Nindu Manasulu Serial Today October 28th: నిండు మనసులు: ప్రేరణ సిద్ధూ ఇంటికి వెళ్తుందా? విజయానంద్ కోరిక నెరవేరుతుందా?
Nindu Manasulu Serial Today Episode October 28th సిద్ధూ ప్రేరణని దీపావళి పండగకు ఇంటికి పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ గణతో మాట్లాడిన మాటల గురించి ఇందిర ఇంటి దగ్గర కూతుర్ని నిలదీస్తుంది. నీకు వాళ్ల గురించి ఇంకా పూర్తిగా తెలీదు అమ్మ.. వాళ్లు నేను చేసిన దానికి రివర్స్ అవుతారు అందుకే నిన్ను పనిలో తీసేయ్ మంటే వాళ్లు ఉంచారు అని ప్రేరణ అంటుంది. వాళ్ల ముందు నిలబడాలి అంటే ధైర్యం ఒక్కటే ఆయుధం అని ప్రేరణ అంటుంది.
ఇందిర తనకు భయంగా ఉంది అంటే దానికి సుధాకర్ వాళ్లు పనిలో తీసేస్తారు అని అంటే భయపడుతున్నావ్ కానీ వాళ్లింట్లో పనిలో చేరినప్పుడు భయం లేదా అని అంటాడు. నీ తెలివికి నువ్వు ఐఏఎస్ అవ్వడం పక్కా ప్రేరణ అని సుధాకర్ అంటాడు. ఇక ఇందిర కూతురితో మీ నాన్నని నీకు దగ్గర చేయడానికి నాకు ఇది ఒక్కటే మార్గం నీ ఆవేశంతో అది దూరం చేయొద్దు అని అంటుంది.
మంజుల చాలా సంతోషంగా కొడుకుకి భోజనం వడ్డిస్తుంది. తానే సిద్ధూకి తినిపిస్తుంది. విజయానంద్ ఉడికిపోతాడు. మంజుల సిద్ధూకి తినిపిస్తే సాహితి ఏంటి అమ్మా కూతుళ్లు ఎంత ప్రేమ చూపించినా మీకు కొడుకులు అంటేనే ఇష్టం.. ఇన్నేళ్లలో నాకు అలా వడ్డించావా.. నాకు తినిపించావా అని అంటుంది. విజయానంద్‌కి కంప్లైంట్ ఇస్తే అందరూ అమ్మలు అంతే అమ్మా ఏం చేయలేం అంటాడు. సిద్ధూ చెల్లితో ఎందుకే అంత ఉడికిపోతావ్ నేను రికమండ్ చేయనా అమ్మ నీకు తినిపిస్తుంది అని అంటాడు. నేను రెడీ అమ్మా నాకు తినిపిస్తావా అని సాహితి అడుగుతుంది.
మంజుల కూతురితో ఏంటే నీకు తినిపించేది ఒంటి మీదకి 20 ఏళ్లు వచ్చాయ్ తినవే అంటుంది. ఆరు అడుగుల ఉన్న కొడుకుకి ముద్దులు 5 అడుగుల ఉన్న నాకు సుద్దలా ఈ విషయంలో నేను కోర్టుకి వెళ్తా అని సాహితి అంటుంది. ఇక విజయానంద్ సిద్ధూతో ఇన్నాళ్లకు మా కోరిక నెరవేరింది నువ్వు మా ఇంటికి వచ్చేశావ్.. ఇక నీకు బిజినెస్‌లు ఇచ్చేసి నేను రిలాక్స్ అయిపోవాలి అనుకుంటున్నా అని అంటాడు. సిద్ధూ చాలా కోపంగా చూస్తాడు. విజయానంద్ సిద్ధూని రేపు ఆఫీస్‌కి రా నిన్ను సీఈఓని చేస్తా అంటే సిద్ధూ నేను రాను అనేస్తాడు.
విజయానంద్ సిద్ధూతో అదేంటి నాన్న రేపు మంచి రోజు అంటే నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మని చెల్లిని చూసుకోవడానికి అంతే కానీ కోట్ల కోసం కాదు అని అంటాడు. విజయానంద్ మళ్లీ పిలిస్తే నాకు టైం లేదు ఇష్టం అంతకంటే లేదు.. నాకు కేఫ్ ఉంది నాకంటూ లక్ష్యం ఉంది అని అంటాడు. సివిల్స్ నేను కంప్లీట్ చేయాలి అని అంటాడు.ఈ డబ్బు హోదా ఆస్తి అంతస్తు అంతా మీ ప్రోపర్టీ ఆ కేఫ్ నా ఐడెంటిటీ దాన్ని నేను వదులుకోలేను అంటాడు.
మంజుల సిద్ధూని ఒప్పించాలి అనుకుంటుంది. విజయానంద్ కూడా ఇంకా టాపిక్ లాగితే సాహితి తండ్రితో రేపు దీపావళి అవన్నీ వదిలేయ్ అన్నయ్య నాతో షాపింగ్‌కిరా.. అని చెప్పి తన ఫ్రెండ్స్‌ని పిలుస్తా అంటుంది. విజయానంద్ సిద్ధూతో నీ ఫ్రెండ్ ప్రేరణని కూడా పిలు అని అంటాడు. సిద్ధూ తల్లితో తనని పిలవనా అంటే మంజుల ఓకే అంటుంది. విజయానంద్ మనసులో ఆ ప్రేరణ ఇక్కడికి వస్తే కదా నేను అనుకున్నది జరిగేది అని అనుకుంటాడు.
ప్రేరణ దగ్గరకు ఐశ్వర్య వచ్చి అందరూ దీపావళి గ్రాండ్‌గా చేసుకుంటున్నారు. మనం మాత్రం ఏంటి అక్క నాన్న లేకుండా ఇలా ఉన్నాం అని అంటుంది. వచ్చే దీపావళికి నాన్న మనతో ఉంటారు అని ప్రేరణ అంటుంది. ఇక సిద్ధూ ప్రేరణకు వీడియో కాల్ చేస్తాడు. పండగకు నువ్వు రేపు మా ఇంటికి రావాలి అని అంటాడు. ప్రేరణ కంగారు పడుతుంది.. నేనా అంటే ఈ ఒక్కసారికి రా ఇంకెప్పుడు ఏం అడగను అని అంటాడు. దాంతో ప్రేరణ ఓకే చెప్తుంది. ఐశ్వర్య అక్క మీద సెటైర్లు వేస్తుంది.
సిద్ధూ పడుకొని ఉంటే సాహితి వెళ్లి బాంబ్ పేల్చుతుంది. దాంతో సిద్ధూ సాహితిని వెంట పడతాడు. అమ్మకి చెప్తుంది. అమ్మ కాదు ఎవరు అడ్డు పడినా వదలను అని సిద్ధూ పరుగులు పెడతాడు. సాహితి తండ్రి దగ్గరకు వెళ్తుంది. ఈ నవ్వులే మేం మిస్ అయ్యాం ఇప్పుడు హ్యాపీగా ఉందని విజయానంద్ అంటే నేను మీకు బోర్ అయిపోయానా అని సాహితి అంటుంది. ఇక మంజుల కొడుకుని తలంటు స్నానం చేయిస్తా అని అంటుంది. అవేవీ వద్దు అని సిద్ధూ అంటాడు. మొత్తానికి మంజుల ఇంట్లో సందడి సందడిగా ఉంటుంది.
గణ సాహితికి కాల్ చేసి ఫోన్ దొరికింది ఇంటి అడ్రస్ చెప్పండి వచ్చి ఇస్తా అంటాడు. వద్దు నేనే వస్తా అని సాహితి అంటే గణ వద్దని అంటాడు. అడ్రస్ చెప్పమని అంటాడు. ఇక సాహితి గణకి లోకేషన్ పెడుతుంది. గణ తనలో తాను నీ దృష్టిలో ఆ మాత్రం మంచోడిని అనిపించుకోకపోతే ఎలా నిన్ను ట్రాప్ చేయగలను అని అనుకుంటాడు. ప్రేరణ రెడీ అయి బట్టల కోసం చూస్తే బీరువాలో బెడ్ మీద ఎక్కడా బట్టలు ఉండవు. చెల్లిని అడిగితే తనకు తెలీదు అని కాకి ఎత్తుకెళ్లుంటుంది అంటుంది. నాతో ఆడుకోకే నేను సిద్దూ వాళ్ల ఇంటికి వెళ్లాలి అంటే చీర కట్టుకొని వెళ్లు అని చెల్లి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















