Ammayi garu Serial Today October 28th: అమ్మాయిగారు సీరియల్: మందారానికి వశమైపోయిన దీపక్! అత్తామామలను కలుపుతాడా!
Ammayi garu Serial Today Episode October 28th దీపక్‌కి మందారం తాయొత్తు కట్టడంతో దీపక్ పూర్తిగా మారిపోయి తల్లికి షాక్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode దీపక్ మందారం మందారం అని పిలిచి మందారం కోసం స్వీట్స్ తీసుకొస్తాడు. విజయాంబిక బిత్తరపోతుంది. మందారం దీపక్ బాబు అని పిలిస్తే అలా పిలొద్దని అందరిలా ఏవండీ అని పిలవమని చెప్పి మందారానికి స్వీట్స్ ఇస్తాడు. విజయాంబిక దీపక్‌కి పిచ్చి పట్టిందా అని అనుకుంటుంది.
కొడుకు ప్రవర్తనకు కళ్లు అప్పగించి చూసి బిత్తరపోతుంది. దీపక్ మందారానికి ప్రేమగా స్వీట్ తినిపిస్తాడు. మందారం ఎమోషనల్ అయిపోతుంది. రాత్రి దీపక్ మందారాన్నికొట్టిన తర్వాత మందారం బాధ పడుతుంటే రాజు, రూపలు మందారాన్ని ఓదార్చి దీపక్ కోమలికి కట్టాలి అనుకున్న తాయొత్తు మందారంతో దీపక్‌కి కట్టిస్తారు. దాంతో దీపక్ మందారం వశమైపోతాడు.
విజయాంబిక దీపక్ దగ్గరకు వెళ్లి నువ్వు దానికి తినిపించడం ఏంట్రా అని అంటుంది. నా పెళ్లామే కదా తప్పేముంది అని దీపక్ అంటాడు. నా కొడుకుకి ఏం మత్తు మందు పెట్టావే.. నిన్ను చూస్తే అసహ్యించుకునే నా కొడుకు నన్ను వదిలేసి నీ వెంట తిరుగుతున్నాడు అని అంటుంది. మందారం డల్ అయిపోతే దీపక్ తల్లితో నా పెళ్లానికి నేను తినిపిస్తే నీకు ఏంటి పైగా మందారం అను అది ఇది అంటే ఊరుకోను అని అంటాడు. ఓరేయ్ అసలు ఏమైంది నీకు అని విజయాంబిక తల పట్టుకుంటుంది. ఇక మందారం అయితే నా భర్తని ఇంకొక్క మాట అన్నా నేను ఊరుకోను అని అంటుంది. నాకే ఎదురు చెప్తావే అని విజయాంబిక మందారాన్ని కొట్టడానికి చేయి ఎత్తితే దీపక్ తల్లి చేయిపట్టుకుంటాడు.
విజయాంబిక బిత్తరపోతుంది. ఇదంతా కలా నిజమా అని మందారం అనుకుంటుంది. దీపక్ మందారంతో ఇలాంటి భార్య నాకు దొరకడం నాకు అదృష్టం రేపు బయటకు వెళ్దాం అంటాడు. మీరు ఇలా ఉంటే నాకు చాలు అని దీపక్, మందారం ఇద్దరూ ఐలవ్‌యూలు చెప్పుకుంటారు. విజయాంబికతో కోమలి దీపక్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని అంటుంది. దీపక్ ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుదాం అని అంటుంది. రాత్రి అమ్మ గదిలోనే పడుకుంటాడు కదా అప్పుడు వాడి సంగతి చెప్తా అని విజయాంబిక వెళ్లిపోతుంది.
దీపక్ మందారం కోసం కాఫీ తీసుకొస్తా అని అంటాడు. ఇంట్లో అందరూ బిత్తరపోతారు. రూప రాజులు ప్లాన్ సక్సెస్ అనుకుంటారు. కోమలి విజయాంబిక దగ్గరకు వెళ్లి నీ కొడుకు నటిస్తున్నాడు అనుకున్నా కానీ అది నిజమైన ప్రేమ నీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుందని చురకలు వేస్తుంది. దీపక్ మందారానికి కాఫీ ఇవ్వడం సూర్యప్రతాప్ చూసి సంతోషపడతాడు. దీపక్ మందారంతో నేను వేరే ఏ ఆడవాళ్లని చూడను ఇక నుంచి నీతో ఉంటాను అని మాటిస్తాడు.
సూర్యప్రతాప్ ఇద్దరి దగ్గరకు వచ్చి మిమల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.. మొదటి సారి నువ్వు ఒక మనిషిలా కనిపిస్తున్నావ్‌రా ఇక నుంచి అయినా మందారాన్ని చక్కగా చూసుకో అని అంటారు. సూర్యప్రతాప్ తమ్ముడికి పెళ్లికి వెళ్దాం అంటే సుమకి బాలేదు నేను రాలేను అంటాడు. తర్వాత వెళ్దాంలే అని సూర్యప్రతాప్ అంటే మీ కోసం ఎదురు చూస్తుంటారు మీరు వెళ్లకపోతే బాగోదు అని చంద్ర అంటాడు. ఇంతలో విరూపాక్షి కూడా అదే పెళ్లికి వెళ్తుంది. దీపక్ కలుగజేసుకొని అయితే వేరు వేరుగా వెళ్లడం ఎందుకు మామయ్య అత్తయ్యగారు మీరు కలిసే వెళ్లండి అని అంటాడు. అందరూ దీపక్ మాటలకు బిత్తరపోతారు. విజయాంబిక అయితే మందారం మందు పెట్టేసిందని అనుకుంటుంది.
సూర్యప్రతాప్‌తో విరూపాక్షి నాతో రావడం ఇష్టం లేకపోతే పర్లేదు అంటే కచ్చితంగా ఇబ్బంది నీ గురించి తెలిసిన వాళ్లు నిన్ను రానివ్వరు అంటే ఎందుకు అలా అంటావ్ అమ్మ మన ఫ్యామిలీ వాళ్లు మనల్ని కూడా పిలవకుండా అత్తయ్యని పిలిచారు. మామయ్య ఒకరు వేలెత్తి చూపే స్థాయిలో మీరు ఉండకూడదు మీరు అత్తయ్య కలిసి వెళ్లండి అని అంటాడు. సూర్యప్రతాప్ విరూపాక్షితో వెళ్లడానికి ఒప్పుకుంటాడు. అందరూ చాలా సంతోషపడతారు. రూప విజయాంబికతో నీ కొడుకు మందారంతో కలిసిపోయాడు.. మా నాన్న అమ్మని క్షమించాడు.. నేను త్వరలో రాజుని నా వైపు తిప్పుకుంటా అందరూ సంతోషంగా ఉంటాం నువ్వు మాత్రం అని విజయాంబికను రెచ్చగొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.



















