అన్వేషించండి

Brahmamudi November 10th: వీలునామాలో తాతయ్య ఏం రాశారు- రుద్రాణికి ఆస్థి భాగం ఇవ్వొద్దన్న అపర్ణ!

తన వాటా ఆస్థికోసం రుద్రాణి నాటకం మొదలు పెట్టడంతో ఇవాళ్టి ఏపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.

Brahmamudi Serial November 10th Episode: కాలీ బాండ్‌ పేపర్స్‌తో వాళ్ల నాన్న రూంలోకి వచ్చిన రుద్రాణి ఏవేవో మాటలు చెబుతుంది. బాధపడుతూ ఉంటుంది.

రుద్రాణి: నా పెళ్లి పెటాకులైపోయి నేను పుట్టింటికి ఆశ్రయం కోసం వచ్చినప్పుడు. నువ్వేమన్నావ్‌ ఈ ఇంట్లో అన్ని హక్కులు కల్పిస్తానన్నావ్‌. కానీ ఈ ఇంట్లో వాళ్లు నాకు ఏ హక్కులు లేవన్నట్లు..నేను ఇంటి మనిషినే కాదన్నట్లు ఒక పనిమనిషిలాగా చీప్‌గా చూస్తున్నారు నాన్నా. అందుకే ఆస్తిలో నాకు ఒక వాటా ఉంటే వాళ్లందరూ అలా చూడరు కదా నాన్నా

అంటూ బాండ్‌ పేపర్స్‌ వాళ్ల నాన్న చేతిలో పెడుతూ మరోక్కసారి ఏడుస్తూ మీరున్నారన్న ధైర్యంతో వెళ్తున్నాను నాన్నా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది రుద్రాణి. రూంలో రాహుల్‌ మందు తాగుతూ కూర్చుని ఉంటాడు. రుద్రాణిని చూసి

రాహుల్‌: మామ్‌ నిజంగా ఏడ్చావా? నువ్వు

రుద్రాణి: జీవించాను.

రాహుల్‌ : మీ నాన్నా కానీ నాన్న నమ్మేశాడా?

రుద్రాణి: నమ్మేలాగా నటించి వస్తున్నాను. మంచితనం ఇంత భయంకరంగా ఉంటుందా? మంచివారిలా నటించడం మనలాంటి చెడ్డవాళ్లకు అనుభవంలోకి వస్తే గానీ తెలియదు.  మంచివాళ్లు అంత మంచితనంతో ఎలా ఉంటార్రా బాబు.

రాహుల్‌: మామ్‌ నేను హాల్లోకి వచ్చినప్పుడు మేకలాగా ముసుగు వేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా?

రుద్రాణి: నీకు నాకు ఈ ఇంట్లో ఎన్ని కష్టాలురా బాబు. తోడేళ్లే మేకల్లా కనిపించడానికి ప్రయత్నం చేయడం బాగా రిస్క్‌.

రాహుల్‌: ఇంతకీ పెద్దాయన కాన్సర్‌ వచ్చి పోక ముందే మనకి వాటా రాసిచ్చేలా ఉన్నాడా?

రుద్రాణి: రాసివ్వకుండా ఎలా పోతాడు. యమధర్మరాజు ఎత్తుకుపోకుండా టోల్‌ గేట్‌ వేయనూ.. చాలా చిన్న జీవితంరా మనది. మీ తాత ఆ కాలంలో పుట్టాడు కాబట్టి మంచి ఫుడ్‌ తిని అలా ఉన్నారు. మనం ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్‌ చేద్దాం.

అనగానే రాహుల్‌ ఆస్థి మన చేతికి రాగానే ముందు స్వప్నను వదిలించుకుందాం. తర్వాత మొత్తం వరల్డ్‌ టూర్‌ చేయాలని ఉంది అని చెప్తాడు. దీంతో రుద్రాణి అలాగే చేద్దువులే కానీ అంటూ ఆలోచిస్తుంది. ఇంట్లో అందరూ బ్రేక్‌పాస్ట్‌ చేయడానికి రెడీ అవుతుంటే ఇంతలో లాయర్‌ వస్తాడు. ఆయన్ను చూసిన ఇంట్లో వాళ్లందరూ ఎందుకు వచ్చాడని షాక్‌ గా చూస్తుంటారు. ఇప్పడొచ్చారేంటని సుభాష్, లాయర్‌ ని అడుగుతాడు. మీ నాన్న గారే రమ్మన్నారని లాయర్‌ చెప్పి ఆయన గదిలోకి వెళ్తాడు. లాయర్‌ లోపలికి వెళ్లగానే బామ్మ బయటికి వస్తుంది.

సుభాష్‌: అమ్మా లాయర్‌ ఎందుకొచ్చారమ్మా?

చిట్టి: ఏమోరా నాకు అంత అయోమయంగా ఉంది.

సుభాష్‌: మరి నువ్వెందుకు బయటికి వచ్చావు అమ్మ?

చిట్టి: నేనెక్కడొచ్చాను మీ నాన్నే వెళ్లిపోమ్మన్నారు.

సుభాష్‌: నాన్నకు ఇప్పుడు డాక్టర్‌తో అవసరం కానీ లాయర్‌తో అవసరం ఏముందమ్మా?

రుద్రాణి: ఏముంది ఆస్తులు పంచడానికేమో?

చిట్టి: ఆ నోటికి మంచి మాటలే రావా?

రుద్రాణి: ఇక్కడ అందరి మనస్సుల్లో అదే అనుమానం ఉంది. నేను బయటపడ్డాను వీళ్లు పడలేదు. అంతే తేడా

లోపల లాయర్‌తో కూర్చున్న తాతయ్య తను చెప్పిన్నట్లు వీలునామా రాయమంటారు. లాయర్‌ తాతయ్య చెప్పింది రాసుకున్న లాయర్‌ వీలునామా తయారు చేసి తీసుకుని వస్తానని చెప్పి వెళ్లిపోతాడు. గార్డెన్‌లో కూర్చున్న తన భర్తకు టీ ఇచ్చిన  ధాన్యలక్ష్మీ  ఆస్థి పంపకాల గురించి మాట్లాడుతుంది. రుద్రాణి ఏదైనా చేసి కళ్యాణ్‌కు అన్యాయం చేస్తుందేమోనని భయపడుంతుంది. అయితే సుభాష్, రాజ్‌ ఉన్నంత వరకు అలా ఏమి జరగదని ధాన్యలక్ష్మీ భర్త చెప్పడంతో ఆమె హ్యాపీగా లోపలికి వెళ్తుంది. లోపల తాతయ్యగారి రూంలోకి వెళ్తుంది ఆపర్ణ.

అపర్ణ: మామయ్యగారు రుద్రాణి ఏవో బాండ్‌ పేపర్స్‌తో మీ దగ్గరకు వచ్చిందని తెలిసింది.  నిజమేనా మామయ్యగారు.

చిట్టి: రుద్రాణి వచ్చి వెళ్లిందా?

తాతయ్య: అవును.

చిట్టి : ఏం మాట్లాడింది?

అపర్ణ: ఏం మాట్లాడి ఉంటుందో మీరింకా ఊహించలేదా? అత్తయ్య

తాతయ్య: అవును నీవు ఊహించింది నిజమేనమ్మ.

అపర్ణ: సాహసం చేసి నేను మీకో మాట చెప్పి వెళ్దామని వచ్చాను మామయ్యగారు. దయచేసి ఇది నేను మీకిచ్చే సలహాలా కాకుండా నా అభిప్రాయంగా బావించండి.

అంటూ మీ ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు చేయాల్సి వచ్చినా చేయండి. ఆఖరికి ఆస్థులు అమ్మాల్సి వచ్చినా అమ్మండి. అ రుద్రాణి నాటకాలు ఆడి ఆస్థి కొట్టేయాలని చూస్తుంది. రాహుల్‌ కు ఆస్థి ఇచ్చినా నిలబెట్టుకోలేడు. అందుకే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను స్వాగతిస్తాను అంటూ అపర్ణ వెళ్లిపోతుంది. రాజ్‌ ఎవరితో ఫోన్‌లో మాట్లాడుతుంటాడు.

రాజ్‌: నో నో ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. నువ్వు మాత్రం ఆ డాక్టర్‌ ను  పిలుపించు. మా తాతయ్య ఆరోగ్యం ముఖ్యం. ప్లీజ్‌ ఈ ఒక్క హెల్ఫ్‌ చేయ్‌ నీ ఇంన్‌ప్లీయెన్స్‌ అంతా యూస్‌ చేసైనా సరే అతన్ని పిలిపించు. నువ్వే నా లాస్ట్‌ హోప్‌. ఏదో ఒకటి చెయ్‌.

అని మాట్లాడుతుండగానే కావ్య భోజనం తీసుకుని లోపలికి వస్తుంది. ఇప్పుడు ఈయన ఉన్న టెన్షన్‌లో తాతయ్య లాయర్‌ను పిలిపించిన విషయం చెబితే ఇంకా ఎక్కువ కంగారు పడతారేమో.. టైం చూసి తర్వాత చెబుతాం అని మనసులో అనుకుంటుంది.

రాజ్‌: నేను ఏం మాట్లాడుతున్నానో అని సీక్రెట్‌గా వింటున్నావా?

కావ్య: అలా వినాలి అనుకుంటే తలుపు చాటున నిలబడి వింటాను. ఇలా మీ ముందుకు వచ్చి కాదు.

అనగానే రాజ్‌ నువ్వేమైనా చేయగలవు. మా తాతయ్య మంచితనం వల్లా ఇంకా నువ్వు మీ అక్క ఈ ఇంట్లో ఉన్నారు. లేదంటే అంటూ కోపంగా చూస్తాడు రాజ్‌. మరి ఆ మంచితనం మీకెందుకు రాలేదో అంటూ ప్రశ్నిస్తుంది కావ్య. దీంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ అయిపోతుంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR On Revanth : అలా చేద్దాం - ఎవరిది తప్పయితే వాళ్లు జైలుకెళదాం - రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అలా చేద్దాం - ఎవరిది తప్పయితే వాళ్లు జైలుకెళదాం - రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Sharmila Comments : ఓడిపోయిన తర్వాత విదేశాలకే- షర్మిల సంచలన కామెంట్స్ 
ఓడిపోయిన తర్వాత విదేశాలకే- షర్మిల సంచలన కామెంట్స్ 
Anchor Divorce: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
Sharmila Vs Avinash Reddy: అక్కలు క్షమాపణ చెప్పాలి- నేను వినాలి: అవినాష్
అక్కలు క్షమాపణ చెప్పాలి- నేను వినాలి: అవినాష్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SS Rajamouli on Animation Films | యానిమేషన్ సినిమాలపై తన అభిప్రాయం చెప్పిన రాజమౌళి | ABP DesamSS Rajamouli on Bahubali Market | ఇండియన్ సినిమా మార్కెట్ మీద క్లారిటీ కావాలంటే..ఈ వీడియో చూడండి|ABPP. Gannavaram YSRCP MLA Candidate Vipparthi Venugopal Rao | ఆ కారణం వల్లే జగన్ కు నేను చాలా క్లోజ్ |Attack on Home Minister Taneti Vanitha CCTV Visuals | నల్లజర్లలో ఉద్రిక్తత..హోంమంత్రి ఇంటిపై దాడి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On Revanth : అలా చేద్దాం - ఎవరిది తప్పయితే వాళ్లు జైలుకెళదాం - రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అలా చేద్దాం - ఎవరిది తప్పయితే వాళ్లు జైలుకెళదాం - రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Sharmila Comments : ఓడిపోయిన తర్వాత విదేశాలకే- షర్మిల సంచలన కామెంట్స్ 
ఓడిపోయిన తర్వాత విదేశాలకే- షర్మిల సంచలన కామెంట్స్ 
Anchor Divorce: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
Sharmila Vs Avinash Reddy: అక్కలు క్షమాపణ చెప్పాలి- నేను వినాలి: అవినాష్
అక్కలు క్షమాపణ చెప్పాలి- నేను వినాలి: అవినాష్
Sam Pitroda: దక్షిణాది వాళ్లంతా ఆఫ్రికన్స్‌లా ఉంటారు, మరోసారి శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు
Sam Pitroda: దక్షిణాది వాళ్లంతా ఆఫ్రికన్స్‌లా ఉంటారు, మరోసారి శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు
Telangana News: బీ
బీ"ఆర్‌"ఎస్‌ది ఫెవికాల్ బంధం- ట్రిపుల్ ఆర్‌ వసూళ్లను మించేలా డబుల్ ఆర్ వసూళ్లు - వేములవాడ ప్రచార సభలో మోదీ విమర్శలు
Actress Madhavi Reddy: రోజా నా క్లాస్‌మేట్‌‌ , అప్పుడు నల్లగా ఉండేది - పనిమనిషిగా బాగా సెట్ అయ్యావంటూ ఏడిపించేవాళ్లం.. నటి షాకింగ్‌ కామెంట్స్‌
రోజా నా క్లాస్‌మేట్‌‌ , అప్పుడు నల్లగా ఉండేది - పనిమనిషిగా బాగా సెట్ అయ్యావంటూ ఏడిపించేవాళ్లం.. నటి షాకింగ్‌ కామెంట్స్‌
Salaar 2: 'సలార్ 2'పై పృథ్వీరాజ్ ట్వీట్ - 'కెజియఫ్'తో లింక్ చేస్తారా? ఎన్టీఆర్ సినిమాతోనా?
'సలార్ 2'పై పృథ్వీరాజ్ ట్వీట్ - 'కెజియఫ్'తో లింక్ చేస్తారా? ఎన్టీఆర్ సినిమాతోనా?
Embed widget