Ammayi garu Serial Today September 29th: అమ్మాయిగారు సీరియల్: హాస్పిటల్‌లో తల్లీకొడుకులకు షాక్! సూర్య, విరూపాక్షిలకు ఏకాంతం!
Ammayi garu Serial Today Episode September 29th విరూపాక్షి, సూర్యలను కలపాలని రాజు, రూపలు ఇంట్లో వాళ్లతో కలిసి ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాఘవని చంపాలి అని విజయాంబిక, దీపక్‌లు హాస్పిటల్‌కి వెళ్తారు. రాఘవ గదికి వెళ్లే ఛాన్స్ లేకపోవడంతో ఓ నర్స్‌ని పిలిచి డబ్బు ఇచ్చి ఇంజక్షన్ ఇచ్చి రాఘవకి వేయమని అంటారు. ఈ నర్స్ అది విషం అని తెలిసి నాకు అన్నం పెట్టిన పనికి నేను ద్రోహం చేయలేను.. అసలే సీఎం గారి అండర్‌లో ఉన్న పేషెంట్ నేను చేయను అంటాడు.
దీపక్ డబ్బు ఇచ్చేయమని అంటే మీరు చేసింది చెప్పకుండా ఉండాలి అంటే ఈ డబ్బు నా దగ్గరే ఉండాలి అని చెప్పి నర్స్ వెళ్లిపోతాడు. ఇక బంటీ సూర్యప్రతాప్, విరూపాక్షిల ఫొటోలు చూస్తాడు. ఇంతలో రాజు, రూపలు వచ్చి ఏం చూస్తున్నావ్ బంటీ అంటే అమ్మమ్మ తాతయ్యల ఫొటో చూస్తున్నా అని రూప, రాజులకు చూపిస్తాడు. ఫొటోలు చూసి రూప, రాజులు చాలా సంతోషపడతారు. మందారం వచ్చి ఇద్దరూ ఇంట్లోకి వస్తుంటే దండ పడిందని చెప్తుంది. చాలా మంచి పని చేశావ్ బంటీ అని రూప అంటుంది. సూర్యప్రతాప్ విరూపాక్షిని ఏం అనలేదని దండ తీసి పక్కన మామూలుగా పెట్టారని మందారం చెప్పడంతో రాజు, రూప చాలా సంతోషిస్తారు. సుమ, చంద్రలు వచ్చి మాకు ఇంకా సంతోషంగా ఉందని చెప్తారు. రాఘవ ఆ రోజు ఏం జరిగిందో చెప్పేస్తే మొత్తం సెట్ అయిపోతుందని అనుకుంటారు. అన్నయ్య, వదినల్ని కలపడానికి ఏం చేయాలన్నా రెడీగా ఉంటామని చంద్ర అంటాడు.
రాజు అందరితో ఈ రోజు కారులో పంపినట్లే రోజు ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు. రూప తనకు ఐడియా వచ్చిందని తన ఐడియా చెప్తుంది. సూపర్ అనుకొని అందరూ అలాగే చేద్దాం అని అనుకుంటారు. సూర్యప్రతాప్ ఉదయం లేచి చంద్ర, సుమ ఇలా అందర్ని పిలుస్తాడు. ఎవరూ ఇంట్లో ఉండరు. అందరూ ఎక్కడికి వెళ్లారని అనుకుంటాడు. నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా బయటకు వెళ్లడం ఏంటి అని అనుకుంటాడు.
రూప, రాజులు అందర్ని తీసుకొని గుడికి వస్తారు. విజయాంబిక చంద్రతో ఏంటి అందర్ని గుడికి తీసుకొచ్చావ్.. తమ్ముడిని పిలవలేదు అంటే అత్తయ్యని కూడా పిలవలేదని రాఘవ అంటాడు. అన్నయ్య బిజీ అని చంద్ర అంటాడు. సూర్యప్రతాప్ రాజుకి కాల్ చేసి ఎక్కడికి వెళ్లారు అంటే దసరా అని చిన్నయ్య తీసుకొచ్చారని అంటాడు. నాకు చెప్పలేదు అంటే మీకు ముందే చెప్పాలి సెక్యూరిటీ ప్రాబ్లమ్ అవుతుందని మేం వచ్చేశాం అని అంటాడు.
సూర్యప్రతాప్ లోపలికి వెళ్తుంటే విరూపాక్షి బయటకు వస్తుంది. సూర్యప్రతాప్ విరూపాక్షిని చూసి అందరూ వెళ్లి విరూపాక్షిని వదిలేశారేంటి తను ఎమ్మెల్యే అని పబ్లిక్కి ప్రాబ్లమ్ అవుతుందని వదిలేసినట్లున్నారని అనుకుంటాడు. విరూపాక్షి మొత్తం చూసి ఇంట్లో ఎవరూ లేరు ఏంటా అని అనుకుంటుంది. విరూపాక్షికి రూప కాల్ చేసి మేం కావాలి అనే బయటకు వచ్చాం.. నువ్వు కంగారు పడకు. నాన్నకి దగ్గరకు అవ్వాలని ప్రయత్నించు.. నాన్నతో మాట్లాడు అని చెప్తుంది. సూర్యతో మాట్లాడి ఇబ్బంది పెట్టడం కంటే సైలెంట్గా ఉంటేనే బెటర్ అని విరూపాక్షి అనుకుంటుంది.
విజయాంబిక, దీపక్, కోమలిలకు ఏదో తేడా కొడుతుంది. సూర్యప్రతాప్, విరూపాక్షిని వదిలేసి వచ్చారు అంటే ఏదో ప్లాన్ చేశారని విజయాంబిక అంటుంది. సూర్యప్రతాప్‌కి విరూపాక్షి అంటే అస్సలు పడదు అలాంటప్పుడు మనకు భయం ఎందుకు అని కోమలి అంటుంది. సూర్యప్రతాప్ హాల్లో ఉంటే విరూపాక్షి కిచెన్లు ఉంటుంది. రూప మళ్లీ తల్లికి వాయిస్ మెసేజ్ పంపుతుంది. నాన్న ఏం అనుకుంటారో అని భయపడకు నువ్వు మాత్రం ఏదో ఒకటి మాట్లాడు అని అంటుంది. గుడిలో రూప, రాజు, చంద్ర, సుమ, మందారం అందరూ ఓ చోట కూర్చొని ఇంట్లో ఏం జరుగుతుందో ఫోన్లో చూస్తుంటారు.
విరూపాక్షి సూర్యప్రతాప్ దగ్గరకు వచ్చి సూర్య ఇంట్లో వాళ్లు అందరూ కనిపించడం లేదు ఎక్కడికి పంపావ్ అని అడుగుతుంది. నేను ఎవరినీ పంపలేదు వాళ్లందరూ గుడికి వెళ్లారని సూర్యప్రతాప్ అంటాడు. చెప్తే మనం కూడా వెళ్లే వాళ్లం కదా అని అంటుంది. కాఫీ తీసుకొస్తానని విరూపాక్షి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















