Ammayi garu Serial Today October 23rd: అమ్మాయి గారు సీరియల్: ఎలక్షన్లో గెలిచేసిన సూర్యప్రతాప్.. తలపట్టుకున్న జీవన్ గ్యాంగ్!
Ammayi garu Today Episode బ్యాలెట్ బాక్స్‌లు దొంగిలించిన జీవన్ బ్యాచ్ సూర్యప్రతాప్ ఓడిపోతాడని అనుకుంటే సూర్య గెలిచేయడంతో తలపట్టుకొని బిత్తరపోతారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode ఎలక్షన్ పూర్తయిపోతుంది. మంచి ఓటింగ్ నమోదు అవుతుంది. అందరూ రిజల్స్ కోసం టీవీలకు అతుక్కుంటారు. ఇక రూప ఇంట్లో వాళ్లతో రిజల్స్ వచ్చే వరకు అయినా వేరే టాపిక్ మాట్లాడుకుందామని అంటే టీవీ ఛానెల్ మార్చుతారు. ఇంతలో హోటల్‌లో ప్రేమ జంట దొరికిందని వాళ్లకి అక్కడికి అక్కడే పెళ్లి చేశాం అని గౌతమ్, రేణుకల్ని చూపిస్తారు. అందరూ షాక్ అయిపోతారు. జీవన్ వాళ్లు కూడా షాక్ అయిపోతారు.
రూప, రాజుల కోసం ఇద్దరూ తెగ ఆరాట పడి చివరకు ఈ దుర్మార్గులు ఒక్కటయ్యారని అనుకుంటారు. ఇకనైనా వాళ్లు సంతోషంగా ఉండాలని సూర్యప్రతాప్ అంటాడు. ఇక జీవన్, శ్వేతలు ఇలా జరిగిందేంటని షాక్ అవుతారు. మరోవైపు రాజు ఇంట్లో అందరూ మంచి పని జరిగిందని అనుకుంటారు. రాత్రి గౌతమ్, రేణుకలు జీవన్, శ్వేతల దగ్గరకు వెళ్తారు. రేణుక ఏడుస్తూ కూర్చొంటుంది. నా జీవితం ఆగం చేశావని ఏడుస్తుంది. ఇంతలో విజయాంబిక, దీపక్‌లు వచ్చి ఏంటి మీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నాంటి అని అడిగితే రేణుక ఏడుస్తూ పోలీసులు పెళ్లి చేశారని చెప్తుంది. ఇక గౌతమ్ జరిగిందంతా విజయాంబిక వాళ్లకి చెప్తారు. బ్యాలెట్ బాక్స్‌లు ఏం చేశారని అంటే భద్రంగా ఉన్నాయని అంటాడు గౌతమ్. ఇక రేణుక, గౌతమ్ ఇద్దరూ నువ్వు నాకు నచ్చవంటే నువ్వు నాకు నచ్చవని అంటారు. ఇక విజయాంబిక గొర్రె కంటే గౌతమ్ బెటరే అని రేణుకకు సెటైర్లు వేస్తుంది.
ఉదయం కార్యకర్తలు ఇళ్ల దగ్గర సందడి చేస్తుంటారు. అందరూ టీవీళ్లకు అతుక్కుంటారు. ముత్యాలు వాళ్లు పెద్దయ్య గారు గెలుస్తారని అనుకుంటారు. ఇక సూర్యప్రతాప్‌కి జీవన్ గట్టి పోటీ ఇస్తున్నాడని టీవీల్లో వస్తుంది. అది చూసి జీవన్ వాళ్లు సంతోష పడితే సూర్య ప్రతాప్ వాళ్లు డల్ అయిపోతారు. మొదటి రౌండ్‌లో జీవన్ ముందంజలో ఉంటే రెండో రౌండ్‌లో సూర్యప్రతాప్ ముందంజలో ఉంటాడు. ఇక ఒకసారి జీవన్ ఒకసారి సూర్యప్రతాప్ ముందంజలో ఉంటారు. జీవన్ ముందంజలో ఉండటంలో అందరూ ఆ రౌడీ ముందంజలో ఉండటం ఏంటి అని అనుకుంటారు.
ఇక గౌతమ్ జీవన్‌తో మనమే గెలుస్తామని బ్యాలెట్ బాక్స్‌లే మనల్ని గెలిపిస్తాయని అంటాడు. సూర్యప్రతాప్ తరఫు వాళ్లు జీవన్‌కి సపోర్ట్ చేయడం ఏంటి ఏమైనా ట్యాంపరింగ్ చేస్తున్నాడా అని అంటే సూర్యప్రతాప్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అంటాడు. అందరూ సూర్యప్రతాప్ గెలవాలని మొక్కుకుంటారు. ఇక జీవన్ తరపు వాళ్లు జీవన్ గెలవాలని మొక్కుకుంటారు. ఇంతలో జీవన్ మీద 470 ఓట్లతో సూర్యప్రతాప్ విజయం సాధించాడని చెప్పడంతో ముత్యాలు ఇంట్లో సంబరాలు మొదలవుతాయి. జీవన్ అరిచి గోల చేస్తాడు. రేణుక తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయినందుకు నెత్తిన కొంగు కప్పుకొని ఏడుస్తుంది. అందరూ సంబరాలు చేసుకుంటారు. జీవన్ దగ్గర నుంచి కార్యకర్తలు వెళ్లిపోతారు.
రూప రాజుకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తుంది. ఇప్పుడేం చేయాలని జీవన్ తల పట్టుకుంటాడు. స్వల్ప ఓట్లతో ఓడిపోయాం అంటే రీ కౌంటింగ్‌కి వెళ్దామని అంటుంది శ్వేత. పోస్టల్ బ్యాలెట్లు దొంగిలించినా సూర్యప్రతాప్ గెలిచాడు అంటే నమ్మబుద్ధి కావడం లేదని జీవన్ అంటే క్లాప్స్ కొట్టుకుంటూ రూప, రాజులు అక్కడికి వచ్చి గౌతమ్, రేణుకలకు కంగ్రాట్స్ చెప్తారు. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సత్య మీద సంజయ్ కళ్లు, వంకర మాటలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి భర్తకి కంప్లైంట్ ఇచ్చిన సత్య!