Ammayi garu Serial Today May 22nd: అమ్మాయి గారు సీరియల్: రుక్మిణి రాఘవ కూతురా.. సూర్య ఇంట్లో చిచ్చు పెట్టిన లెటర్!
Ammayi garu Today Episode రాఘవ విరూపాక్షికి లెటర్ రాయడం అందులో రుక్మిణి తమ కూతురు అని ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్, విరూపాక్షిల పెళ్లి రోజు వేడుకను రుక్మిణిగా ఉన్న రూప, రాజులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు. సూర్యప్రతాప్, విరూపాక్షి ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుంటే రుక్మిణి ఫొటోలు తీస్తుంది. అది చూసి తల్లీకొడుకులు రగిలిపోతారు. ఆ వేడుకను ఎలా అయినా ఆపాలని విజయాంబిక, దీపక్ ప్లాన్ చేస్తారు. ప్లాన్‌లో భాగంగా ఓ పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
సూర్యప్రతాప్ మనసులో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు.. ఇలాంటి రోజు ఇదే చివరి రోజు అవ్వాలి అనుకుంటాడు. విరూపాక్షి మనసులో ఇలాంటి రోజు వస్తుంది అనుకోలేదు నా బిడ్డ వల్ల నేను సూర్య కలుస్తామని నమ్మకం వచ్చిందని అనుకుంటుంది. ఇంతలో ఇంటికి కొరియర్ తీసుకొని ఓ వ్యక్తి వస్తారు. రుక్మిణి తల్లీదండ్రులకు దండలు మార్చుకోమని అంటుంది. ఇదే ఆఖరిది ఇంకేం లేదని చెప్తాడు. సూర్యప్రతాప్ మెడలో విరూపాక్షి దండ వేస్తుంది. సూర్యప్రతాప్ విరూపాక్షి మెడలో దండ వేసే టైంకి కొరియర్ వస్తుంది. తర్వాత చూద్దాం అని బంటీ అంటే విజయాంబిక దీపక్‌ని చూడమని అంటుంది. సూర్యప్రతాప్ ఆపి పరాయివాళ్లది వాళ్లు చూసుకుంటారులే అనుకుంటారు.
విజయాంబిక కొడుకుతో ఆ లెటర్ బయటకు చదివితే కదా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందని అనుకుంటారు. విరూపాక్షి రాజుకి తీసి చూడమని అంటుంది. రాజు దాన్ని తీసుకుంటాడు. దాని మీద ఫ్రం అడ్రస్ లేదని అంటాడు. విజయాంబిక కావాలనే డౌట్ కలిగిస్తుంది. రాజు దాన్ని తీసి చూస్తాడు. అందులో ప్రియమైన విరూపాక్షికి ప్రేమతో నీ రాఘవ అని లెటర్ ఉంటుంది. రాజు అది చదివి ఆగిపోతాడు. ఇదేదో కుట్రలా ఉందని రూప అనుకుంటుంది. సూర్యప్రతాప్ చదవమని అంటాడు. రాజు కవర్ చేస్తే అందరూ చదవమని అంటారు.
దీపక్ లెటర్ తీసుకొని చదువుతాడు.. ప్రియాతి ప్రియమైన నా విరూపాక్షికి ప్రేమతో నీ రాఘవ. అనగానే విరూపాక్షి షాక్ అయిపోతుంది. అది వినగానే బంటీని సూర్యప్రతాప్ లోపలికి పంపేస్తాడు. మన ప్లాన్ ప్రకారమే మన బిడ్డ అక్కడ క్షేమంగా ఉందా.. ఎవరికీ అనుమానం రాకుండా మ్యానేజ్ చేస్తుంటే వాళ్లంతా నమ్ముతున్నారా.. మన వ్యవహారం గురించి నమ్మించిన మనం ఇది నమ్మించడం పెద్ద పని కాదు కదా అని దీపక్ చదువుతాడు. ఇదంతా అబద్ధం ఎవరో కావాలని ఆడుతున్నా నాటకం అని విరూపాక్షి ఏడుస్తుంది. సూర్యప్రతాప్ చదవమని అంటాడు. దీపక్ చదువుతాడు. విరూపాక్షి మన అదృష్టం ఏంటి అంటే రూప లాగే మన అమ్మాయి కూడా పుట్టడం.. పెద్దయ్య గారు నమ్మడానికి ఉన్న ఒకే ఒక కారణం కూడా మన రుక్మిణినే అని చదువుతారు. అది సూర్యప్రతాప్ రుక్మిణి రాఘవ కూతురు అని అనుకుంటాడు. రూప చాలా కంగారు పడుతుంది. అందరూ టెన్షన్ అవుతారు. దీపక్, విజయాంబికలు పక్కా ప్లాన్‌తో ఇలా లెటర్ రాస్తారు.
రాజు, రూపలు ప్రయత్నించినా నేను నిజం చెప్పడానికి వచ్చినట్లే వచ్చి మాయం అయిపోతున్నాను అని ఇంకోసారి దొరకకుండా నేను జాగ్రత్త పడతా నువ్వు జాగ్రత్త పడు మనం ప్లాన్ చేసినట్లు నువ్వు మన బిడ్డతో పాటు ఆస్తి కూడా తీసుకొస్తావని అనుకుంటున్నా అని అంటాడు. లెటర్ నిజమే అని సూర్యప్రతాప్ నమ్మేస్తాడు. ఎవరు ఎంత చెప్పినా వినకుండా కేక్ కింద పడేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. విరూపాక్షి మీద సూర్యప్రతాప్ అరుస్తాడు. రుక్మిణి రాఘవ విరూపాక్షిల కూతురే అనిపిస్తుందని విజయాంబిక అంటుంది. విరూపాక్షి మండిపోయి విజయాంబిక చెంప పగలగొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: జల జల జలపాతం నువ్వు.. దేవా, మిథునలతో జలకాలాటాడించిన బామ్మ!





















