Ammayi garu Serial Today May 5th: అమ్మాయి గారు సీరియల్: బంటీని దీపక్ చంపేస్తాడా.. యాగం ఆగిపోతుందా.. ఆస్తి దక్కెదెవరికి!
Ammayi garu Today Episode రూప ఆస్తి ట్రస్ట్‌కి ఇచ్చేస్తుందని దీపక్ బంటీని కిడ్నాప్ చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode చండీయాగం తర్వాత బంటీ గురించి రూప, రాజులు సూర్యప్రతాప్‌కి చెప్పాలని అనుకుంటారు. విరూపాక్షి బంటీని తీసుకొని వస్తుంటుంది. అమ్మానాన్న బాగా గుర్తొస్తున్నారని బాగా ఇన్నాళ్లకు నా బాధ అర్థం చేసుకొని నన్ను మా అమ్మానాన్నల దగ్గరకు తీసుకెళ్తున్నాడు అని అంటాడు. దానికి విరూపాక్షి బాగా కరుణిస్తే నువ్వు నీ తల్లిదండ్రులతోనే ఉంటావని అంటుంది.
విజయాంబిక దేవుడికి దండం పెట్టుకుంటుంది. విరూపాక్షి, సూర్యప్రతాప్ కలవకూడదు అని ఆస్తి మొత్తం తనకే దక్కాలని అలా అయితే మొక్కలు చెల్లిస్తానని అంటుంది. సూర్యప్రతాప్ వాళ్లు దేవుడిని దర్శనం చేసుకుంటారు. దేవాలయం ట్రస్ట్ అధికారులను పిలుస్తారు. రూప ఓ నిర్ణయం తీసుకుందని తన యావత్‌ఆస్తిని తమ తదనాంతరం ట్రస్ట్‌కి దక్కేలా రాయిస్తామని అంటారు. దానికి పెద్దలు ఇప్పటికే గుడి కోసం చాలా చేశారు ఇంకా ట్రస్ట్‌కి మీ ఆస్తులు మొత్తం ఇచ్చేయాలి అంటున్నారు అంటే మీ పెద్ద మనసుకి చాలా థ్యాంక్స్ అని పొగుడుతారు. చండీయాగం తర్వాత ఆస్తి రాసిస్తామని అంటారు. పంతులు చండీయానికి టైం అయిందని అంటారు.
రాజు విరూపాక్షికి కాల్ చేసి త్వరగా రమ్మని చెప్తాడు. గుడికి దగ్గరిలోనే ఉన్నామని చెప్తుంది. పూజ కోసం చీర తీసుకురమ్మని పంతులు సుమ వాళ్లని పంపుతారు. విజయాంబిక దీపక్‌తో మన వాళ్లకి చెప్పు విరూపాక్షి బంటీని తీసుకొని రాకూడదని చెప్తుంది. దీపక్ మనుషులకు కాల్ చేసి విషయం చెప్తాడు. చండీయాగం అవ్వకముందే బంటీ చావు కబురు వింటారని అంటాడు. విరూపాక్షి వస్తున్నా కారుని రౌడీలు అడ్డగిస్తారు. డ్రైవర్‌ని, విరూపాక్షిని తోసేసి బంటీని అదే కారులో తీసుకెళ్లిపోతారు. విరూపాక్షి కారు వెనకాలే ఏడుస్తూ పరుగులు తీస్తుంది. విజయాంబికనే తన బండారం బయట పడుతుందని ఇలా చేసిందని అనుకుంటుంది విరూపాక్షి. వెంటనే రాజుకి కాల్ చేసి విషయం చెప్తుంది. విరూపాక్షి ఏడుస్తూ విషయం చెప్పడంతో రాజు సూర్యప్రతాప్‌కి విషయం తెలీకుండా వస్తానని చెప్తాడు. విరూపాక్షి రాజుకి లొకేషన్ పెడుతుంది.
రాజు కంగారు పడటం చూసి సూర్యప్రతాప్ ఏమైందని అడిగితే అమ్మగారి కారు టైర్ పోయిందని తనని రమ్మన్నారని చెప్తాడు. సూర్యప్రతాప్ రాజుని వెళ్లిమని చెప్తాడు. రూప అమ్మవారి చీర కట్టుకొని వస్తుంది. సూర్యప్రతాప్ రూపని ఆశీర్వదించి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి అంటాడు. రూపని హోమం దగ్గర కూర్చొపెడతారు. రాజు ఫాస్ట్‌గా లొకేషన్‌కి చేరుకుంటాడు. విరూపాక్షిని తీసుకొని రాజు బంటీని తీసుకెళ్లిన వైపు వెళ్తాడు. ఎటు వెళ్లాలో తెలీక ఇబ్బంది పడతారు. దీపక్ రౌడీలకు కాల్ చేసి మీరు కానీ బంటీ కానీ రాజుకి దొరకకూడదని అంటాడు. రాజు, విరూపాక్షి ఇంకా రాలేదని అందరూ చూసుకుంటారు. బంటీ రౌడీలను బతిమాలుతాడు. బంటీని రౌడీలు పొడిచే టైంకి రాజు, విరూపాక్షిలు వచ్చి కాపాడుతారు. రాజు రౌడీలను చితక్కొడతాడు. విరూపాక్షి రాలేదని పంతులు హడావుడి చేస్తుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!





















