Chinni Serial Today September 29th: చిన్ని సీరియల్: వరుణ్, అతిథిలకు నిశ్చితార్థం ఫిక్స్! లోహిత పరిస్థితేంటి? మ్యాడీ హార్ట్ బ్రేక్ మూమెంట్!
Chinni Serial Today Episode September 29th వరుణ్‌కి మినిస్టర్ కూతురితో నిశ్చితార్థం డేట్ తీయడం అదే రోజు లోహితకు పెళ్లి చూపులు కావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు కావేరి ఫొటో చూస్తూ ఏడుస్తుంది. తనకు నచ్చిన ఎవరూ తనతో లేరని చాలా బాధపడుతుంది. మహి షర్ట్ పట్టుకొని చివరకు మ్యాడీ కూడా నాకు లేడు అని ఏడుస్తుంది. మ్యాడీ నిన్ను మర్చిపోలేకపోతున్నా నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం నువ్వు అంత తపన పడుతున్నావ్.. నువ్వు నాకు దక్కవు అన్న ప్రతీసారి ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు తెలుసు మ్యాడీ కానీ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ జీవితంలోకి రావాలి.. నీ ప్రేమని గెలిచిన ఆ అమ్మాయి త్వరలోనే నీ జీవితంలోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అనుకుంటుంది.
మినిస్టర్ ఫ్యామిలీ మ్యాడీ వాళ్ల ఇంటికి డిన్నర్‌కి వస్తారు. అతిథి చలాకిగా అందర్ని పరిచయం చేసుకుంటుంది. వరుణ్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చి మై మ్యాన్ అని అనుకుంటుంది. అందరూ డిన్నర్ చేయడానికి వెళ్తారు. త్వరగా పెళ్లి చేసేద్దాం అని అనుకుంటారు. వరుణ్ షాక్ అయిపోతాడు. మినిస్టర్ దేవాతో నువ్వు సీఎం అవ్వడం నా టార్గెట్ దేవా నువ్వు రాష్ట్రం రూల్ చేస్తే.. నేను సెంట్రల్‌లో రూల్ చేస్తా అని అంటారు. ఇక ప్రమీల దేవాతో శ్రేయకి పెళ్లికి అవ్వకుండా వరుణ్‌కి ఎలా చేస్తాం అని అడుగుతుంది. శ్రేయకి సంబంధం చూశారా అని మినిస్టర్ అడిగితే మహితో ఫిక్స్ అయిపోయిందని వసంత చెప్పడంతో రెండు పెళ్లిళ్లు ఒకే సారి చేసేద్దాం అని మినిస్టర్ అంటారు. దాంతో మహి టాపిక్ తన పెళ్లి గురించి కాదని టైం కావాలి అంటాడు. దాంతో మినిస్టర్ వరుణ్, అతిథిల నిశ్చితార్థం చేసేద్దాం అని అంటాడు.
నాగవల్లి పంతులుకి కాల్ చేసి ముహూర్తం అడిగితే ఎల్లుండి మంచిది అని చెప్తారు. వల్లీ అది చెప్పడంతో అతిథి వల్లీని హగ్ చేసుకొని నువ్వు మా బంగారం పిన్ని అని అంటుంది. వరుణ్‌కి అందరూ కంగ్రాట్స్ చెప్తారు. లోహిత, సరళ, చందు భోజనం చేస్తారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయ్ బాగా చదువుకో అని చందు అంటాడు. చందు లోహితతో నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాం.. ఎల్లుండి నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్తాడు. లోహిత షాక్ అయిపోతుంది. నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని లోహిత అంటుంది. వరుణ్‌కి వల వేస్తుంటే ఇప్పుడెవడినో తెస్తున్నారని లోహిత అనుకుంటూ గదిలోకి వెళ్లిపోతుంది.
వరుణ్ చాలా సార్లు లోహితకు కాల్ చేయడంతో చూసి లోహిత కాల్ చేస్తుంది. ఏమైందని అడుగుతుంది. దాంతో వరుణ్ మినిస్టర్ వాళ్లు డిన్నర్‌కి వచ్చారు. ఎల్లుండి నిశ్చితార్థం ఫిక్స్ చేశారని అంటాడు. లోహిత షాక్ అయిపోతుంది. మ్యాడీకి అయినా చెప్పొచ్చు కదా అంటే మ్యాడీ తను లవ్ చేసిన అమ్మాయి కోసం నరకం అనుభవిస్తున్నాడు.. ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదని చెప్పలేదని వరుణ్ అంటాడు. నువ్వు నిశ్చితార్థం చేసుకున్న మరుక్షణం నా శవం చూస్తావ్ అని వరుణ్ని బెదిరిస్తుంది.
మ్యాడీ చిన్ని ఫొటోలు చూస్తూ చాలా ఏడుస్తాడు. వరుణ్ రావడంతో మహి వరుణ్ని హగ్ చేసుకొని ఏడుస్తాడు. చిన్ని నా కళ్ల ముందుకి వచ్చేసింది అన్న టైంకి దూరం చేస్తున్నాడు ఏం పాపం చేశాను బావ అని ఏడుస్తాడు. నా ప్రేమ ఓడిపోతుందేమో అని భయంగా ఉంది బావ అని ఏడుస్తాడు. నీ ప్రేమ ఓడిపోతే ప్రేమ అనే మాటకే అర్థం లేదు.. నీ మంచి మనసుకి ఆ దేవుడే నీ ప్రేమని గెలిపిస్తాడని వరుణ్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















