Brahmamudi Serial Today April 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: బాబు తల్లి వెన్నెల కాదు, ఆనందంలో కావ్య
Brahmamudi April 17th Episode : చిక్కుముడి వీడిపోయింది. బాబు తల్లి వెన్నెల కాదని, వెన్నెల అసలు జీవించి లేదని తెలిసిపోయింది. తన భర్త మీద ఉన్న నమ్మకంమమ్ముకాలేదన్న కావ్య ఆనందమే ఈ ఎపిసోడ్ హైలెట్.
Brahmamudi April 17th Episode : అందరూ కలిసి పార్టీలో ఉంటున్నప్పుడు కావ్య వాళ్ళ ఫ్రెండ్ ని ఎందుకు దూరంగా వచ్చి వెయిట్ చేస్తున్నావు అని రాజ్ అడుగుతాడు. ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి అని చెప్తుంది. ఎవరు అని అడిగితే కావాలని,కావ్యని బాధపెడుతున్న రాజ్ ను కాసేపు తను బాధ పెట్టాలని అనుకొని వెన్నెల పేరు చెప్తుంది. షాక్ తింటాడు రాజ్. అక్కడికి కావ్య కూడా వస్తుంది. ఇద్దరు కలిసి రాజుని టార్గెట్ చేస్తారు.
రాజ్ : వెన్నెల వస్తుందా ?
కావ్య : వెన్నెల వస్తుందా ?
శ్వేత : కావ్య నీకు వెన్నెల తెలుసా?
కావ్య : నాకు ఒక వెన్నెల తెలుసు మరి ఆ వెన్నెల, ఈ వెన్నెల ఒక్కరో కాదో ఈయనే చెప్పాలి.
శ్వేత : అసలు నీకు ఏ వెన్నెల తెలుసు?
రాజ్ : హే ఈ వెన్నెల గోల ఆపండి.
కావ్య : మొదలు పెట్టింది మీరే కదా
శ్వేత : ఏం మొదలు పెట్టాడు?
కావ్య, శ్వేత డిస్కషన్ పెంచుతూ పోవటంతో రాజ్ కి వళ్ళుమండిపోతుంది. శ్వేత కూడా వెన్నెల విషయంలో రాజ్ ను కావాలనే ఇబ్బంది పెడుతుంది. కావ్య చెప్పి చెప్పకుండా అర్థం అయి కానట్టు మాట్లాడి రాజ్ ని ఇరిటేట్ చేస్తుంది. ఇంతలో అక్కడికి కారు వచ్చి ఆగుతుంది.
కోడలు దగ్గర ఆస్తి పత్రాలు తీసుకోవాలని రాహుల్ వాళ్ళ అమ్మతో కలిసి ఒక తెలివైన ప్లాన్ వేస్తాడు. స్వప్న తన బెడ్రూంలో హ్యాపీగా పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు రాహుల్ వెళ్లి స్వప్నతో పాటుగా డ్యాన్సులు వేస్తూ స్వప్న దృష్టిని మళ్లిస్తాడు. ఈలోగా రాహుల్ వాళ్ళ మదర్ వచ్చి షెల్ఫ్ లో ఉన్న ఆస్తి పత్రాలు తీసుకుంటుంది. వాటిని పట్టికెళుతున్నప్పుడు స్వప్న చూసి తన అత్తగారిని కూడా డాన్స్ వేయండి అని చెప్పి తనతో పాటు డాన్స్ వేయిస్తుంది. ఇంతలో రాహులు పాటలు ఆపేస్తాడు. కోడల్ని డాన్సులు చాలా బాగా వేస్తున్నావ్ రేపొద్దున్న సెలబ్రిటీ అయిపోతావ్, నీ ఆటోగ్రాఫ్ కావాలంటే మేము చాలా ఎదురుచూడాలి.. ఆ ఆటోగ్రాఫ్ ఇప్పుడే ఇవ్వచ్చు కదా అని ఆస్తి పత్రం మీద కొడుకు రాహుల్ సహాయంతో సంతకం పెట్టించుకుంటుంది. సంతకం అయిపోయింది ఇక మిగిలింది రాజ్ ని ఇరికించడమే అని ప్లాన్ చేస్తారు. పార్టీకి వెళ్లి వచ్చేలోగా ఆ కళ్యాణ్ చేత చేయించాల్సిన పని చేయిస్తానని అంటాడు రాహుల్.
ఇంతలో ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ కి వెన్నెల రానే వస్తుంది. నువ్వు అస్సలు మారలేదంటూ స్వాగతం చెబుతుంది శ్వేత. ఈలోపు బాబు ఏడుస్తున్నాడని వచ్చి ఆయా బాబుని రాజ్ కి ఇచ్చేస్తుంది, కానీ వెన్నెల అందుకుంటుంది. శ్వేత కావ్యని వెన్నెలకి రాజ్ వైఫ్ అంటూ పరిచయం చేస్తుంది. అందరూ నువ్వు 10th తరువాత ఏమైపోయావు అని అడుగుతారు. మీరందరూ ఇంత బాగా నన్ను గుర్తు పెట్టుకుంటారని, ప్రత్యేకంగా పిలుస్తారని అసలు ఊహించుకోలేదు అంటూ తన కథ చెప్పడం మొదలు పెడుతుంది.
వెన్నెల : మీకు తెలియని నిజం ఏమిటంటే నేను మీ క్లాస్మేట్ వెన్నెలని కాదు. నేను వెన్నెల కవల పిల్లలం. ఇద్దరం ఒకేలాగా ఉండటం వల్ల మీరు పోల్చుకోలేకపోయారు. పదవ తరగతి పరీక్ష తర్వాత వెన్నెలకి ఒంట్లో బాగోకపోతే మా నాన్న మమ్మల్ని బెంగళూరు తీసుకొని వెళ్ళిపోయారు.
కావ్య : మరి వెన్నెల బదులు మీరు ఎందుకు వచ్చారు.
ఇంతలో వచ్చిన అమ్మాయి స్టేజ్ మీద వెన్నెల ఫోటో పెట్టి దండ వేస్తుంది.
వెన్నెల సిస్టర్ : బెంగుళూరు షిఫ్ట్ అయ్యాక తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది కొద్ది రోజులకే చనిపోయింది. ఒకసారి రాజ్ బెంగళూరు ఎయిర్పోర్టు లో కనిపించినప్పుడు తనకి చెప్పాను మీకు చెప్పే ఉండి ఉంటాడు అనుకున్నాను.
కావ్య ఏడుస్తూ కూర్చుంటుంది. వచ్చినది వెన్నెల కాదని తెలియడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ మా ఆయన నాకు తనమీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాడని చెబుతుంది. తనకి, ఆ బాబుకి సంబంధం లేదు. ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఏమని అన్నా కూడా నేను తన వైపే నిలబడ్డాను. అని హ్యాపీగా ఫీల్ అవుతుంది.
కానీ శ్వేత మాత్రం ఆ చిన్న అబ్బాయి గురించి ఎందుకు రాజ్ ఇంత అబద్ధం ఆడాడు, ఆ అబ్బాయి ఎవరు అని అడుగుతుంది. ఎలా అయినా తెలుసుకుంటానని చెబుతుంది కావ్య. అసలు వెన్నెల గురించి తెలుసుకోవడానికకే ఈ పార్టీ అరేంజ్ చేసానని రాజుకి చెప్పద్దు అంటుంది శ్వేత.. సరే అని మాట ఇస్తుంది కావ్య.
తరువాయి భాగంలో --
బాబుకి విపరీతమైన జ్వరం, వొళ్ళు కాలిపోతుంది.. డాక్టర్ దగ్గరికి తీసుకెళతారు.. ఈ సమయంలో బాబుకి తల్లి ప్రేమ, తల్లి స్పర్శ, తల్లి పాలు తప్ప ఇంకేమీ కాపాడలేవని చెబుతుంది డాక్టర్ .. ఆలోచనలో పడతాడు రాజ్.
Also Read: కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?