Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 28th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: గుడ్డిదైపోయిన లక్ష్మీ! తల మీద బలంగా కొట్టిన అంబిక! విహారి ఏం చేస్తాడు?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode October 28th లక్ష్మీ తల మీద అంబిక కొట్టేయడంతో లక్ష్మీ చూపు పోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకాన్ని రౌడీలు కారులో తీసుకెళ్లడం విహారి చూస్తాడు. సంధ్యకి విషయం చెప్పి విహారి కారుని ఫాలో అవుతాడు. ఓ చోట కారుని ఆపి రౌడీలతో ఫైట్ చేస్తాడు. సంధ్య ఓ వైపు విహారి మరోవైపు రౌడీలను చితక్కొడతారు.
అంబిక దూరం నుంచి మొత్తం చూస్తుంటుంది. లక్ష్మీ దగ్గరకు అంబిక వెళ్లి విహారి, సంధ్య చూడకుండా లక్ష్మీ తల మీద తల పగిలేలా కొట్టేస్తుంది. లక్ష్మీ కళ్లు తిరిగి పడిపోతుంది. సంధ్య, విహారి ఇద్దరూ లక్ష్మీని కారులో ఎక్కించుకొని హాస్పిటల్‌కి వెళ్తారు. డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారు. లక్ష్మీకి ఏం కాదని సంధ్య విహారికి ధైర్యం ఇస్తుంది. డాక్టర్ బయటకు వచ్చి లక్ష్మీకి బాగానే ఉంది కానీ తల మీద గట్టిగా దెబ్బ తగలడం వల్ల 80 శాతం లక్ష్మీ కంటి చూపు కోల్పోయింది అని విజువల్ డల్ నెస్ ఉందని నాలుగు రోజులు వరకు చూడండి కనిపించకపోతే ఐ స్పెషలిస్ట్‌కి చూపించాలి అంటారు.
విహారి డాక్టర్‌తో నయం అయ్యేవరకు లక్ష్మీకి ఏం కనిపించదా అంటే కనిపించదు అని డాక్టర్ చెప్తారు. విహారి, లక్ష్మీల కోసం యమున, పండు వెయిట్ చేస్తూ ఉంటారు. లక్ష్మీ ఇంటికి వచ్చి సరిగా కనిపించక ఇబ్బంది పడుతూ ఉంటే యమున చూసి కంగారు పడుతుంది. లక్ష్మీకి ఏమైందని అడుగుతుంది. లక్ష్మీకి కళ్లు పోయావని విహారి చెప్పడంతో యమున, పండు షాక్ అయి ఏడుస్తారు. జరిగింది తెలుసుకొని యమున చాలా ఏడుస్తుంది. లక్ష్మీని పట్టుకొని ఏడుస్తుంది. లక్ష్మీ కూడా ఏడుస్తుంది.
యమున లక్ష్మీని ఇంటికి తీసుకెళ్తుంది. విహారి అందరితో ప్రమాదంలో లక్ష్మీకి చూపు పోయింది అని చెప్తాడు. పద్మాక్షి నవ్వుకున్నా సహస్ర చాలా ఫీలవుతుంది. అంబిక ఏం తెలీనట్లు నటిస్తూ లోపల మాత్రం సరదా పడిపోతుంది. ఊరు వచ్చిన లక్ష్మీ తన పనులు కాకుండా అన్ని విషయాల్లో తలదూర్చి ఇలాంటి పరిస్థితి తెచ్చుకుందని అంబిక, పద్మాక్షి అంటారు. విహారి వాళ్లతో కళ్లు పోయావని తను బాధ పడుతుంటే మీరు ఇలా మాట్లాడుతారేంటి అని విహారి అంటాడు. ఈ టైంలో జాలి చూపించాలి కానీ ద్వేషం కాదు అని చారు కేశవ అంటాడు. తను అక్కడికి రాకపోయి ఉంటే ఇలా జరిగేదు కాదు అని అంబిక అంటుంది.
పద్మాక్షి, అంబికలు లక్ష్మీని అంటూ ఉంటే విహారి అడ్డుకుంటూ ఉంటాడు. సహస్ర ఇక టాపిక్ వదిలేయండి అని చెప్తుంది. యమున, వసుధలు లక్ష్మీని గదిలోకి తీసుకెళ్తారు. సహస్ర అంబికను పక్కకు తీసుకెళ్తుంది. లక్ష్మీ ఎలా తప్పించుకుంది అంటే రౌడీలు చేసిన చిన్న తప్పు వల్ల పోలీసులకు సమాచారం ఇచ్చిందని అంటుంది. ఇప్పటికే దాన్ని బావని విడదీయలేకపోయా ఇప్పుడు దానికి చూపు లేదు అని బావ దానికే అతుక్కుపోతాడు అని సహస్ర మనసులో అనుకుంటుంది. విహారి లక్ష్మీ గురించి బాధ పడుతూ లక్ష్మీ ఎలా ఉందో ఏంటో అని లక్ష్మీ గదిలోకి వెళ్తాడు. లక్ష్మీ దాహం వేసి వాటర్ కోసం లేచి బాటిల్ తోసేస్తుంది. గ్లాస్ కూడా పగిలి లక్ష్మీ కాలికి తగిలిపోతుంది. విహారి వెళ్లి చూసి లక్ష్మీతో జాగ్రత్తగా ఉండాలి కదా ఏమైనా కావాలి అంటే నన్నో పండునో పిలవాలి కదా అంటాడు. లక్ష్మీకి వాటర్ బాటిల్ ఇస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















