో ఉండటం కుదరదు. నీ నిజస్వరూపం ఇంట్లో వాళ్లకి తెలిసిపోయింది.

స్వప్న : అవును నిజం తెలిసింది. నువ్వు చేసిన మోసానికి నేను అలా చేశానని ఇంట్లో అందరూ అర్థం చేసుకున్నారు.

అంటూ ఇద్దరూ గొడవపడుతుంటే ఇంతలోనే రుద్రాణి అక్కడికి వచ్చి ఇద్దరినీ తిట్టి మీ వల్లే మీ తాతయ్య ఆరోగ్యం పాడవుతుందని మనల్ని ఇంట్లోంచి గెంటివేస్తారని హెచ్చరిస్తుంది. నేను ఇలాగే ఉంటానని స్వప్న చెప్పి వెళ్లిపోతుంది. రాజ్‌, కావ్య అబద్దం చెప్పిందన్న విషయం గుర్తుచేసుకుంటూ కోపంగా అటు ఇటు తిరుగుతుంటాడు. ఇంతలో కావ్య వస్తుంది. కావ్యను చూసి రాజ్‌ బయటకి వెళ్తుంటే..

 కావ్య: ఏవండి  నాతో మాట్లాడ్డం కూడా మీకు ఇష్టం లేదని నాకు తెలుసు

రాజ్‌: తెలిసి కూడా ఎందుకు మాట్లాడుతున్నావ్‌.

కావ్య: గొడవలు పడిన ప్రతిసారి మాట్లాడ్డం మానేస్తే ఇక బంధం ఎలా నిలబడుతుంది.

రాజ్‌: వద్దు అనుకున్న బంధం ఇక నిలబడినా.. తెగిపోయినా.. ఒకటే అవుతుంది.

అంటూ నువ్వెన్ని చెప్పినా నిన్ను నమ్మనని రాజ్‌ కరాకండిగా కావ్యకు చెప్పడంతో కావ్య బాధపడుతుంది. దీంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Best Budget Sports Bikes: రూ.1.5 లక్షల్లో బెస్ట్ స్పోర్ట్స్ బైక్‌లు ఇవే - లిస్టులో ఏమేం ఉన్నాయి?
రూ.1.5 లక్షల్లో బెస్ట్ స్పోర్ట్స్ బైక్‌లు ఇవే - లిస్టులో ఏమేం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Best Budget Sports Bikes: రూ.1.5 లక్షల్లో బెస్ట్ స్పోర్ట్స్ బైక్‌లు ఇవే - లిస్టులో ఏమేం ఉన్నాయి?
రూ.1.5 లక్షల్లో బెస్ట్ స్పోర్ట్స్ బైక్‌లు ఇవే - లిస్టులో ఏమేం ఉన్నాయి?
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Embed widget